Take a fresh look at your lifestyle.

పాలమూరు పేరు ప్రపంచ పటంలో మారుమ్రోగాలి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

‌మహబూబ్‌నగర్‌, ‌జూలై 26, (ప్రజాతంత్ర ప్రతినిధి) : మహబూబ్‌ ‌నగర్‌ ‌ప్రతిష్టను పతాకస్థాయికి తీసుకువెళ్ళడమే తమ ధ్యేయమని  రాష్ట్ర ఎక్సైజ్‌,‌క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్‌ ‌వి. శ్రీనివాస్‌ ‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌ ‌నగర్‌ ‌పేరు  ప్రపంచపటంలో మారు  మోగాలని అన్నారు. సోమవారం మహబూబ్‌ ‌నగర్‌ ‌పట్టణంలోని సుదర్శన్‌ ‌కన్వెన్షన్‌ ‌లో నిర్వహించిన రేషన్‌ ‌కార్డుల పంపిణీ  కార్యక్రమానికి ఆయన ముఖ్యఅ తిథిగా హాజరయ్యారు. ములుగు జిల్లా రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు పొందిన సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా ఆధికారులు మంత్రిని గజమాలతో, శాలువాలతో సన్మానం చేశారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంత్రి మాట్లాడుతూ గతంలో  కాకతీయుల,విజయనగర పరిపాలన కాలంలో తెలుగు రాష్ట్రాలు ఎంతో పేరు, ప్రతిష్టలు సంపాదించాయని,రత్నాలు రాసులుగా పోసి అమ్మి కీర్తి, ప్రతిష్టలు సాధించినప్పటికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, పెరుపొందలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రామప్ప దేవాలయానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేశారని అన్నారు. రామప్ప అనే శిల్పి పేరున నిర్మితమైన రామప్ప దేవాలయం  14 వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని, అద్భుతమైన శిల్పకళతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినదని,దీనివల్ల ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందడం తో పాటు, అనేక మందికి ఉపాధి దొరుకుతుందన్నారు.

తెలంగా ణలో రామప్ప దేవాల యం లాంటి కట్టడాలు 10 ప్రపంచ• ్థయిలో గుర్తింపు పొందేవిగా ఉన్నాయని, ఇక వాటిపైన దృష్టి సారించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అదేవిధంగా మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలో కూడా పిల్లలమర్రి, మన్యంకొండ, అబ్దుల్‌ ‌ఖాదర్‌ ‌దర్గా వంటి ఎన్నో ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు ఉన్నాయని ,వీటన్నిటి ద్వారా మహబూబ్‌ ‌నగర్‌ ‌ప్రతిష్టను పతాక స్థాయికి తీసుకు వెళ్లేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ‘మహబూబ్‌నగర్‌ను అద్దంలా చేస్తాం.అందరికి గొప్ప విలువ లు ఉండేలా చేస్తాం. అందరికీ బ్రతుకుదెరువు చూపిస్తామని’ మంత్రి తెలిపారు. ప్రభుత్వపరంగా జిల్లాలోని అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, మహబూబ్‌ ‌నగర్‌ ‌ను మహా నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ‌చైర్పర్సన్‌ ‌స్వర్ణ సుధాకర్‌ ‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌  ఎస్‌.‌వెంకట రావు, అదనపు కలెక్టర్లు కె. సీతారామారావు, తేజస్‌ ‌నందలాల్‌ ‌పవర్‌, ‌మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌నరసింహులు, డిసిసిబి ఉపాధ్యక్షులు వెంకటయ్య, వైస్‌ ‌చైర్మన్‌ ‌గణేష్‌, ‌కౌన్సిలర్లు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply