Take a fresh look at your lifestyle.

‘‘హింసా దృక్పథం వినాశహేతువు’’

“నైతిక విలువలకు, సభ్యత సంస్కారాలకు పెట్టింది పేరయిన భారతదేశంలో కూడా పాశ్చాత్య ధోరణి పెరిగింది. ర్యాగింగ్‌ ‌మనస్తత్వాలు పెరిగి బంగరు జీవితాలు బుగ్గి పాలవుతున్నాయి. ‘‘ర్యాగింగ్‌’’  ఒక మానసిక రుగ్మత అని ఏనాడో వైద్యులు ధృవీకరించారు. కరోనా సంక్షోభంలో కూడా స్త్రీ, పురుష లింగ వివక్షత లేకుండా పలువురు గృహ హింసకు గురరౌతున్నట్టు అనేక నివేదికలు సూచిస్తున్నాయి.  మాదకద్రవ్యాల వ్యసనం మరో రకమైన మానసిక వ్యాధి.   యువశక్తి నిస్తేజమై పోతున్నది.  మత్తులో ముంచెత్తే  మాదకద్రవ్యాల ప్రక్రియ  మొదలైంది. ఇది మన దేశ ఆర్ధిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడానికి పన్నిన  కుట్ర.”

హింసించడం, వంచించడం, ద్వేషించడం లక్షణాలు మానవ నాగరికతకు గొడ్డలిపెట్టు. నాగరికంలో అనాగరికం పెరిగిపోయింది. హింసించడం మానవ జీవితంలో నిత్యకృత్యంగా మారింది..ప్రపంచ వ్యాప్తంగా హింసా దృక్ఫథం విస్తరించింది. ఉగ్రవాదం  మనుషులను చంపే రాక్షస క్రీడ కొందరిదైతే, కారణ రహితంగా తోటి మనుషులను హింసించే క్రీడా విన్యాసం మరికొందరిది. భౌతిక హింసతో తృప్తి పొందే వారు కొందరైతే మానసిక హింసతో మురిసిపోయేవారు మరికొందరు. మాటలతో, చేష్ఠలతో హింసించి క్షోభపడితే ఆనందాన్ని వెతుక్కునే మనస్తత్వం మరికొందరిది.

మనోవికారాలు-మానసిక జాఢ్యాలు వ్యక్తిగతమైనవే కావు. ఈ రుగ్మతలు సమాజానికి పెను ప్రమాదం. ఒకరి జీవితంలో మరొకరు జోక్యం చేసుకుంటూ తగువులు పెట్టేది కొందరైతే, లేనివి ఉన్నట్లు కల్పించి, ఇతరుల జీవితాలలో చిచ్చుపెట్టి, కొందరి మరణాలకు కారకులౌతున్న వారు ఇంకొందరు. నలుగురు ఒకచోట కలిస్తే వేరేవారిపై వ్యాఖ్యనాలు చేసి ఈ నలుగురే బయటకొచ్చి ఒకరిపై ఒకరు దుష్ఫ్రచారాలు.  కారణ రహిత విధ్వంస మనస్తత్వాలు బహు ప్రమాదకరం. యువత నుండి మధ్యవయస్కులు, వృద్దులు ఒకరేమిటి ఈ  మానసిక రుగ్మతలకు కుల,మత,ప్రాంతీయ బేధాలు లేనే లేవు. విద్యావంతులు,విద్యావిహీనులనే వ్యత్యాసమే అగుపించదు.

చరవాణిలో చాటింగ్‌ ‌లేకపోతే మనోవ్యాకులత చెందేవారిని చూస్తున్నాం. సెల్ఫీల పిచ్చితో  ప్రమాదాల్లో మరణించేవారిని, పబ్జీ గేములతో వ్యసన పరులుగా మారి, సమాజానికి అత్యంత భారమై తల్లి దండ్రులకు మనోవ్యాకులతను కలిగిస్తున్న యువత సంగతి తెలుసు. యువత కళాశాలల్లో తమ జూనియర్లను వేధించే సంస్కృతి వేలం వెర్రి. పాఠశాల విద్య ముగించుకుని పట్టణాలలో, నగరాల్లో ఉన్నత చదువుల కోసం  అడుగిడుతున్న అమాయక  గ్రామీణ ప్రాంత యువత ర్యాగింగ్‌ ‌భూతానికి బలైపోతున్నది. వెర్బల్‌ అబ్యూస్‌, ‌ఫిజికల్‌ అబ్యూస్‌ ‌లాంటి అవాంఛనీయ చేష్ఠలకు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతు న్నారు.

నైతిక విలువలకు, సభ్యత సంస్కారాలకు పెట్టింది పేరయిన భారతదేశంలో కూడా పాశ్చాత్య ధోరణి పెరిగింది. ర్యాగింగ్‌ ‌మనస్తత్వాలు పెరిగి బంగరు జీవితాలు బుగ్గి పాలవుతున్నాయి. ‘‘ర్యాగింగ్‌’’  ఒక మానసిక రుగ్మత అని ఏనాడో వైద్యులు ధృవీకరించారు. కరోనా సంక్షోభంలో కూడా స్త్రీ, పురుష లింగ వివక్షత లేకుండా పలువురు గృహ హింసకు గురరౌతున్నట్టు అనేక నివేదికలు సూచిస్తున్నాయి.  మాదకద్రవ్యాల వ్యసనం మరో రకమైన మానసిక వ్యాధి.   యువశక్తి నిస్తేజమై పోతున్నది.  మత్తులో ముంచెత్తే  మాదకద్రవ్యాల ప్రక్రియ  మొదలైంది. ఇది మన దేశ ఆర్ధిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడానికి పన్నిన  కుట్ర.

ఇలాంటి రుగ్మతలతో సమాజానికి తీరని ద్రోహం చేస్తున్నాం. తిలా పాపం తలాపిడికెడు. మానవత్వం, మంచితనం, పరోపకారం, సత్ప్రవర్తన మాత్రమే దైవానుగ్రహానికి అర్హం.’’అతి సర్వత్ర వర్జయేత్‌ ‘‘ అన్నారు. ప్రత్యేక దర్శనాలతోనో, నిరంతర జప,తప విన్యాసాలతోనో,  చిత్తశుద్ధి లేనిదే దైవానుగ్రహం సాధ్యంకాదు. స్వామీ వివేకానంద హితవచనాలే ప్రపంచానికి అనుసరణీయాలు.   హింస, అత్యాచారాలు, నోటి దురుసుతనం, శీలహననం, అహంకారం, వాక్కాలుష్యం ఇవన్నీ  మనిషిని దిగజార్చే మనో వ్యాధులు. ప్రపంచంలో జరిగే ప్రతీ అసహజ ప్రక్రియకు మానసిక రుగ్మతలే కారణం. ఈ మానసిక రుగ్మతల నివారణకు చిత్తశుద్ధితో కూడిన ఆధ్యాత్మిక చింతన, నైతిక ప్రవర్తన,అభ్యుదయ భావాల  ఆలోచనా సరళి నిజమైన ఔషధాలు. మాటలో కరుకుదనం- మనసులో మాలిన్యం త్యజించాలి. ఆధ్యాత్మిక ప్రసంగాల వలన, ప్రవచనాల వలన మానసిక శాంతి చేకూరు తుందనడంలో సందేహం లేదు. .
– సుంకవల్లి సత్తిరాజు.
                మొబైల్‌ ‌నెంబర్‌: 9704903463.

Leave a Reply