న్యూ దిల్లీ, ఫిబ్రవరి 7 : జెద్దా నుంచి దిల్లీ వెళుతున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణీకుడు అస్వస్ధతకు గురికావడంతో జోథ్‌పూర్ వద్ద విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. జోథ్‌పూర్‌లోని గోయల్ ఆస్పత్రి, పరిశోధన కేంద్రానికి ప్రయాణీకుడిని తరలించి చికిత్స అందించారు.
కాగా కొద్ది వారాల కిందట మధురై-ఢిల్లీ ఇండిగో విమానంలో 60 ఏండ్ల వ్యక్తికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఇండోర్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. బాధిత ప్రయాణీకుడిని స్ధానిక ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్దారించారు. మృతుడిని నోయిడాకు చెందిన ప్రయాణీకుడిగా గుర్తించారు.