Take a fresh look at your lifestyle.

యూపిలో విజయం తమదంటే తమదే అంటున్న పార్టీలు

  • రాబోయే ఎన్నికల్లో మళ్లీ విజయం తమదే అన్న బిజెపి నేత
  • తాము అధికారంలోకి వస్తామంటున్న అఖిలేశ్‌ ‌యాదవ్‌

లక్నో,సెప్టెంబర్‌15 : ‌యూపిలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఎవరికి వారు విజయంపై దీమా వ్యక్తం చేస్తున్నారు. తిరిగి తామే అధికారంలోకి వస్తామని బిజెపి ప్రకటించగా, తమకు అధికారం ఖాయమని సమాజ్‌వాది నేత అఖిలేశ్‌ ‌యాదవ్‌ ‌ప్రకటించారు. కుల, మతాలకు అతీతంగా అందరి సంక్షేమం కోసం కృషి చేసేది తమ పార్టీ మాత్రమేనని ఉత్తర ప్రదేశ్‌ ‌బీజేపీ శాఖ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌ ‌సింగ్‌ ‌చెప్పారు. రాబోయే శాసన సభ ఎన్నికల్లో తమకు ఇతర పార్టీలేవీ గట్టి పోటీ ఇవ్వలేవన్నారు. బుధవారం ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఉత్తర ప్రదేశ్‌ ‌శాసన సభ ఎన్నికల్లో కుల, మత, వంశ ప్రమేయం లేని రాజకీయాలు చేసే పార్టీ, యువత సంక్షేమం, రాష్టాభ్రివృద్ధి కోసం కృషి చేసే పార్టీ మాత్రమే బీజేపీ ముందు నిలబడగలుగుతుందని చెప్పారు. బీజేపీతో పోటీపడే సత్తా ఇతర పార్టీలకు లేదన్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు.

ముస్లింలను మచ్చిక చేసుకోవడం కోసం ఆ పార్టీ వెంపర్లాడుతుందన్నారు. మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ ‌సమాజ్‌ ‌పార్టీని బలహీన పార్టీగా భావించకూడదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కన్నా బలమైన పార్టీగా బహుజన్‌ ‌సమాజ్‌ ‌పార్టీ రాబోతోందన్నారు. రాబోయే ఉత్తర ప్రదేశ్‌ ‌శాసన సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి 400 స్థానాలు లభిస్తాయని ఆ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ ‌యాదవ్‌ ‌ధీమా వ్యక్తం చేయడంపై స్వతంత్ర దేవ్‌ ‌సింగ్‌ ‌స్పందిస్తూ, అన్ని స్థానాలు ఎక్కడి నుంచి పొందుతారని ప్రశ్నించారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం, అధికరణ 370 రద్దు, ఉమ్మడి పౌర స్మ•తి అమలు మతపరమైనవా అని అడిగారు. రామాలయం నిర్మాణం ప్రారంభమైన తర్వాత అల్లర్ల సంఘటనలు జరగలేదన్నారు.

రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఇప్పటి కన్నా ఎక్కువ స్థానాలు లభిస్తాయని చెప్పారు. 2017 శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి 325 స్థానాలు లభించాయి. మొత్తం శాసన  స్థానాలు 436 ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వంపై ప్రజల భ్రమలు తొలగిపోయాయని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ ‌యాదవ్‌ అన్నారు.బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజలు నిరాశతో ఉన్నారన్నారు. రానున్న శాసన సభ ఎన్నికల్లో ప్రజలు తమకు 400 స్థానాల్లో విజయాన్ని అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ పోరాడే విధానం ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు. ప్రజలకు ఎల్లప్పుడూ కొత్త డిమాండ్లు ఉంటాయన్నారు.

గతంలో బీజేపీ పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారని, బీజేపీకి ఆకర్షణ ఉండేదని, ఇప్పుడు అటువంటి ఆకర్షణ కనిపించడం లేదని చెప్పారు. బీజేపీ తన సంకల్ప పత్రాన్ని చెత్త బుట్టలో పడేసిందన్నారు. చేసిన పనులే చెబుతాయన్నారు. ప్రజలు ఈసారి సమాజంలోని అన్ని వర్గాలను గౌరవించేవారికే ఓట్లు వేస్తారన్నారు. రైతులను గౌరవించేవారికి, ఉద్యోగాలు ఇచ్చేవారికి ఓటు వేస్తారని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీకి, దాని మిత్ర పక్షాలకు ప్రజలు ఈసారి 400 స్థానాలను ఇస్తారన్నారు.

2022లో జరిగే ఉత్తర ప్రదేశ్‌ ‌శాసన సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ పెద్ద పార్టీలతో పొత్తు పెట్టుకోబోదని చెప్పారు. చిన్న, ప్రాంతీయ పార్టీలతో మాత్రమే పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుందన్నారు. పెద్ద పార్టీలతో పొత్తు పెట్టుకోకూడదని తన అనుభవం ద్వారా తెలుసుకున్నానని తెలిపారు. కేవలం చిన్నపార్టీలను ఓ వేదికపైకి తేవడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీకి మహిళలు, యువత మద్దతిచ్చి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా సహాయపడతారని చెప్పారు.

Leave a Reply