Take a fresh look at your lifestyle.

రానున్న రోజుల్లో ముంబైలో కొరోనా కేసుల సంఖ్య పెరుగవొచ్చు

  • టెస్టుల సంఖ్య పెంచడమే కారణం
  • బిఎంసి కమిషనర్‌ ‌వెల్లడి

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, న్యూ దిల్లీ, మార్చి 30: రెండవ వేవ్‌లో ముంబైలో 85,000 కోవిడ్‌ ‌కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో చాలా వరకు కోవిడ్‌ ఉం‌డి కూడా కోవిడ్‌ ‌లక్షణాలు కనిపించని కేసులు అని బ్రిహన్‌ ‌ముంబై సివిక్‌ ‌బాడీ వెల్లడించింది. బీఎంసీ రోజుకు 25 వేలకు పైగా ఆర్టీ-పిసిఆర్‌ ‌పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ముంబై కమిషనర్‌ ‌చెబుతున్నారు. ఇంత కన్నా ఎక్కువ టెస్టులు చేయాలని ఉందని, అయితే ఇప్పటికే తమ సామర్థ్యానికి మించి టెస్టులు చేస్తున్నామని ముంబై ఆయన చెబుతున్నారు. మహారాష్ట్రలో రెండవ వేవ్‌ ‌కొరోనా వైరస్‌ ‌ఫిబ్రవరి 10న ప్రారంభమైంది. మార్చి 20 కల్లా ముంబైలో 85,000 కేసులను నమోదయ్యాయని ముంబై పౌర సంస్థ బ్రిహన్‌ ‌ముంబై కార్పొరేషన్‌ ‌కమిషనర్‌ ఇక్బాల్‌ ‌చాహల్‌ ‌తెలిపారు. మొత్తం కేసుల్లో 69,500 మందికి కొరోనా వైరస్‌ ‌లక్షణాలు కనిపించకుండా కొరోనా అంటుకుందని ఆయన తెలిపారు.

8,000 మంది రోగులలో తేలికపాటి కొరోనా లక్షణాలతో హాస్పిటళ్లకు వొచ్చారని తెలిపారు. ప్రస్తుత వేవ్‌తో రానున్న కాలంలో ముంబై నగరంలో రోజుకు 6000 నుండి 7000 కేసులు నమోదు కావొచ్చు. ప్రస్తుతం ముంబైలో కొరోనా పాజిటివిటీ రేటు 14 శాతం. ముంబైలో నిన్న 5,890 కేసులు నమోదయ్యాయి. ఆదివారం రిపోర్టింగ్‌ ‌మరియు టెస్టింగ్‌ ‌తక్కువగా ఉన్నందున, కేసుల నమోదు పడిపోయింది. గురువారం నాటికి టెస్టులు 60,000 కు పెంచబోతున్నాం. కనుక కేసుల నమోదు 10,000 సంఖ్యకి చేరుకోవొచ్చు. అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బిఎంసి చీఫ్‌ అం‌టున్నారు.

ఆర్టీ-పిసిఆర్‌ ‌టెస్టులపై కొన్ని పరిమితులు ఉన్నాయని ఆయన అంగీకరించారు. ప్రస్తుతం 25,000 కంటే ఎక్కువ ఆర్టీ-పిసిఆర్‌ ‌టెస్టులు ముంబైలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుత రేటు ప్రకారం, ముంబై నగరానికి రోజుకి 1,400 నుండి 1,500 బెడ్ల అవసరం ఉంది. తగినంత సంఖ్యలో పడకలు ఉన్నాయని బీఎంసీ భరోసా ఇస్తున్నది. అదనంగా ప్రైవేట్‌ ‌హాస్పిటళ్ల బెడ్లు కూడా బీఎంసీ వాడుకుంటున్నది. వొచ్చే సోమవారం నాటికి 7,000 ప్రైవేటు హాస్పిటళ్ల బెడ్లు బీఎంసీ వాడుకోనున్నది. తగినంత సంఖ్యలో వెంటిలేటర్లు మరియు ఐసియు పడకలు కూడా అందుబాటులో ఉన్నాయని బీఎంసీ చెబుతున్నది.

మంగళవారం వరకు 10 లక్షల మందికి టీకాలు వేసినట్లు బ్రిహన్‌ ‌ముంబై కార్పొరేషన్‌ ‌కమిషనర్‌ ఇక్బాల్‌ ‌చాహల్‌ ‌చెప్పారు. రోజుకు 1 లక్ష మందికి వ్యాక్సిన్‌ ఇవ్వడమే తమ లక్ష్యమని, ప్రస్తుతం రోజుకు 45,000 మందికి టీకా అందిస్తునట్లు కమిషనర్‌ ఇక్బాల్‌ ‌చాహల్‌ ‌తెలిపారు.

Leave a Reply