Take a fresh look at your lifestyle.

భద్రాచలంలో యంపిడిఓ కార్యాలయం ఇకలేనట్టే

  • ఆళ్ళపల్లికి తరలింపు – ఉద్యోగులకు వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్‌
  • ‌తరలింపుపై ‘‘ప్రజాతంత్ర’’ డిసెంబర్‌లోనే చెప్పింది

భద్రాచలం మండల ప్రజాపరిషత్‌ ‌ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసింది. ఈ పదవీ కాలం ఉండటం వలనే యంపిడిఓ కార్యాలయం నేటి వరకు కొనసాగించారు. నేటి నుండి భద్రాచలం మండల ప్రజాపరిషత్‌ ‌కార్యాలయమును ఆళ్ళపల్లికి తరలిస్తున్నారు. ప్రజాప్రతినిధుల పదవీకాలం 2వ తేది గురువారం ముగియనుండటంతో కార్యాలయం తరలింపు ప్రక్రియ చేపట్టారు. ఈ విషయంపై ‘‘ప్రజాతంత్ర’’ డిసెంబర్‌ 28‌వ తేదీన యంపిడిఓ కార్యాలయంకు రంగం సిద్దమని వార్త ప్రచురించటం జరిగింది. మొట్టమొదటి సారిగా ‘‘ప్రజాతంత్ర’’ ఈ వార్త ప్రచురించింది. గత మూడు రోజుల క్రితం నుండే కార్యాలయంలో ఉన్న సామాగ్రి అతిముఖ్యమైన ఫైల్స్‌ను ఆళ్ళపల్లికి తరలించినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం భద్రాచలం యంపిడిఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతనగర్‌ , అన్నపురెడ్డి, కరకగూడెం, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, ఆళ్ళపల్లి , ప్రాంతాలకు బదిలీ చేసారు.

వీరు ఆయా మండలాల్లో త్వరగా రిపోర్టు చేయాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. భద్రాచలం మున్సీపాలిటి రూపుదిద్దుకోవడానికి ప్రభుత్వం గత కొంతకాలంగా కసరత్తు చేసింది. మున్సిపాలిటీగాచేయటం కోసం యంపిడిఓ కార్యాలయం ఇక్కడ అంతా ఉపయోగం ఉండదనే ఉద్దేశ్యంతో ఆళ్ళపల్లికి తరలిస్తున్నట్లు తెలుస్తుంది. భద్రాచలం యంపిడిఓ కార్యాలయం 1987 జనవరి 15వ తేదీన ప్రారంభం అయింది. ఇప్పటివరకు 32 సంవత్సరాల పాటు యంపిడిఓ కార్యాలయంగా కొనసాగింది. భద్రాచలాన్ని మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం కోసం కార్యాలయాన్ని తరలిస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న సమయంలో భద్రాచలం యంపిడిఓ కార్యాలయం సుమారు 25 గ్రామాలకు ఈ కార్యాలయం పనిచేసేది. రాష్ట్ర విభజన తరువాత గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌ ‌విలీనం కావడంతో భద్రాచలం మండలానికే పరిమితం అయింది. మున్సిపాలిటీ అయ్యే అవకాశం ఉన్నందున కార్యాలయం తరలిస్తున్నారు.

Leave a Reply