Take a fresh look at your lifestyle.

వివిధ శాఖల్లో ఖాళీల సంఖ్య 55 వేలు

గుర్తించిన అధికారులు
సాగర్‌ ఉప ఎన్నిక తరవాతే జాబ్‌ ‌నోటిఫికేషన్‌కు అవకాశం
‌రాష్ట్రంలో త్వరలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు ఇటీవల ప్రకటించిన దరమిలా, సాగర్‌ ఉప ఎన్నిక తరవాత నోటిఫికేషన్‌ ‌వెలువడవొచ్చని అంటున్నారు. ఉప ఎన్నిక కోడ్‌ ఉన్నందున తరవాత ప్రకటిస్తారని అంటున్నారు. అయితే అధికారులు వివిధ శాఖల్లో ఖాళీల లెక్కలను తేల్చారు. ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన అనంతరం రాష్ట్రంలో మొత్తం ఖాళీల సంఖ్య 55 వేల వరకు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ నెల చివరి వారం నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు వొచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వొస్తున్నాయి. దీంతో నిరుద్యోగులు ప్రిపరేషన్‌ ‌ప్రారంభించారు. ఇదిలా ఉంటే తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌తాజాగా ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌తెలంగాణ స్టేట్‌ అ‌గ్రికల్చర్‌ ‌యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్‌ ‌ద్వారా మొత్తం 127 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో సీనియర్‌ అసిస్టెంట్‌ ‌విభాగంలో 15 ఖాళీలు, ఇదే యూనివర్సిటీలో జూనియర్‌ అసిస్టెంట్‌ ‌విభాగంలో మరో 10 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌తెలంగాణ స్టేట్‌ అ‌గ్రికల్చర్‌ ‌యూనివర్సిటీలో 105 జూనియర్‌ అసిస్టెంట్‌ ‌కమ్‌ ‌టైపిస్ట్ ఉద్యోగాలను సైతం ఈ నోటిఫికేషన్‌ ‌ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకుంటున్న అభ్యర్థులు డిగ్రీతో పాటు కంప్యూటర్‌ అప్లికేషన్‌ ‌లో ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన సంస్థలో డిఎప్లొమో చేసి ఉండాలి. లేదా బీసీఏ డిగ్రీ చేసి ఉండాలి లేదా కంప్యూటర్‌ ‌సైన్స్ ‌సబ్జెక్టు కలిగిన విభాగంలో డిగ్రీ చేసి ఉండాలి. టైప్‌ ‌రైటింగ్‌ ఇం‌గ్లిష్‌ ‌లో ప్రభుత్వం నిర్వహించిన టెక్నికల్‌ ‌పరీక్ష పాసై ఉండాలి. అభ్యర్థుల వయస్సు ఈ జూలై 1 నాటికి 18-34 ఏళ్ల మధ్యలో ఉండాలి.

ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. రాత పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అబ్జెక్టీవ్‌ ‌టైప్‌ ‌ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 300 మార్కులకు ఎగ్జామ్‌ ఉం‌టుంది. జనరల్‌ ‌స్టడీస్‌, ‌జనరల్‌ ఎబిలిటీస్‌ ‌కు సంబంధించిన ప్రశ్నలకు 150 మార్కులకు ఉంటాయి. సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ అం‌డ్‌ ‌కంప్యూటర్‌ అప్లికేషన్స్ ‌విభాగంలో 150 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్‌, ‌తెలుగు భాషల్లో ఈ ప్రశ్నలు ఉంటాయి. కంప్యూటర్‌ అప్లికేషన్‌ ‌ప్రశ్నలు మాత్రం ఇంగ్లిష్‌ ‌లోనే ఉంటాయి. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్‌ ‌సైట్లో ఆన్‌లై•న్‌ ‌ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు పక్రియ ఏప్రిల్‌ 12 ‌న ప్రారంభం కానుంది. మే 05న దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

Leave a Reply