Take a fresh look at your lifestyle.

బిజేపి అధ్వర్యంలో కలెక్టర్‌ను ముట్టడించిన రైతన్నలు

కలెక్టర్‌ ‌కార్యాలయం ముందు ధర్నా

నాగర్‌కర్నూల్‌, ‌సెప్టెంబర్‌ 21, ‌ప్రజాతంత్ర విలేకరి: నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం నీటి నిల్వను పెంచడంతో భూములు కోల్పోయిన చర్ల తిరుమలాపురం, ఉయ్యలవాడ, ఇటిక్యాల, ఎండబెట్ల, గ్రామాల రైతులు భారతీయజనతా పార్టీ అధ్వర్యంలో సోమవారం పెద్దఎత్తునరైతులతోకలిసి కలెక్టర్‌ ‌కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. అంతకుముందు రైతులతో కలిసి ర్యాలిగా వెళ్లి కలక్టరేట్‌ ‌కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజేపి అసెంబ్లీ ఇంచార్జి నెడనూరి దిలీపాచారి మాట్లాడుతూ ట్యాంక్‌బండ్‌, ‌బుద్దవిగ్రహం అందాల కోసం కేసరిసముద్రంలో అలుగు ఎత్తును పెంచి వందశాతంకు పైగా నీటిని నిల్వ ఉంచడం వల్ల మా పంటభూములు పూర్తిగా నీటిలో మునిగిపోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసారు.
రైతన్నలం కన్నీరుమున్నీరు అవుతున్న స్థానిక ఎమ్మెల్యే ,టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రైతుల నోట్లో మన్నుపోసి రైతుల కడుపు కోస్తున్నారని ఈ కడుపుకోతకు కారణమైన టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని గద్దె దించాలని డిమాండ్‌ ‌చేశారు. గత నెల రోజుల నుంచి రైతులకు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం, అందులో భాగంగా గత వారం రోజుల క్రితం బిసి కమిషనర్‌కు వినతి పత్రం అందించామని, బిసి కమిషన్‌ ‌సభ్యులు తల్లోజు ఆచారి క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవాలను గమనించారని అన్నారు. కలెక్టర్‌తో రివ్యూ సమావేశం ఏర్పాటు చేసారని, ఆ సమావేశంలో ఇరిగేషన్‌ అధికారులు, రెవెన్యూ అధికారులు స్పష్టంగా వారి ముందర రైతుకు న్యాయం చేస్తామని ముంపుకు గురైన భాధితులను ఆదుకుంటామని, వారం రోజుల లోపు సమస్యను పరిష్కరిస్తామని వారు మాటిచ్చారని తెలిపారు.
ఆ తరువాత రైతులతో కలిసి జలదీక్ష కూడా నిర్వహించారు. జాయింట్‌ ‌కలెక్టర్‌ ‌హామి ఇచ్చినప్పటికి సమస్య ఎక్కడ వేసిన గోంగళి అక్కడే  అన్నట్లు ఉందన్నారు. రైతుల గోడును ఏ ఒక్క అధికారులకు ప్రజాప్రతినిధులకు పట్టడం లేదా అని వారు ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతి నిధులు రైతుల పై కోపం ప్రదర్శిస్తూ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేసారు. రైతులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని ఆపబోమని స్పష్టం చేసారు. అనంతరం జాయింట్‌కలెక్టర్‌ ‌హనుమంత్‌ ‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బిజేపి పార్లమెంటు ఇంచార్జి బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్‌ ‌పోల్దాస్‌ ‌రాము,  బిజేపి మహిళా నాయకురాలు రాధారెడ్డి, సునిత, బిజేవైఎం నాయకులు విజయభాస్కర్‌రెడ్డి, విజయేందర్‌రెడ్డి, చందు, లక్ష్మయ్య, సత్యంయాదవ్‌, ‌శోభన్‌లు పాల్గొన్నారు.

Leave a Reply