Take a fresh look at your lifestyle.

‌ప్రభుత్వ దవాఖానాల్లో… సాధారణ ప్రసవాల సంఖ్య పెరగగాలి

  • ఆశావర్కర్లు బాధ్యత తీసుకోవాలి
  • సిజేరియన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టాలి
  • త్వరలోనే మెదక్‌ ‌రైలు కూతపెడుతుంది
  • మెదక్‌లో హాస్పిటల్‌ ‌ప్రారంభోత్సవంలో హరీష్‌ ‌రావు

మెదక్‌, ‌ప్రజాతంత్ర, మే 27 : రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు 30 నుంచి 56 శాతం పెరిగాయని, కాన్పుల శాతం మరింత పెరగాల్సి ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. అందుకు ఆశాలు బాధ్యత తీసుకోవాలని అన్నారు. మెదక్‌లో రూ. 17 కోట్లతో ఏర్పాటు చేసిన మాతా, శిశు అరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం దళిత బంధు లబ్ది దారులకు యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్‌ ‌రావు మాట్లాడుతూ..మెదక్‌ ‌పట్టణంలో 100 పడకల దవాఖానను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ దవాఖాన మొత్తం కాన్పుల కోసమేనని, చిన్నారుల కోసం మంచి వైద్యం అందుతుందన్నారు. మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ ‌రెడ్డి హాస్పిటల్‌ ‌నిర్మాణం కోసం ఎంతో చొరవ చూపారని ఆయన పేర్కొన్నారు. ఇందులో మెటర్నిటీ వార్డ్, ‌లేబర్‌ ‌రూమ్‌, ఆపరేషన్‌ ‌థియేటర్‌, ‌పీడియాట్రిక్‌ ‌వార్డ్, ‌పీఐసీయూ, ఎస్‌ఎన్‌సీయూ, ఆంటి నాటల్‌ ‌వార్డ్, ‌పోస్ట్ ‌నాటల్‌ ‌వార్డ్ ‌వంటి సదుపాయాలు ఉన్నాయని మంత్రి వివరించారు. సీఎం కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌దవాఖానల్లో సకల వసతులు కల్పిస్తున్నారు. ఇందులో ప్రసవాల సంఖ్య మరింతగా పెరిగేలా ఆశాలు బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు.

- Advertisement -

సాధారణ కాన్పుల కోసం కౌన్సిలింగ్‌ ఇవ్వాలన్నారు. రాబోయే రోజుల్లో సాధారణ ప్రసవాలకు వైద్య సిబ్బందికి ఇన్సెంటివ్‌ ‌రు. 3,000 ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆశాల పరిధిలో కేసులు ఎక్కువైతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మంచి చేస్తే హైదరాబాద్‌ ‌పిలిచి సన్మానం చేసినం. కొందరి వల్ల అందరికి చెడ్డ పేరు వొస్తుందన్నారు. కొరోనా సమయంలో ఎంతో కష్టపడ్డారు. ఎంతో చేశారు. కానీ, ఎక్కడైనా చిన్న తప్పు జరిగితే అందరూ పని చేయనట్టు అవుతుందన్నారు. అందుకే ఆ ఒక్కరూ మారాలి.. లేకుంటే చర్యలు తప్పవన్నారు. ప్రతి నెల మూడో తారీఖున ఆశాలతో టెలి కాన్ఫరెన్స్ ఉం‌టుంది. అందరూ సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ఎవరు పని చేయకున్నా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. దళితబంధు ఒక ఉద్యమం అంటూ… మెదక్‌లో వంద మంది లబ్దిదారులకు యూనిట్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో మెదక్‌ ‌రైల్వే లైన్‌ అం‌దుబాటులోకి వొస్తుందని హరీష్‌ ‌రావు వెల్లడించారు.

త్వరలో వైద్య కళాశాలకు సంబంధించి ఉత్తర్వులు అందజేస్తామని మంత్రి ప్రకటించారు. వైద్య రంగానికి తెలంగాణ సర్కార్‌ ‌పెద్దపీట వేస్తుందని అన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ దవాఖానాలను కార్పొరేట్‌ ‌స్థాయిలో సేవలు అందించే విధంగా తీర్చిదిద్దతున్నట్టు తెలిపారు. కార్పొరేట్‌ ‌హాస్పిటళ్లలో వుండే సౌకర్యాలన్నీ ప్రభుత్వ హాస్పిటళ్లలోనూ కల్పిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పేదల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు. అందుకే ప్రభుత్వ హాస్పిటళ్లలో అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్టు తెలిపారు. ఇక మెదక్‌ ‌రైల్వే లైన్‌ అం‌దుబాటులోకి వొస్తే ప్రస్తుతం ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నీ తొలగి పోతాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ ‌రెడ్డి, జెడ్పీ చైర్‌ ‌పర్సన్‌ ‌హేమలత, జిల్లా కలెక్టర్‌ ‌హరీష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply