Take a fresh look at your lifestyle.

మోదీ ప్రభుత్వ కక్షపూరిత వైఖరి !

దేశంలో విపక్షాల ఐక్యతకు ఇంతకన్నా మించిన సమయం లేదు. అన్ని పక్షాలు ఉమ్మడి ఎజెండాగా ముందుకు రావాల్సిన అవసరాన్ని గుర్తించాలి. దేశం కోసం విపక్షాల ఐక్యత అవసరం. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రజల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్దితోతో పనిచేయగలదు. ప్రతిపక్షం బలం గా లేకపోతే నిరంకుశ విధానాలు అమలవుతాయి. దేశంలో ప్రస్తుతం ఏకవ్యక్తి పాలన సాగుతోంది. నిరంకుశ విధానాలు మెల్లగా పాతుకుంటున్నాయి. ఎదర్కొనే వారు ఎవరూ లేరన్న పెడధోరణిలో పాలన సాగుతోంది. ప్రజల సమస్యలకన్నా సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. చేసేది గోరంత..ప్రచారం కొండంత అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ తరహా ప్రజాస్వామ్యం సరికాదు. ప్రజల సమస్యలకు ప్రాధన్యం దక్కడం లేదు. అందుకే విపక్షాలు ఐక్యత ప్రదర్శించాలి.

భేషజాలు పక్కన పెట్టాలి. ఇగోలు వదులుకోవాలి.తెలంగాణ సిఎం కెసిఆర్‌కు కూడా ఇదో మంచి అవకాశం. విపక్షాలను కూడగట్టి ముందుకు సాగేందుకు మరోమారు నడుం బిగించాలి. విపక్షనేతలు కూడా కేవలం అధికారం లక్ష్యంగా కాకుండా..ప్రజల పక్షాన గొంతుక కావడానికి ముందుకు రావాలి. దేశం ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలపై ఉమ్మడి ఎజెండా రూపొందించుకోవాలి. ఉమ్మడిగానే గొంతు వినిపించాలి. నిజానికి విపక్షాలకు ఇది పరీక్షా సమయం. దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాలి. మోదీ  ప్రభుత్వ విధానా లపైనా చర్చించాలి. ఇందుకు అనుగు ణంగా వేదిక తయారు చేసుకోవాలి. అప్పుడే విపక్ష పార్టీల మధ్య ఐక్యత సాధ్యం కాగలదు. కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీపై అనర్హత వేటు వ్యవహారంతో దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్షాలను ఈ సమస్య  ఒక్కతాటి దకు తీసుకొస్తోంది. కొంతకాలంగా కాంగ్రెస్‌ ‌పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న పార్టీలు సైతం ఇప్పుడు కలిసి వస్తున్నాయి. కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీని లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడుగా ప్రకటిస్తూ సెక్రటరీ జనరల్‌ ‌నోటిఫికేషన్‌ ‌జారీ చేయడం ద్వారా ప్రధాని మోదీ  హయాంలో ప్రజాస్వామ్యం దుర్దశకు చేరుకుందని కాంగ్రెస్‌ ‌సహా విపక్షాలు ఆరోపి స్తున్నాయి. అయితే విపక్షాల ఐక్యతకు, పోరాటానికి ఇదొక్కటే కారణం కారాదు. దేశంలో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తీసుకుని వాటిపై చర్చించాలి. విపక్షాలు అధికారంలోకి వస్తే ఏం చేయ బోతాయన్న దానిపై స్పష్టత ఇవ్వాలి.

ఉమ్మడి కార్యాచరణ ప్రకటించాలి. దానిని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి. అప్పుడే ప్రజలు కూడా మోదీ•కి ప్రత్యామ్నాయం ఉందని నమ్ముతారు. నిజానికి కర్నాకటలో రాహుల్‌ ‌మాట్లాడితే..గుజరాత్‌లో కేసు నమోదు కావడం.. సూరత్‌జిల్లా మెజిస్ట్రే ఇచ్చిన తీర్పును ఆగమేఘాల ద అమలు చేయాడం అంతా బిజెపి వ్యూహంలో భాగంగానే చూడాలి. ఇలా అన్ని విషయాల్లో మోదీ  స్పందించి ఉంటే బాగుండేది. కానీ అలా జరగడంలేదు. ఇకపోతే రాహుల్‌ ‌విషయంలో పై కోర్టుకు వెళ్లడానికి సూరత్‌ ‌కోర్టు నెల రోజుల వ్యవధినిస్తూ కేవలం శిక్ష అమలును మాత్రమే నిలిపేసింది. నేర నిర్దారణను అలాగే వుంచింది. అప్పీల్‌కు వెళితే హైకోర్టు రెండింటిపై స్టే ఇవ్వవచ్చు. ఈ అవకాశం వున్నా ఆగమేఘాల ద అనర్హుడుగా ప్రకటించడంలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. అదానీ, మోదీ  బంధాలపైన రచ్చ జరుగుతోంది. పార్లమెంటులో చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. అయినా అధికార బిజెపి ససేమిరా అంటూ పార్లమమెంటు విలువైన సమయాన్ని వృధా చేస్తోంది. చర్చను దారి మళ్లించ డానికి ఇప్పుడు రాహుల్‌ అనర్హత వేటును తెరపైకి తీసుకుని వచ్చింది. నిజానికి రాహుల్‌ ‌గాంధీపై అనర్హత వేటు గురించి కన్నా కూడా అదానీ వ్యవహారాన్ని కప్పిపుచ్చి కాపాడే పన్నాగాలే ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఆదానీతో మోదీ  కి కానీ బిజెపికి కానీ సంబంధం లేకుంటే దీనిపై చర్చించడానికి ప్రభుత్వానికి పెద్దగా అభ్యంతరం ఉండరాదు. మోదీ• ఆశీస్సులు, అనుబంధంతో హఠాత్తుగా ఆకాశానికి పడగలెత్తిన అదానీ వ్యాపార సామ్రాజ్యం హిండెన్‌బర్గ్ ‌నివేదిక తర్వాత ఒక్కసారిగా కుదేలైంది. డొల్ల కంపెనీల నుంచి భారీ సహాయం అందడం వెనక ఎవరున్నారనేది ఇప్పుడు విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీనికి మోదీ• కానీ..బిజెపి నేతలు కానీ ఒక్కమాటా మాట్లాడడం లేదు.

దేశ భక్తులమని వీరతాళ్లు వేసుకున్న బిజెపి నేతలు ఎవరూ సమాధానం ఇవ్వండ లేదు. దేశంలో ప్రజాస్వామ్యం  ప్రమాదం ఎదర్కొంటున్నదో చెప్పడానికి ఈ అనర్హత ప్రహసనం ఒక్కటే కారణంగా చూడరాదు. అనేకానేక అంశాలు ఉన్నాయి. ప్రధానంగా ఆదానీకి బోలెడు కంపెనీలు ధారాదత్తం చేస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థ లను అప్పనంగా అమ్ముతున్నారు. మోదీ  ప్రభుత్వ కక్షపూరిత వైఖరిని ఖండించిన ప్రతిపక్షాలకు ఇంతకన్నా సమయం లేదు. దీనిపై చర్చించాలి. కెసిఆర్‌ ‌కూడా విపక్షాల ఐక్యతపై మరోమారు చొరవ తీసుకోవాలి. దేశం సమస్యలు ఎదుర్కొంటున్న వేళ విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలి. జిఎస్టీ మొదలు ధరలు, పెట్రో, గ్యాస్‌ ‌దరలు, దర్యాప్తు సంస్థల పనితీరు తదితర అంశాలపై ఉమ్మడి కార్యాచరణకు దిగాలి. ఉమ్మడి ఎజెండా రూపొందాలి. ప్రజలకు నమ్మకం కలిగించాలి. అప్పుడే ప్రజలకు కూడా భరోసా కలుగుతుంది. కేవలం రాహుల సస్పెనష్టన్‌ ‌కేసును మాత్రమే పట్టుకుని ఒక్కటవుతామనే భావన నుంచి బయటపడాలి. అది కేవం ఓ ప్రాతిపదిక మాత్రమే కావాలి. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలే ఎజెండాగా మారాలి. విపక్షాలు కూడా తమ ఇగోలను పక్కన పెట్టాలి. కూటమి అనగానే తదుపరి ప్రధాని ఎవరన్న చర్చనే ముందుకు వస్తోంది. ఇలాంటి రాజకీయ స్వలాభాలను పక్కన పెడితే తప్ప ప్రజలు నమ్మరు.
– ప్రజాతంత్ర డెస్క్ 

Leave a Reply