Take a fresh look at your lifestyle.

జువ్వాడి ఆశయాలను పార్టీ కొనసాగిస్తుంది

రైతుబంధు పేరుతో  విత్తనాల కంపెనీలతో సీఎం మిలాఖత్‌ – ‌కాంగ్రెస్‌ ‌రైతులకు అండగా ఉంటుంది : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌ ‌రెడ్డి 

మాజీ మంత్రి ,కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకులు జువ్వాడి రత్నాకర్‌ ‌రావ్‌ ‌దశదినకర్మ  సందర్భంగా గురువారం రత్నాకర్‌ ‌రావ్‌ ‌స్వగ్రా మం మండలంలోని మండలం తిమ్మాపూర్‌ ‌గ్రామంలో పలు వురు ప్రముఖులు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు ఉత్తం కుమార్‌ ‌రెడ్డి తో కలసి కాంగ్రెస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ అనుముల రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ జువ్వాడి సేవలు మరువలేనివని అన్నారు. సర్పంచ్‌ ‌స్థాయి నుండి రాష్ట్ర మంత్రి వరకు ఎది గిన గొప్ప జన నేత జువ్వాడి అని ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు.అన్ని వర్గాలను ఆదరించిన గొప్ప మనసున్న వ్యక్తి జువ్వాడి అని అంతేగాక విలువలతో కూడిన రాజకీ యాలను పరిచయం చేసిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ జువ్వాడి కుటుంబానికి అండగా ఉంటుందని ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రాజకీయాలు మాట్లాడే వేదిక కాకున్నా ఆవేదనతో మాట్లాడుతున్నను అని రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతు బందు పథకం ఎత్తివేయాలని చూస్తుందని అన్నారు. రైతు తనకు ఇష్టం వచ్చే పంట పండించుకొనే స్వేచ్ఛ ఇవ్వాలని, ప్రభుత్వం చెప్పిన పంటలు రైతులు పండిస్తారు కానీ ఆ పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించే దైర్యం ఉందా అని ప్రభుత్వాన్ని సవాలు విసిరారు. నీళ్ళు, నిధులు, నియామకా ల కోసం కోట్లాడి సాధించిన తెలంగాణలో ప్రజలకు కన్నీళ్ళే మిగిలే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నీళ్ళు నిధులు నియామకాల లో నీళ్లను ఆంధ్ర కు ఇస్తున్నారని, నిధులను సొంత కాంట్రాక్టు సంస్థలకు కట్టబెట్టి, నియామకా లను కల్వకుంట్ల కుటుంబానికి ఇచ్చారని ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం గా మార్చిన ఘనత ముఖ్య మంత్రి కేసీఆర్‌ ‌దని, విత్తనాల కంపెనీలతో కెసిఆర్‌ ‌మిలాఖత్‌ అయ్యారన్నా రు. అందుకే తను చెప్పిన పంటలు వెయ్యాలని రైతులను బ్లాక్‌ ‌మెయిల్‌ ‌చేస్తున్నాడని అన్నారు .రైతు బంధు పథకంతో గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ముఖ్య మంత్రి కేసీఆర్‌ ‌రైతు బంధు పథకం ఎత్తివేస్తే ఊరుకోబోమని డిమాండ్‌ ‌చేశారు. కరోనా వైరస్‌ ‌తగ్గుముఖం పట్టిన వెంటనే జిల్లాలో పర్యటన చేపడుతామని ఇక్కడి రైతులతో మాట్లాడుతానని అన్నారు. ఎమ్మెల్సీ టి. జీవన్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీదర్‌ ‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌,  ‌కాంగ్రెస్‌ ‌నేత అది శ్రీనివాస్‌, ‌విజయ రమణారావు,అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌, ‌మండల కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు సంగణ భట్ల దినేష్‌ ‌కుమార్‌, ‌స్థానిక కాంగ్రెస్‌ ‌నాయకులు కార్యకర్తలు, జువ్వాడి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply