Take a fresh look at your lifestyle.

సోషల్‌ ‌మీడియాలో ప్రచారం నమ్మొదు

పీసీసీ చీఫ్‌ను అధిష్టానమే నిర్ణయిస్తుంది సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

జానారెడ్డి పార్టీ మారే అంశంపై కొందరు కావాలనే సోషల్‌ ‌మీడియాలో ప్రచారం చేస్తున్నారని, పీసీసీ నాయకుడు ఎవరనేది తమ అదిష్టానం నిర్ణయిస్తుందని సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సోషల్‌ ‌మీడియా వార్తను నమ్మొద్దన్నారు. శనివారం గాంధీభవన్‌లో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ…ఎంఐఎం, బీజేపీ మతపరమైన భావోద్వేగాలతో ప్రజలను రెచ్చగొట్టి వోట్లు పొందారని, మరోవైపు హైదరాబాద్‌లో ఏదో జరగబోతుందని ముఖ్యమంత్రి రెచ్చగొట్టి లబ్ది పొందే ప్రయత్నం చేసారని విమర్శించారు.

భావోద్వేగాలు తాత్కాలికంగా లాభం చేయవొచ్చు కానీ సంక్షేమం, అభివృద్ధికి ఉపయోగపడదని తమకు ఆశించిన ఫలితాలు రాకపోయినా సైద్ధాంతికంగా తాము గెలిచామన్నారు. ఓటమిపై పార్టీలో అంతర్గతంగా చర్చిస్తామని, కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇవి తాత్కాలిక ఫలితాలు మాత్రమేనని అన్నారు. ఎంఐఎంతో తాము ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదని, రాజకీయంగా కొంత కలిసి పనిచేసామని, కాంగ్రెస్‌ ఎప్పుడు మత రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో జరిగిన ప్రతీ తప్పును పార్టీలో చర్చిస్తామన్నారు. సిద్ధాంతాల కోసం పనిచేసే నాయకులు పార్టీలు మారరని, కమిట్‌ ‌మెంట్‌తో పనిచేసే నాయకులను తయారు చేసే పనిలో కాంగ్రెస్‌ ఉం‌దన్నారు.

Leave a Reply