- మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు
- కిడ్నాప్ కోసం ఆరు సిమ్‌కార్డుల కొనుగోలు
- నకిలీ నంబర్ ప్లేట్లతో కార్లు వినియోగం
- వివరాలు వెల్లడించిన సిపి అంజనీ కుమార్
బోయినపల్లి కిడ్నాప్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో భార్గవ్‌రామ్, అఖిలప్రియ పాత్రలపై పోలీసులు పూర్తి వివరాలు సేకరించారు. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో కీలక వివరాలను సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయి అఖిలప్రియ అని సిపి తెలిపారు. ముగ్గురిని అరెస్ట్ చేయగా, వారి నుంచి సెల్ఫోన్లు, నకిలీ నెంబర్ ప్లేట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు సీపీ తెలిపారు. ఆరు సిమ్‌కార్డులను మియాపూర్‌లోని మొబైల్ షాప్‌లో కొనుగోలు చేసినట్టు మల్లికార్జున్‌రెడ్డి అనే వ్యక్తి చెప్పారని సీపీ చెప్పారు. కిడ్నాప్ కేసులో ఇప్పటికే మాజీమంత్రి అఖిలప్రియ రిమాండ్‌లో ఉన్నారు. కిడ్నాప్ కోసం అఖిలప్రియ 70956 37583 ఫోన్ నెంబర్లను వాడారని సీపీ వెల్లడించారు.
బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిల ప్రియదే ప్రధాన పాత్ర అని తేల్చారు . కిడ్నాప్ కి సంబంధించి పూర్తి వివరాలను హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ మిడియాకు వెల్లడించారు. బోయినపల్లి కిడ్నాప్ కేసులో ముగురు నిందితులను అరెస్ట్ చేశామన్న ఆయన వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. వారిలో ఒకరు మల్లికార్జున్ రెడ్డి, మరొకరు బోయా సంపత్ కుమార్ (22) ఈయన భూమా అఖిల ప్రియ పర్సనల్ అస్సిటెంట్ అని, వీరు కాక బాలా చెన్నయ్య అనే డ్రైవర్ ని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. మూడు మొబైల్ ఫోన్స్, ఫేక్ నెంబర్ ప్లేట్స్ స్వాధీనం చేసున్నామన్న ఆయన మల్లికార్జున్ రెడ్డి ద్వారాభూమా అఖిలప్రియ6 సిమ్ కార్డులను కొనుగోలు చేసిందని పేర్కొన్నారు.
ఏస్కె మొబైల్ షాపు నుండి 6 సిమ్ కార్డులు కొనుగోలు చేశారని, ఈ 6 సిమ్ కార్డులు కూడా మల్లికార్జున్, శ్రీను పేరు మిద తీసుకోవడం జరిగిందని వివరించారు. జనవరి 2వ తేదీన సిమ్ కార్డులు తీసుకున్నారని, వీటిలో ఒక సిమ్ కార్డు భూమా అఖిల ప్రియ ఉపయోగించిందని, మరికొన్ని సిమ్ కార్డు గుంటూరు శ్రీను ఉపయోగిండని పేర్కొన్నారు. కిడ్నాప్ కు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించామన్న ఆయన 6 సిమ్ కార్డుల లొకేషన్స్, టవర్స్‌లను గుర్తించామని అన్నారు. భూమా అఖిల ప్రియ ఇల్లు కూకట్ పల్లి లోని లోదా అపార్ట్మెంట్ అని గుర్తించామని అన్నారు. అఖిల ప్రియ ఆధ్వర్యంలో కిడ్నాప్‌నకు రెక్కీ నిర్వహించారని అన్నారు. అఖిలప్రియ సమక్షంలోనే ఈ ఆపరేషన్ మొత్తం జరిగిందన్న ఆయన దానికి భార్గవ్ రామ్ కూడా సహకరించాడని పేర్కొన్నారు. కూకట్‌పల్లిలోని నిందితులు ఓ హోటల్లో రూమ్ తీసుకున్నారని, కిడ్నాప్ కేసులో భార్గవ్‌రామ్ పాత్ర కూడా ఉందని ఆయన తెలిపారు.
ప్రవీణ్‌రావు ఇంటి దగ్గర నిందితులు రెక్కీ నిర్వహించారని అంజనీకుమార్ పేర్కొన్నారు. నిందితులు ఉపయోగించిన సెల్ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నెంబర్ ప్లేట్లున్న కార్లలో వచ్చి కిడ్నాప్‌కు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. కిడ్నాప్ రోజు ఏం జరిగిందో వివరాలన్నీ పోలీసులు సేకరించారు. కిడ్నాప్ కేసులో ఇప్పటికే ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ రిమాండ్‌లో ఉంది.కిడ్నాప్‌కు సంబంధించి మొత్తం 143 కాల్స్ ట్రేస్ చేశాం. కిడ్నాప్‌లో భార్గవ్‌రామ్ పాత్ర ఉంది. కిడ్నాప్ కోసం అఖిలప్రియ 7095637583 నెంబర్ వాడింది. అఖిలప్రియను 3 రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. మూడురోజుల విచారణ అనంతరం ఇతర విషయాలను వెల్లడిస్తామని సీపీ వివరించారు.