Take a fresh look at your lifestyle.

నూతన వ్యవసాయ చట్టాలతో… రైతుల వెన్ను విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం

కొత్త పార్లమెంటు భవనానికి అంబేద్కర్‌ ‌పేరు పెట్టాలి
మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్‌

రైతుల వెన్నుముక విరిచే విధంగా ఉన్న నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ మాల మహానాడు డిమాండ్‌ ‌చేసింది. కొత్తగా నిర్మిస్తున్న
పార్లమెంటు భవనానికి అంబేద్కర్‌ ‌పేరు పెట్టాలనీ,,కరెన్సీ నోట్లపై ఆయన ఫోటో ముద్రించాలని స్పష్టం చేసింది. ఈమేరకు బుధవారం ట్యాంక్‌బండ్‌ ‌వద్ద ఉన్న అంబేద్కర్‌ ‌విగ్రహం ముందు మాల మహానాడు మలాల మహా ధర్నాను నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలనీ, నూతన పార్లమెంటుకు అంబేద్కర్‌ ‌పేరు పెట్టాలనే ప్లకార్డులను ప్రదర్శించారు. రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్‌ అధ్యక్షనత నిర్వహించిన ఈ ధర్నాలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్‌ ‌మాట్లాడుతూ అంబేద్కర్‌, ‌పూలే ఆలోచనా విధానానికి ప్రధాని మోదీ కట్టుబడి ఉంటే నూతన పార్లమెంటుకు అంబేద్కర్‌ ‌పేరు పెట్టాలని డిమాండ్‌ ‌చేశారు.

రాముడి గుడి మీకెంత అవసరమో, అంబేద్కర్‌ ‌మాకూ అంతే అవసరమనీ, పార్లమెంటుకు అంబేద్కర్‌ ‌పేరు పెట్టే చారిత్రక అవసరాన్ని ప్రధాని మోదీ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం తక్షణమే తమ డిమాండ్లను నెరవేర్చాలనీ, లేనిపక్షంలో జనవరిలో చలో డిల్లీకి మాల మహానాడు పిలుపు ఇస్తుందని హెచ్చరించారు. భారత రాజ్యాంగం అందించి ఈ దేశం ప్రజాస్వామికయుతంగా ఉండటానికి ఆయన మూల సూత్రాల ద్వారానే ఆర్బీఐ ఏర్పడిన విషయాన్ని మరవొద్దని పేర్కొన్నారు. గతంలో మోదీ ఎన్నో సందర్భాలలో మాట్లాడుతూ అంబేద్కర్‌ ‌లేకుంటే తాను ఎక్కడ అని ప్రసంగించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే దేశానికి వెన్నెముక అయిన రైతులకు మద్దతుగా మాల మహానాడు ఉందనీ, ఆ వెన్నెముకను కేంద్రం విరిచేస్తున్నదని విమర్శించారు. తమ డిమాండ్ల సాధనకు జనవరిలో చలో డిల్లీకి మాల మహానాడు ఆధ్వర్యంలో పిలుపునిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు, మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి భైరి రమేశ్‌, ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరికె శ్రీనివాస్‌, ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కనిగిరి రవికుమార్‌, ‌మేడి అంజయ్య, ఉదండపురం సత్యనారాయణ, రాష్ట్ర వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌చంద్రశేఖర్‌, ‌గోలి సైదులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దార సత్యం, రాష్ట్ర నాయకులు నీరటి రాములు, రాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply