Take a fresh look at your lifestyle.

ముంపు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడకూడదు

గోదావరి ముంపునకు గురయ్యే గ్రామ ప్రజలు ఇబ్బందులు రాకుండా అన్నీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ‌యంవి రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు దుమ్ముగూడెం మండలంలో గోదావరి వరదల వలన ముంపునకు గురయ్యే తూరుబాక, రేగుబల్లి, సున్నంబట్టి గ్రామాలలో కలెక్టర్‌ ‌పర్యటించి ముంపు నుండి ప్రజలకు ఇబ్బందులు రాకుండా అన్నీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సున్నంబట్టి గ్రామ ప్రజలు ఈ గ్రామం ముంపునకు గురవుతున్నందున ప్రజలు ప్రయాణాలు చేయుటకు ఇబ్బందులు పడుతున్నారని హైలెవల్‌ ‌వంతెన మంజూరు చేయాలని కోరగా తక్షణం ప్రతిపాదనల సమర్పించాలని పంచాయితీ రాజ్‌ అధికారులను ఆదేశించారు. తూరుబాక వద్ద వరదనీరు ప్రధాన రహదారిపై చేరుతుందని నీరు నిల్వలు ఉన్న రోజుల్లో వాహనాలు తిరగడానికి అవకాశం లేక రవాణా ఆగిపోతున్నట్లుగా చెప్పగా ప్రత్యామ్నామ ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నీటి సరఫరా సక్రమంగా గ్రామంలో ఏర్పాటు చేసిన 40 వేల లీటర్లు కెపాసిటి కలిగిన మంచినీరు ట్యాంకు ద్వారా నీటి సరఫరా చేయకపోవడం నీటి సమస్య వస్తందని గ్రామస్తులు తెలుపగా నీటి సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారని , నీళ్ళు వస్తుంటే గ్రామస్తులు రావడం ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారని సంబంధిత అధికారులపై ఆగ్రహంవ్యక్తం చేసారు.

షోకాజ్‌ ‌నోటీసు జారీ చేసారు. పల్లపు ప్రాంతంలో ఉన్న గృహ వాసులు పంపు నల్లాలు తీసివేయటం వల్ల ఎత్తున ఉన్న ఇండ్ల వాసులకు నీరు సరిపోవడం లేదని అధికారులు తెలపగా తక్షణం నల్లాలు పునరుద్దరించాలని అన్నారు. అనంతరం గ్రామంలో హరితహారం మొక్కలు పరిశీలించిన ఆయన మొక్కలు పోదన సక్రమంగా లేదని మొక్కుబడిగా మొక్కలు నాటి వదిలేస్తే పాపం తగులుతుందని మొక్కల రక్షణకు ట్రీగార్డులు , సపోర్టగా కర్రలను కూడ ఎందుకు ఏర్పాటు చేయకలేపోయారని అన్నారు. మొక్కల పెంపకంపై శ్రద్ద లేదని సర్పంచ్‌కు, కార్యదర్శికి షోకాజ్‌ ‌నోటీసు జారీ చేసారు. తూరుబాక గ్రామం వద్ద ప్రదాన రహదారికి ఇరువైపల నాటిన మొక్కలసంరక్షణకు చర్యలు తీసుకోవాలని యంపిడిఓను ఆదేశించారు. రెండు రోజుల్లో మొక్కలకు ట్రీగార్డులు సపోర్టు కర్రలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓ స్వర్ణలత,ఆర్‌బి ఇఇ భీమ్లా, మిషన్‌ ‌భగీరధ ఇఇ అర్జున్‌రావు, యంపిడిఓ మల్లీశ్వరి, మండల ప్రత్యేక అధికారి వరాదరెడ్డి, జిల్లా ఉద్యానవన అధికారి మరియన్న, తహశీల్దారు తదితరరులు పాల్గొన్నారు.

Leave a Reply