- కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్
- చివరి రోజు మొత్తం 25 మంది నామినేషన్లు దాఖలు
- నేడు నామినేషన్ల పరిశీలన
నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : మునుగోడు ఉపఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. ఇచివరి రోజు కావడంతో కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి భారీ ర్యాలీతో చివరి రోజు శక్రవారం నామినేషన్ వేశారు. బంగారుగడ్డ గ్రామం నుంచి చండూర్ ఎమ్మార్వో ఆఫీసు వరకు భారీ ర్యాలీతో వొచ్చి నామినేషన్ వేశారు. ఇప్పటివరకూ మొత్తం వందకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. ఈ నామినేషన్ల పక్రియ అక్టోబర్ 7వ తేదీ మొదలై.. శక్రవారంతో ముగిసింది. ఇదిలా ఉంటే.. ఉపఎన్నికకు భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో.. ఈ ప్రభావం ఏ అభ్యర్థిపై ఉంటుందా అనేది ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రేపు నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు.
17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. మునుగోడు బైపోల్ పోలింగ్ నవంబర్ 3వ తేదీ జరగనుండగా.. నవంబర్ 6న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఉపఎన్నిక బరిలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, ప్రజాశాంతి పార్టీ నుంచి కేఏ పాల్, టీజేఎస్ నుంచి ప్లలె వినయ్‌కుమార్ బరిలో ఉన్నారు. మరోవైపు మునుగోడు ఉపఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది.
అధికార టీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌లు తమ అభ్యర్ధులతో ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. శుక్రవారంతో 25 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మొత్తంగా చూస్తే వంద మంది నామినేషన్లు వేసినట్లు సమాచారం. శనివారం) నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 17వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 6న కౌంటింగ్, ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.