Take a fresh look at your lifestyle.

శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు పనితీరు బేష్‌

  • తెలంగాణలో ఎలాంటి అల్లర్లు,గొడవలు లేకుండా చర్యలు
  • కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌రూమ్‌ ‌ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌

‌గత ఆరేళ్లలో రాష్ట్ర పోలీసుల పనితీరు అద్భుతంగా ఉందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌ప్రశంసించారు. శాంతి భద్రతలు, రక్షణ విషయంలో నగరానికి మంచి పేరు తెచ్చారు అని కొనియాడారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో పోలీసుల పాత్ర కీలకమైనది అని తెలిపారు. బంజారాహిల్స్‌లో అధునాతన టెక్నాలజీతో నిర్మిస్తున్న కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌రెండు నెలల్లో అందుబాటులోకి వొస్తుందన్నారు. ఈ కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. గచ్చిబౌలిలో కమాండ్‌ ‌కంట్రోల్‌ అం‌డ్‌ ‌డేటా సెంటర్‌ను హోంమంత్రి మహమ్మద్‌ అలీతో కలిసి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల పాలనలో ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లో ఒక వారం రోజులు కర్ఫ్యూ ఉండేది. ఇప్పుడు కర్ఫ్యూ లేదు.

గొడవలు లేవు. ప్రస్తుతం హైదరాబాద్‌ ‌చాలా ప్రశాంతంగా ఉంది. ఇందుకు తెలంగాణ పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి ప్రకటించారు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఎన్నో అనుమానాలు, భయాలు ఉండేవి. ఆంధ్రా తెలంగాణ, ఆంధ్రా రాయలసీమ గొడవలు, మత ఘర్షణలు చెలరేగుతాయని అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో అలాంటి ఘటనలకు తావు ఇవ్వలేదు. రాజకీయ సుస్థిరత ఉన్నప్పటికీ, ఆర్థిక సుస్థిరత లేదు. ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే శాంతిభద్రతలు సవ్యంగా ఉండాలి. శాంతిభద్రతలు సవ్యంగా లేకపోతే.. ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చినా లాభం ఉండదు. ఇవాళ తెలంగాణలో క్రై ‌రేటు తగ్గింది. మత ఘర్షణలు లేనే లేవు. ప్రాంతీయ విద్వేషాలు, వివక్షత లేదు. ఈ ఆరున్నరేళ్లలో రాష్ట్రంలో అనేక మార్పులు వచ్చాయి. 2014లో సీఎం కేసీఆర్‌ ‌తీసుకున్న కీలక నిర్ణయాలే మార్పులకు ప్రధాన కారణం అని కేటీఆర్‌ ‌తెలిపారు.

Leave a Reply