Take a fresh look at your lifestyle.

అణిచివేతలతో రైతు ఉద్యమాలను ఆపలేరు

  • రైతు ప్రజా సంఘాల నిరసన ర్యాలీ, రాస్తారోకో
  • బలవంతంగా కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు
  • రైతు సంఘాల భారత్‌ ‌బంద్‌ ‌విజయవంతం

నర్సంపేట, మార్చి 26, (ప్రజాతంత్ర విలేకరి) : శాంతియుత పద్ధతుల్లో ఉద్యమిస్తున్న రైతులు, రైతు సామాజిక ప్రజా సంఘాల నాయకులను అప్రజాస్వామిక పద్ధతిలో అణచివేయాలని చూడటం పాలకులకు తగదని, ఎంత అణచివేస్తే అంతకంత ఉద్యమాలు ఎగిసిపడతాయి అని ఏఐకెఎఫ్‌ ‌రాష్ట్ర సహాయ కార్యదర్శి పెద్దారపు రమేష్‌, ఏఐఎఫ్‌ ‌టీయు (న్యూ) రాష్ట్ర నాయకుడు మోడీ మల్లేష్‌, ఎమ్మార్పీఎస్‌ ‌జాతీయ కార్యదర్శి కల్లేపల్లి ప్రణయ్‌ ‌దీప్‌ ‌మాదిగ, టిపిఎఫ్‌ ‌జిల్లా అధ్యక్షుడు జనగాం కుమారస్వామి, బీసీ సంక్షేమ సంఘం డివిజన్‌ ఇం‌చార్జ్ ‌డేగల శ్రీనివాస్‌ ‌హెచ్చరించారు. శుక్రవారం ఏఐకెఎస్‌సిసి పిలుపుమేరకు భారత్‌ ‌బంద్‌ ‌కార్యక్రమాన్ని రైతు సామాజిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వర్తక వాణిజ్య సంస్థలను, బ్యాంకులు, పెట్రోల్‌ ‌బంకులను బస్సులు బంద్‌ ‌చేయించి విజయవంతం చేశారు. అంబేద్కర్‌ ‌సెంటర్‌ ‌నుంచి నిరసన ర్యాలీ నిర్వహించి బస్టాండ్‌ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో జనజీవనం స్తంభించి ట్రాఫిక్‌ అం‌తరాయం ఏర్పడింది. పోలీసులు కలుగజేసుకొని బలవంతంగా కార్యకర్తలను, నాయకులను అరెస్టు చేసి పోలీస్‌ ‌స్టేషనుకు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతు కార్మిక ప్రజావ్యతిరేక మోడీ ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తుతూ కేసీఆర్‌ ‌ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని అన్నంపెట్టే రైతన్న గగ్గోలు పెడుతుంటే కనీసం పట్టించుకోకపోవడం మోడీ కేసీఆర్‌ ‌ప్రభుత్వాలకు చెల్లిందని వారు అన్నారు. దేశవ్యాప్త రైతాంగ ఉద్యమంలో భారత్‌ ‌బంద్‌ ఒక హెచ్చరిక లాంటిదని వారు తెలిపారు.

ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశలో రైతు కార్మిక సంఘాలు రాజకీయాలకతీతంగా ఐక్యంగా సాగుతాయని, బలమైన ఉద్యమాలు నిర్మాణానికి తెలంగాణ రాష్ట్రంలో సైతం ఉద్యమ నిర్మాణం సాగుతుందని, ఇప్పటికైనా కేసీఆర్‌ ‌ప్రభుత్వం, జగన్‌ ‌ప్రభుత్వాన్ని చూసైనా బుద్ధి తెచ్చుకొని మోడీ రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ ‌చేశారు. బిజెపి మోడీ ప్రభుత్వం తక్షణమే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి రైతులకు అండగా  పంటలకు కనీస మద్దతు ధర, గ్యారెంటీ చట్టం చేయాలని కోరారు. లేకపోతే రైతాంగ ఉద్యమంలో మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదు అన్నారు. అనంతరం పోలీసులు సొంత పూచీకత్తుపై అరెస్టు చేసిన ఆందోళనకారులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంసిపిఐయు డివిజన్‌ ‌కార్యదర్శి కన్నం వెంకన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంభ బాబురావు, మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ, ఎంసిపిఐయు డివిజన్‌ ‌నాయకులు కొత్తకొండ రాజమౌళి, కేశెట్టి సదానందం, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఈర్ల పైడి, ఏఐకెఎమ్‌ఎస్‌ ‌జిల్లా అధ్యక్షుడు మాడ అశోక్‌, ‌భోగి పాణి, విద్యార్థి సంఘం నాయకులు మార్త నాగరాజు, గుర్రం అజయ్‌, ‌క్యాతం శ్యామ్‌, అడ్డూరి రాజు తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply