Take a fresh look at your lifestyle.

ఎగబడి కొట్లాడుడే ఏకైక మార్గం

అమలుకాని పి.ఆర్సీ, బదలీ, పదోన్నతులు రాష్ట్రంలో ఉపాధ్యాయులు , ఉద్యోగులను నిరాశకు గురి చేస్తున్నాయి . యుఎస్‌ ‌పిసి, జాక్టోతో డిసెంబర్‌ 29‌న వేలాదిమంది ఉపాధ్యాయులు ఇందిరాపార్క్ ‌వద్ద మహాధర్నా నిర్వహించగా, అదేరోజు ముఖ్యమంత్రి 50 వేల ఖాళీలు భర్తీ చేస్తామని , ఉద్యోగ ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇస్తామని చేసిన ప్రకటన నేటి వరకూ ఆచరణ నోచుకోలేదు.

పాఠశాల విద్యా శాఖ కూడా జనవరి 31 లోపు అందరికీ పదోన్నతులు ఇవ్వాలని సీనియార్టీ లిస్టు తయారు చేయాలని డీఎస్సీ ఉత్తర్వుజారీ చేయగా, వివిధ జిల్లాలలో డి ఈ ఓ లు తయారు చేసిన సీనియార్టీ లిస్టులు ఉత్తుత్తి ప్రహసనంగా తయారయి పదోన్నతుల షెడ్యూల్‌ ‌నేటికీ నోచుకోలేదు. తొమ్మిది సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు నిలిచిపోయాయి.

సర్కార్‌ ‌బళ్ళలో నిపుణులు లేక విద్యార్థులు నష్టపోతున్నా ప్రభుత్వం ‘‘వర్క్ అడ్జస్ట్మెంట్‌’’ ‌పేరిట కొత్త అంకానికి తెరలేపింది. వర్క్ అడ్జస్ట్మెంట్‌ ‌పేరిట మినీ బదిలీలతో డిఇవోలు టీచర్లను గందరగోళం లోకి నెడుతున్నారు. లిస్టులు తయారై పదోన్నతుల కోసం చూస్తున్న సందర్భంలో ఇటువంటి ఆదేశాలు ఉపాధ్యాయులకు అశనిపాతం గా తయారయ్యాయి ఈ నేపధ్యంలోపదోన్నతుల కోసం యుయస్పీసి, జాక్టో లో లేని సోదర ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరిపి రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రభుత్వంపై పోరుకు సిద్ధం కావాలి.

- Advertisement -

అంతర్‌ ‌రాష్ట్ర బదిలీలకు సంబంధించి తెలంగాణలో ఉన్న 369 మంది ఏపీ వారిని ఆంధ్రకు పంపించి ఆంధ్రలో ఉన్న తెలంగాణ వారిని షరతులు లేకుండా తెలంగాణకు రప్పించాలి. ఈ అవసరాల రీత్యా వ్యక్తిగత బేషజాలను మరిచి ఉపాధ్యాయ సంఘాలు అన్ని ఒక్కతాటిపైకి వచ్చిజేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణను ప్రకటింటాలి. గుర్తింపు సంఘాలని, ఓ.డి.సంఘాలని గత నెల 27, 28, 29న చర్చల పేరుమీద కాలయాపనకు సర్కార్‌ ‌మరోసారి తెరలేపింది. ఐ.ఏ.ఎస్‌.‌ల బృందం కరోనా బూచిని చూపడం కొత్త కోణం. కరోనా ఎప్పుడు వచ్చింది? దీనిపై ఉద్యోగ,ఉపాధ్యాయులు ఆందోళన చేస్తే , ఉద్యోగుల కోరిక మేరకు పిఆర్సి ఉండదని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూడాలని చెప్పడం దురదృష్టకరం. రాజ్యాంగ ప్రకారం ఐదేళ్లకొకసారి వేతన సవరణ చేయడంప్రభుత్వ బాధ్యత. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం, పెరిగిన అవసరాలు దృష్టిలో పెట్టుకుని వేతనం పెంచే బాధ్యత ప్రభుత్వాలది.వేతనాలు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలతో ఇచ్చేది కాదు ఉద్యోగుల హక్కు అనే విషయం పాలకులు గుర్తించా
లి.
గతంలో మాదిరిగా 103 సంఘాలతో జె.ఏ.సి. ఏర్పాటు చేసి మెరుగైన పీఆర్సీని సాధించిన విజయాన్ని మననం చేసుకోవాలి.3 లక్షల మంది ఉద్యోగ,ఉపాధ్యాయులు,మరో 3 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు.కలిసి పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణలో అంగన్‌ ‌వాడీ నుండి యూనివర్సిటీ వరకు 18వేల యస్‌ ‌జి.టీ పోస్టులు, 540 యం ఇ వో, 2000 పిజి హెచ్‌ ఎం, 370 ‌డైట్‌ ‌లెక్చరర్ల పోస్టులు ఖాళీలున్నాయంటే విద్యార్థుల భవిష్యత్తు పణంగా పెట్టడమే. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో హక్కులను కాపాడు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మరో పోరాటానికి అందరూ కలిసి రావాలి. ఉమ్మడి పోరాటాల స్టీరింగ్‌ ‌కమిటీ ఏర్పాటు చేసుకొని ముందడుగేయాల్సి వుంది.

మైస శ్రీనివాసులు
టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి
9866 921866

Leave a Reply