Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు ఎక్కువే

  • అయినా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువే – ప్రభుత్వ వైద్యుల సంఘం కన్వీనర్‌ ‌డాక్టర్‌ ‌జయధీర్‌
  • ‌విశాఖ డాక్టర్‌ ‌మృతికి పలువురు తీవ్ర సంతాపం

గుంటూరు,మే15: కరోనా సెకండ్‌ ‌వేవ్‌తో రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం కన్వీనర్‌ ‌డాక్టర్‌ ‌జయధీర్‌ ‌తెలిపారు. అయితే ఇక్కడే కేసులు నమోదవుతున్నాయనుకోవడం సరికాదన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ తుక్కువేనని అన్నారు. శనివారం డియాతో మాట్లాడుతూ ప్రజలు చనిపోతున్నారని ప్రచారం చేయడం కరెక్ట్ ‌కాదని.. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో 20 శాతం  మాత్రమే కరోనా కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు. చాలా మంది పేషంట్లు ఆక్సిజన్‌ అవసరం లేకపోయినా వాటి కోసం  పాకులాడుతున్నారని అన్నారు.  ప్రస్తుతం 50శాతం మందికి మాత్రమే ఆక్సిజన్‌ అవసరం అవుతుందని… కొంతమంది భయంతో ఆక్సిజన్‌ ‌బెడ్స్ ‌కోసం రికమండేషన్‌లు, పైరవీలు చేయిస్తే ప్రభుత్వానికి పిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

బెడ్స్ అవసరం లేకపోయినా వాటి కోసం ప్రయత్నాలు చేయవద్దన్నారు. ఇంటి వద్దే ఉండి వ్యాయామం చేస్తూ  మెడిసెన్స్ ‌వాడుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రజలకు వైద్యం అందిచకపోతే ప్రధానమంత్రికి పిర్యాదు చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి అంబులెన్స్‌లను ఆపే హక్కు లేదని డాక్టర్‌ ‌జయధీర్‌ ‌స్పష్టం చేశారు. ఇదిలావుంటే కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌లను విక్రయిస్తున్న ఓ ప్రభుత్వ వైద్యాధికారిని పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ ‌చేశారు. జీ కొండూరు మండలం లోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్‌ ఎన్‌ఎస్‌ ‌రాజు నగరంలోని సబ్‌కలెక్టర్‌ ‌కార్యాలయంలోని కోవిడ్‌ ‌హెల్ప్‌లైన్‌ 104‌లో డిప్యూ టేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. కొద్దిరోజులుగా కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌పేరుతో సత్యనారాయణపురం, మత్యాలంపాడు ప్రాంతాల్లో కారులోనే వ్యాక్సిన్‌లు వేస్తూ రూ.600 నుంచి రూ.1000 వరకూ వసూలు చేస్తున్నాడు.ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సత్యనారాయణపురంలోని ఓ భవనంలో వ్యాక్సిన్‌ ‌వేస్తున్నట్టు సమాచారం అందడంతో స్థానిక కార్పొరేటర్‌ ‌శర్వాణిమూర్తి, 31వ డివిజన్‌ ‌కార్పొరేటర్‌ ‌పెనుమత్స శీరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు సీఐ బాలమురళీకృష్ణ, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వైద్యాధికారితో పాటు అతడి సహాయకుడిని అరెస్ట్ ‌చేశారు. భవనంలోని స్టోర్‌ ‌రూంలో భద్రపర్చిన సిరెంజిలు, 5 కోవాగ్జిన్‌ , 6 ‌కోవిషీల్డ్ ‌వ్యాక్సిన్‌లను సీజ్‌ ‌చేశారు. ఇదిలావుంటే  విశాఖ కెజిహెచ్‌ ‌చిన్న పిల్లల విభాగాధి పతి, ఆంధ్రా మెడికల్‌ ‌కళాశాల ప్రొఫెసర్‌, ‌రెడ్‌‌క్రాస్‌ ‌సొసైటీ బ్రాంచ్‌ ‌చైర్మన్‌ ‌డాక్టర్‌ ‌పి.వేణుగోపాల్‌ (62) ‌శుక్రవారం ఉదయం కోవిడ్‌తో కన్నుమూశారు. ఆయన కొద్ది రోజులుగా కోవిడ్‌తో బాధపడుతున్నాడు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చిన్న పిల్లల వైద్య నిపుణులుగా వేణుగోపాల్‌కు మంచి గుర్తింపు ఉంది. పిల్లల వైద్యం పట్ల పలు జర్నల్స్‌లో వ్యాసాలు రాశారు. అంతర్జాతీయ సమావేశాలలో పాల్గొని వైద్యం పట్ల పలు ఉపన్యాసాలు చేశారు. రెడ్‌‌క్రాస్‌ ‌సొసైటీ చైర్మన్‌గా రక్తనిధి సేకరణకు ఆయన విశేష కృషి చేశారు. తొలివిడత కోవిడ్‌ ‌సమయంలో విమ్స్ ఆస్పత్రి ఒఎస్‌డిగా పనిచేసి ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల నుంచి తీవ్ర అనారోగ్యంతో వచ్చే కోవిడ్‌ ‌రోగులకు మెరుగైన వైద్యం అందించి మంచి సేవలందించారు. ఆరిలోవ అర్బన్‌ ‌హెల్త్ ‌సెంటర్‌లో వైద్యసేవల కల్పనకు సిపిఎం చేసిన కృషికి వేణుగోపాల్‌ ‌తోడ్పడ్డాడు.

రెడ్‌‌క్రాస్‌ ‌ద్వారా పేదలకు వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. సిఐటియు నేతృత్వంలో ప్రతియేటా స్టీల్‌ఎ•-‌లాంట్‌ ఉద్యోగులతో రక్తదాన శిబిరం నిర్వహించేందుకు వేణుగోపాల్‌ ‌ప్రోత్సహించేవారు. వేణుగోపాలరావు మృతి పట్ల కెజిహెచ్‌ ‌వైద్యులు సంతాపం తెలిపారు. వేణుగోపాల్‌ ‌మృతి పట్ల సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.‌నర్సింగరావు, జిల్లా, నగర కార్యదర్శులు కె.లోకనాథం, డాక్టర్‌ ‌బి.గంగారావు, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, ‌డివైఎఫ్‌ఐ, ‌సిఐటియు నాయకులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన మరణం పేదలకు, వైద్య రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు.

Leave a Reply