Take a fresh look at your lifestyle.

వైద్య ఖర్చులు భరించలేని దుస్థితిలో పద్మశ్రీ అవార్డు గ్రహీత..!

25 వేల అనాథ మృత దేహాలకు కర్మకాండలు చేసిన ‘షరీఫ్‌ ‌చాచా..’

పద్మశ్రీ అవార్డు గ్రహీత మొహమ్మద్‌ ‌షరీఫ్‌, ‌గత 25 ఏళ్లలో 25 వేల అనాథ మృతదేహాలకు కర్మకాండలు చేసినట్లు అయోధ్య బీజేపీ ఎంపీ లల్లు సింగ్‌ ‌చెబుతారు. అందుకే మొహమ్మద్‌ ‌షరీఫ్‌కు కేంద్రం పద్మా అవార్డు ఇవ్వాలని రిక మండ్‌ ‌కూడా చేసారు. ఆమేరకు పద్మా అవార్డు మొహమ్మద్‌ ‌షరీఫ్‌కు ప్రకటించటం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం మొహమ్మద్‌ ‌షరీఫ్‌ ‌తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ పేదరి కం కారణంగా చికిత్స పొందలేక మగ్గిపోతు న్నారు. మొహమ్మద్‌ ‌షరీఫ్‌ను ‘‘లావారీష్‌ ‌లాశొంకా మాసిహ’’ అని కూడా పిలుస్తారు.

మొహమ్మద్‌ ‌షరీఫ్‌ అయోధ్యలో  మొహల్లా ఖిర్కి అలీ బేగ్‌లోని తన ఇంటి మంచం మీద అనారోగ్యంతో పడివున్నారు. పద్మ అవార్డు సాధించుకున్న మొహమ్మద్‌ ‌షరీఫ్‌ను అందరూ ‘షరీఫ్‌ ‌చాచా’ అని పిలుస్తారు. ఇతను ఒక సాధారణ సైకిల్‌ ‌మెకానిక్‌. ఇతను గత 25 సంవత్సరాలుగా దిక్కులేని వేలాది అనాధ శవాలకు కర్మకాండలు చేస్తున్నాడు. ఉత్తర ప్రదేశ్‌ ‌ఫైజాబాద్‌ ‌పరిసరాల్లో 25 వేలకు అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు చేసాడు. 2020లో మొహమ్మద్‌ ‌షరీఫ్‌కు పద్మ అవార్డు భారత ప్రభుత్వం ప్రకటిస్తూ చేసిన ప్రకటన ప్రకారం మొహమ్మద్‌ ‌షరీఫ్‌ ‌మతంతో నిమిత్తం లేకుండా ఎక్కడ అనాథ శవం కనిపించినా అతను కర్మకాండలు జరిపించారు.

పద్మా అవా ర్డు త్వరలోనే అందుకోవాల్సిన  షరీఫ్‌ ‌చాచా ప్రస్తుతం మంచం మీద అపస్మారక స్థితిలో పడి ఉండటంతో, అతని కుటుంబ సభ్యులు ప్రభుత్వం మొహమ్మద్‌ ‌షరీఫ్‌కు ఓ అవార్డు సాధించుకున్న వ్యక్తిగా పరిగణించి, కొంత పెన్షన్‌ ఇవ్వాలని ఆశిస్తున్నారు. కుటుంబ సభ్యుల దగ్గర తగినంత సొమ్ము లేక షరీఫ్‌ ‌చాచా చికిత్స ఖర్చు భరించలేకపోతున్నారు. మహ్మద్‌ ‌షరీఫ్‌ ‌కొడుకు షాగీర్‌, ‌గత సంవత్సరం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తన తండ్రిని పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలియజేసి తమకు లేఖ కూడా రాసిందని పిటిఐకి చెప్పారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ ‌కుమార్‌ ‌భల్లా జనవరి 31, 2020 నాడు తమకు రాసిన లేఖలో షరీఫ్‌ ‌చాచాకు అవార్డును ప్రదానం చేసే తేదీని త్వరలో తెలియజేస్తామని తెలిపారని షరీఫ్‌ ‌చాచా కొడుకు షగీర్‌ ‌చెబుతున్నారు.

ఫైజాబాద్‌కు చెందిన బిజెపి ఎంపి లల్లు సింగ్‌ ‌సిఫారసు మేరకు పద్మా అవార్డు కోసం తన తండ్రిని ఎంపిక చేసినట్లు షగీర్‌ ‌చెబుతున్నారు. అవార్డు ఇచ్చే తేదీ మీకు అయినా తెలుసా అని బీజేపీ అయోధ్య ఎంపీ లల్లు సింగ్‌ను అడిగితే..అయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ‘‘షరీఫ్‌ ‌చాచాకి ఇంకా అవార్డు అందలేదా?’’ అని ఎదురు ప్రశ్న అడుగుతున్నారు. ఇంటి ఖర్చులను భరించలేక షరీఫ్‌ ‌చాచా కుటుంబం అల్లాడుతున్నది. కొడుకు  ప్రైవేట్‌ ‌డ్రైవర్‌గా నెలకు 7,000 రూపాయలు సంపాదిస్తాడు. అతను తన తండ్రి చికిత్సకు నెలకు అయ్యే 4,000 రూపాయల ఖర్చును భరించలేక పోతున్నాడు. మహ్మద్‌ ‌షరీఫ్‌ ‌కొడుకు షాగీర్‌ ‘‘‌మేము చాలా కష్టాలను ఎదుర్కొంటున్నాము, మా దగ్గర ఇంటి ఖర్చులకు డబ్బులు లేవు. డబ్బు లేకపోవడం వల్ల, నా తండ్రికి సరైన చికిత్స కూడా అందించ లేకపోతున్నాను. ఇప్పటి వరకు నాన్నకి స్థానిక వైద్యుడి చికిత్స ఇప్పించాం. ఇప్పుడు డబ్బు లేకపోవడం వల్ల, కనీసం దానిని కూడా భరించలేక పోతున్నాం’’ అని తమ గోడును వెళ్లడోసాడు.

Leave a Reply