- సామాజిక కార్యకర్తలు, యువకుల వినతి
నాగర్ కర్నూల్, మే 5.ప్రజాతంత్రవిలేకరి: తాడూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్న ఆలోచనలు విరమించుకోవాలని ,మరియు ఆ స్థలాన్ని బస్టాండ్ నిర్మాణానికే ఉపయేగించాలని మంగళవారం మండల కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్తలు,యువకులు మండల తహశీల్దార్ కార్యాలయంలో ఉపతహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్తలు, యువకులు మాట్లాడుతూ మండల కేంద్రంలోని మట్ట మల్లయ్య బొంద స్థలాన్ని గతంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బస్టాండ్ నిర్మాణం కొరకు కేటాయించారని తెలిపారు. కాని ఇప్పుడు కొంతమంది ఈ స్థలాన్ని కమ్యూనిటి భవనం నిర్మాణంకు ఆక్రమించు కోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధులు చర్య తీసుకొని మట్ట మల్లయ్య బోందను కాపాడాలని,బస్టాండ్ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు, గ్రామ యువకులు వెంకట్ నారాయణ, చింత సత్తి, మారేడు శివ శంకర్, ఎస్ జయరాములు, శేఖర్, కాశన్న తదితరులు పాల్గొన్నారు.