Take a fresh look at your lifestyle.

అక్టోబర్‌ 2 ‌నుంచి నిరుద్యోగంపై ఉద్యమం 65 రోజుల పాటు పోరాటం

  • డిసెంబర్‌ 9‌న విద్యార్థులు, నిరుద్యోగులతో ఆందోళన
  • మిడియా సమావేశంలో రేవంత్‌ ‌వెల్లడి
  • తెలంగాణ ఎంత కీలకమో.. వర్గీకరణా అంతే కీలకం : మందకృష్ణకు రేవంత్‌ ‌పరామర్శ

అక్టోబర్‌ 2 ‌నుంచి డిసెంబర్‌ 9 ‌వరకు 65 రోజుల పాటు వివిధ కార్యక్రమాల ద్వారా నిరుద్యోగ సమస్యపై పోరాటం చేస్తామని పిసిసి ఛీఫ్‌, ఎం‌పీ రేవంత్‌ ‌రెడ్డి వెల్లడించారు. ఆగస్ట్ 15 ‌దేశ ప్రజలకు ఎంత పవిత్రమైందో, డిసెంబర్‌ 9‌న తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన రోజు అంతే పవిత్రమైనదని పేర్కొన్నారు. దళిత, గిరిజన ఆత్మ గౌరవ సభలు నిర్వహించి, ప్రజలలో చైతన్యం తీసుకువచ్చామని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన బుధవారం గాంధీభవన్‌లో మిడియా సమావేశంలో మాట్లాడుతూ..రోజువారీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే, నిరుద్యోగ సమస్యలపై పోరాటానికి కార్యచరణ సిద్ధం చేశామని తెలిపారు. విద్యార్థి, నిరుద్యోగులతో ఆందోళన చేస్తామని, 14ఎఫ్‌ ‌తొలగించాలని నిరుద్యోగులు పోరాటం ప్రారంభిస్తే దాన్ని కేసీఆర్‌ ‌తనకు అనుకూలంగా మలుచుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో యువతను బలిదానాల వైపు హరీష్‌ ‌రావు ఉసిగోల్పారని దుయ్యబట్టారు. శ్రీకాంతాచారి ఆత్మార్పణం తర్వాతే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని అన్నారు.

కేసీఆర్‌ ‌కక్ష్య కట్టి 4,368 ప్రాథమిక పాఠశాలలు మూసివేశారని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌ద్వారా ఉన్నత చదువులను పేదలకు కాంగ్రెస్‌ ‌దగ్గర చేసిందని తెలిపారు. సన్నబియ్యం, చేప పిల్లల కోసం కాదు, తెలంగాణ తెచ్చుకుంది పేదలకు కావలసింది విద్య అని అన్నారు. కేసీఆర్‌ ‌నిర్లక్ష్యం వల్ల 4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌బకాయి ఉందని మండిపడ్డారు. కాలేజీలు సర్టిఫికెట్‌లు ఇవ్వక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటుంన్నారని మండిపడ్డారు. తెలంగాణలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, వీరందరికీ నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్‌ ‌చేశారు. నెలకు పదివేల మంది ఉద్యోగ విరణమ చేస్తూన్నారని, నియామకాలు మాత్రం చేయడం లేదని దుయ్యబట్టారు. వీటంన్నింటిపై విద్యార్ది, నిరుద్యోగులతో ఉద్యమం చేస్తామని, అక్టోబర్‌ 2‌న దిల్‌సుఖ్‌నగర్‌ ‌నుంచి ఎల్బీ నగర్‌ ‌వరకు పాదయాత్ర చేస్తామని అన్నారు. వీలైనంత తొందరలోనే హుజూరాబాద్‌ అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. హుజూరాబాద్‌లో అఖిలపక్ష పార్టీల మద్దతు కూడా తీసుకుంటామని అన్నారు.

తెలంగాణ ఎంత కీలకమో..వర్గీకరణా అంతే కీలకం… మందకృష్ణకు రేంవత్‌ ‌పరామర్శ
తెలంగాణ ఎంత కీలకమైందో.. ఎస్సీ వర్గీకరణ కూడా అంతే కీలకమైందని రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. వర్గీకరణకు అనుకూలంగా గతంలోనే తాను అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం మాదిగలు చాలా పోరాటాలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఇటీవల కాలుకు శస్త్ర చికిత్స చేయించుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న మందకృష్ణ మాదిగను నివాసానికి వెళ్లి రేవంత్‌ ‌రెడ్డి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం వొచ్చాక మాదిగల జీవితాలు ఏమైనా మారాయా అని మందకృష్ణను తాను అడిగి తెలుసుకున్నానని చెప్పారు. ‘25 ఏళ్లుగా కృష్ణ మాదిగ పోరాటం చేస్తున్నారు. కేసీఆర్‌ ఎం‌దుకు వర్గీకరణపై కేంద్రాన్ని నిలదీయడం లేదు. కృష్ణ మాదిగ పనై పోయిందని అన్న వాళ్లు ఎందుకు పని చేయడం లేదు. వెంకయ్య నాయుడు, కిషన్‌ ‌రెడ్డి గతంలో మాదిగలకు వర్గీకరణపై హామి ఇచ్చారు. ఇప్పుడు పదవుల్లో ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణపై బిల్లు పెతితే మేము మద్దతిస్తాం. మాదిగ బిడ్డలకు కాంగ్రెస్‌ ‌పార్టీ అండగా ఉంటుంది. దళిత బంధు లాంటి పదకాలు కాదు వర్గీకరణ కావాలి. దళిత బిడ్డలు, ఎమ్మార్పీఎస్‌ ‌నేతలు హుజూరాబాద్‌లో పర్యటించి టీఆర్‌ఎస్‌ను నిలదీయాలి’ అని రేవంత్‌ ‌రెడ్డి పిలుపు నిచ్చారు.

Leave a Reply