Take a fresh look at your lifestyle.

భద్రాద్రిలో వైద్యాధికారుల నిర్లక్ష్యం

  • బ్రతికున్న శిశువు చనిపోయిందంటూ నిర్ధారణ
  • కవరులో ఉన్న శిశువు కదలడాన్ని గమనించిన తండ్రి – హుటాహుటిన ఇంక్యూబేటర్‌లో పెట్టిన వైద్యులు

భదాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఘోరం జరిగింది. బ్రతికి ఉన్న శిశువును చనిపోయిందంటూ కవరులో పడేసిన వైద్యాధికారులు బయటపడేసేందుకు తీసుకువెళ్ళే సమయంలో శిశువు కవరులో కదులుతున్న దృశ్యాన్ని తండ్రి గమనించి చెప్పడంతో వైద్యాధికారులు ఖంగుతిన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలోని నర్సాపురం గ్రామంలో ఉంటున్న ముచిక సునీత ఆరు నెలల గర్భంతో చింతూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడ పరిస్థితి విషమించడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి చేరుకుంది. శనివారం ఉదయం 8 గంటల సమయంలో డాక్టర్లు పరీక్షలు నిర్వహించి కవల పిల్లలు ఉన్నారని వారిలో అభాషన్‌ అయి ఒకరు చనిపోయారని చెప్పటం జరిగింది.

వెంటనే అబాషన్‌ ‌చేసి ఇద్దరు శిశువులను బయటకు తీసారు. ఒకరు పాప, ఒకరు బాబుగా గుర్తించారు. ముందుగా ఒకరు చనిపోయారని చెప్పిన వైద్యులు అబాషన్‌ ‌చేసి ఇద్దరు శిశువులను తీసిన తరువాత ఇద్దరు చనిపోయారని చెప్పి ఇద్దరు శిశువులను ప్లాస్టిక్‌ ‌కవర్‌లో పెట్టి శిశువు తండ్రి రవికి అందచేసి మీరే బయటకు తీసుకువెళ్ళి పడేయాలని వైద్యాధికారులు శిశువు తండ్రికి చెప్పారు. ఇంతలో శిశువు బంధువులు కవర్‌ను తీసుకువెళ్తుండగా మగ శిశువు కదలడాన్ని తండ్రి రవి గమనించి వైద్యాధికారులకు చెప్పగా హుటాహుటిన వైద్యాధికారులు ఆసుపత్రికి తీసుకువెళ్ళి ఇంక్యూబెటర్‌లో ఉంచారు. డాక్టర్ల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా బ్రతికి ఉన్న శిశువును బయటపడేసే ప్రయత్నం చేసారు. ఈ విషయంపై గిరిజన సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

Leave a Reply