పల్లె ప్రగతితో గ్రామాల రూపులేఖలు మారాయి

పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూప రేఖలు మారాయని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పల్లె ప్రగతి పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి పైఇదే స్ఫూర్తి ని కొనసాగిద్దామని, అగ్రస్థానంలో నిలుద్దామన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో సర్పంచ్ లకు గౌరవం పెరిగిందన్నారు. ప్రజల్లో ప్రేమ, అభిమానం, ఆప్యాయత పొందిన వారే నిజమైన అదృష్టవంతుడు, ఐశ్వర్య వంతుడుడన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో 90 % సర్పంచ్ లకు మంచి పేరు వచ్చిందన్నారు. పల్లెల రూపురేఖలు మారాయని, ఎన్నో ఏళ్ల తర్వాత పల్లెకు వచ్చిన వారు ఆశ్చర్యం కలిగేలా పల్లెల్లో మార్పు వచ్చిందన్నారు.
పంచాయితీ సెక్రెటరీ నుండి కలెక్టర్ వరకు, వార్డు సభ్యుల నుండి జడ్పి చైర్మన్ వరకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారన్నారు.సంగారెడ్డి జిల్లా వినూత్న కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలిచిందన్నారు. మన ఊరు అనే కార్యక్రమంలో భాగంగా రూ.4.90 కోట్ల విరాళాలు సేకరించారు.సి ఎస్ ఆర్ కింద రూ. 3లక్షలతో 769 కి.మీ.రోడ్ కు ఇరువైపులా మొక్కలు నాటారన్నారు. 3లక్షల ట్రీ గాడ్స్ ఏర్పాటు చేశారన్నారు.సంగారెడ్డి జిల్లాలో ప్రతి ఇంటికి తడి, పొడి చెత్త బుట్టలు పంపిణీ కార్యక్రమం చేపడుతామన్నారు.ఏఒక్క గ్రామంలో చెత్త కనపడకుండా చేయడమే ఈ రెండవ విడత పల్లె ప్రగతి ప్రధాన అంశమన్నారు.సీఎం కేసీఆర్ గారు మెటీరియల్ కాంపోడ్స్ కింద రూ. 100 కోట్లు విడుదల చేసారన్నారు.ప్రతి గ్రామంలో డంప్ యార్డ్ లు, స్మశాన వాటికలు నిర్మాణం చేపట్టాలన్నారు.
ప్రతి నెల ప్రతి గ్రామపంచాయతీ కి రూ. 339 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తోందన్నారు.పంచాయతీ సెక్రెటరీ లు ప్రతి రోజు కనీసం పది నుండి పెన్నెండు ఇల్లు తిరగాలని, వారితో మమేకం కావాలన్నారు.మొక్కలు నాటాలి అని, ఇంట్లో పనికి రాని చెత్తను తొలగించాలి అని చెప్పాలన్నారు. మహిళలు వారికి వచ్చే డబ్బులను పొదుపు చేసుకునేల , పిల్లలను బడులకు వెళ్లేలా చైతన్య పరచాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ మంజుశ్రీ, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు మహారెడ్డి భూపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్, ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Tags: palle pragathi, outline villages, changed, harish rao