Take a fresh look at your lifestyle.

‌గ్రేటర్‌లో మతతత్వ పార్టీలను ఓడించాలి

  • రాష్ట్రంలో బీజేపీ దిగజారుడు రాజకీయాలు
  • అవినీతి, అసమర్థ పార్టీ టిఆర్‌ఎస్‌
  • ‌టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి
  • టీఆరెస్‌ ‌పార్టీపై ఈసీకి ఫిర్యాదు చేసిన పీసీసీ బృందం

టీఆరెస్‌ ‌పార్టీ ప్రభుత్వ ఆస్తులను ఆసరాగా చేసుకుని ప్రచారం చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విమర్శించారు. మెట్రో రైలు పిల్లర్లపై ప్రభుత్వ పథకాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ‌పార్థసారథిని కలిసి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్‌ ‌ప్రతినిధి బృందం. గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు అయిన ఎల్‌ అం‌డ్‌ ‌టి మెట్రో రైల్‌ ‌పిల్లర్ల పైన, ఆర్టీసీ బస్టాండ్‌ ‌లు, పబ్లిక్‌ ‌లట్రీన్స్లపైన ఎన్నికల ప్రచారం చేస్తున్నదని, ఆ ప్రకటనలు నిర్మూలించాలని కోరారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల కార్యాలయం వద్ద మీడియాతో ఉత్తమ్‌ ‌మాట్లాడుతూ…స్టేట్‌ ఎలక్షన్‌ ‌కమిషన్‌ ‌జిహెచ్‌ఎం‌సీ ఎన్నికలను ఫ్రీ, ఫేర్‌గా  నిర్వహించాలని పార్థసారథిని కోరిన్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఆస్తులపై కూడా అడ్వర్‌టైజ్మెంట్‌ ‌ప్రకటనలు చేస్తున్నారని పబ్లిక్‌ ‌పైసలతో కట్టిన బాత్రూమ్‌ల మీద కూడా ప్రభుత్వ పథకాలు  ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని, రాష్ట్రంలో బీజేపీ నిసిగ్గుగా ప్రవర్తిస్తుందని, కేంద్రం హైదరాబాద్‌కు ఏమి చేసిందని వోట్లు అడుగుతుందని విరుచుకుపడ్డారు.

డబ్బుల సంచులతో కాంగ్రెస్‌ ‌వాళ్ళ ఇండ్లకు వెళ్లి నాయకులను కొనుక్కోవాలని బీజేపీ చూస్తుందని, భుపేందర్‌ ‌యాదవ్‌ ‌వేరే పార్టీల నాయకులను కొనుగోలు చేయడానికి రాష్ట్రానికి వొచ్చినట్లు ఉన్నాడని ఆరోపించారు. ఎంఐఎం, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని అందుకే బీహార్‌లో ఎంఐఎం పోటీ చేసిందని, ఒవైసీ సోదరులు అమిత్‌ ‌షాతో కలిసినట్టు కేజ్రీవాల్‌ ‌చెప్పారని, కాంగ్రెస్‌  ‌వోట్లు చీల్చాలని ఎంఐఎం చూస్తుందని ఆరోపించారు. హైదరాబాద్‌ అభివృద్ధికి  67 వేల కోట్లు ఖర్చు పెట్టామని టీఆరెస్‌ ‌చెపుతుందని, హైదరాబాద్‌లో ఏమి అభివృద్ధి జరిగిందని, ఎవరి జేబులోకి వెళ్ళాయో టీఆరెస్‌ ‌నాయకులు చెప్పాలన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply