కేంద్రంలో మోడీ సారధ్యంలోని భారతీయ జనతా ప్రభుత్వ అబివృద్ది ప్రగతి ప్రణాళికలు ప్రపంచ దేశాలకు మార్గనిర్దేశకంగా నిలుస్తున్నాయని ఆ పార్టీ జిల్లా నాయకులు అందే కోటయ్య, మాజీ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పోకల వెంకటేశ్వర్లు, రామీనేని కృష్ణయ్యలు అన్నారు. గురువారం మండల కేంద్రంలో ముఖ్య నాయకులతో మోడీ సారధ్యంలో సంవత్సర పాలనపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుండి ఇంటింటికీ మోడీ తీసుకున్న నిర్ణయాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయసమితి మండల కమిటీ సభ్యులు సుందరి రమేష్, మేకల వెంకటేశ్వర్లు, గుండెపురి సైదులు, మలికంటి శ్రీనివాస్, సైదులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కీతవారిగూడెంలో..
మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో పోలింగ్ బూత్ 283, 284లో ఇంటింటికీ మోడీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షులు నర్సింగ్ అంజయ్య, శక్తి కేంద్ర ఇన్చార్జి నాగసైదులు, గ్రామ శాఖ అధ్యక్షులు గీత రమేశ్ పాల్గొన్నారు.
రామన్నపేటలో…
రామన్నపేట, జూన్11 (ప్రజాతంత్ర విలేకరి) కరోనా కష్టం నుంచి ప్రజలకు ఊరట కలిగించేందుకు ప్రధాని మోడీ ఆత్మ నిర్భార్ భారత్ పథకం వీధి వ్యాపారుల జీవనోపాధి క్రింద 10వేలు 7శాతం వడ్డీ క్రిం ద అందిస్తు న్నారని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్విని యోగం చేసుకో వాలని బిజేపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్.మొగులయ్య, కార్యదర్శి కే. వేంకటేశ్వర చారిలు కోరారు. గురువారం స్థానిక మండల కేంద్రంలో ఇంటింటికి తిరిగి ప్రధాని నరేంద్ర మోడీ సందేశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సింధం లింగయ్య, కొమ్ము యాదయ్య, కట్కూరి భిక్షపతి, గురుకు సైదులు, చిన్నపాక స్వామి, డోగిపర్తి సుభాష్, నకరకంటి సుదర్శన్, బట్టే రమేష్, తదితరులు పాల్గొన్నారు.