Take a fresh look at your lifestyle.

క్లిష్ట పరిస్థితులలో అభివృద్ధిపై దృష్టి సారించడమే మోడి ప్రభుత్వ లక్ష్యం

2014 లో నరేంద్ర మోడి నాయకత్వనా కేంద్రంలో అధికారంలోకి వచ్చే వరకు ప్రపంచ దేశాలన్నీ భారతదేశానికి తగిన ప్రాధాన్యత ఇచ్చేవి కావు. కానీ ఎప్పుడైతే 2014 మే నెలలో భారతదేశ ప్రధాన మంత్రి గా నరేంద్ర మోడి ప్రమాణ స్వీకారం చేశారో ఆ మరుక్షణం నుండి అసియా ఖండంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ విలువ,ఖ్యాతి ,ప్రాముఖ్యత ప్రపంచ దేశాలకు తెలిసిపోయింది,అందులో భాగంగానే ఐక్యరాజ్యసమితిలో భారత్‌ ‌కు మంచి ప్రాధాన్యత పెరగడం. ప్రపంచ దేశాలన్నీ కూడా మళ్లీ భారత్‌ ‌ను విశ్వగురువు గా చూస్తున్నాయంటే అది నరేంద్ర మోడి ఘనతే అని తెలుసుకోవాలి,జమ్మూ కాశ్మీర్‌ ‌విషయంలో కేవలం భారత్‌ ‌మరియు పాకిస్తాన్‌ ‌దేశాలు మాత్రమే పరిష్కరించుకుంటాయి అని భారత ప్రధాని నరేంద్ర మోడి చెప్పిన వెంటనే అమెరికా,రష్యా, ఆస్ట్రేలియా ,జపాన్‌ ‌మరియు ఇతర అన్ని యూరప్‌ ‌దేశాలు కూడా భారతదేశానికి మద్దతుగా నిలిచాయంటే అది నరేంద్ర మోడి వ్యూహం తప్ప మరొకటి కాదు.

భారతదేశ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు చైనా సైన్యం నిరంతరం భారతదేశ సైన్యంపై దాడి చేస్తూ అనేక మంది భారత సైనికులను చైనా పొట్టన పెట్టకుంది, కానీ కేంద్రంలో నరేంద్ర మోడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయి. చైనా, పాకిస్తాన్‌ ‌దేశాలు భారతదేశ భూభాగాన్ని ఆక్రమించుకోవాలని ఆ దేశాలు సాహసం చేయలేక పోతున్నాయి.. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది బిజెపి ,నరేంద్ర మోడీ ప్రభుత్వం, యువతలో, ప్రజలలో అభిమానం పెరగడానికి ప్రధాన కారణం భారతదేశాని నరేంద్ర మోడి నిరంతరం కంటికి రెప్పలా కాపాడటమే.

కొరోనా వైరస్‌ ‌రాకుండా అడ్డుకోవాలంటే భారతీయులందరికీ సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ ‌ను అందించి కొరోనా వైరస్‌ ‌రాకుండా అడ్డుకోవడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం,అయితే దేశవ్యాప్తంగా కొరోనా వ్యాక్సిన్‌ ‌ను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినప్పుడు దానికి అయ్యే ఖర్చు ఎంత అని ఒక్కసారైనా దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్ని ఆలోచన చేశాయా?,ఏ విషయం గురించి కూడా పూర్తి స్థాయిలో తెలుసుకోకుండా ప్రతిపక్ష పార్టీలన్ని బిజెపి ప్రభుత్వాని విమర్శించడం తప్పు,అంతేకాక ప్రజలలో కూడా విషప్రచారాన్ని సృష్టిస్తూ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారు. భారతదేశంలోకి కొరోనా వైరస్‌ ‌ప్రవేశించినప్పుడు దేశంలో ప్రతి ఒక్కరికీ మాస్క్ ఉం‌డేది కాదు,అస్సలు పీపీఈ కిట్లు కూడా ఉండేవి కాదు. కానీ తిరిగి చూస్తే అదే ఏడాది లోపు ప్రతి ఒక్కరికీ 5,6 మాస్క్ ‌లు ,పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయి అంటే నరేంద్ర మోడి సాధించిన గొప్ప విజయాలలో ఇది ఒక్కటి.

కొరోనా లాంటి క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పేదవారికి5 కిలోల ల ఉచిత బియ్యం పంపిణీ చేస్తూ బీజేపీ ప్రభుత్వం పేదల ఆకలి తీర్చుతుంది, దేశ వ్యాప్తంగా రోడ్లకు, డ్రైనేజిలకు, మరుగుదొడ్లు, స్మశాన వాటికలకు, కరెంటు విద్యుత్‌ ‌స్తంభాలకు,గ్రామాల్లో నర్సరీలకు,హరిత హారానికి ఇచ్చే ఆదాయం అంతా కేంద్ర ప్రభుత్వానిదే, కొరోనా కారణంగా అన్ని రకాల వ్యవస్థలు, సంస్థలు మూత పడి భారతదేశమే కాక ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్ఠ దెబ్బతిన్నాయి ఈ తరుణంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను సరైన మార్గంలో నడిపించేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తుంటే ప్రతిపక్షలు నరేంద్ర మోడి ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.

నరేంద్ర మోడీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు అవినీతిని అంతం చేస్తూ సమర్థవంతమైన పాలనను అందిస్తూ భారతదేశం సుదీర్ఘ కాలంగా ఎదుర్కోంటున్న సమస్యలను పరిష్క రించడమే ధ్యేయంగా ప్రభుత్వం దృష్టి పెడుతూ భారతదేశ అభివృద్ధి వైపు అడుగులు వేయడం జరిగింది, అంతేకాదు జూన్‌ 21 ‌వ తేదీని అంత ర్జాతీయ యోగా దినంగా నిర్వహిం చాలని దానికి ఐక్య రాజ్యసమితి అంగీకరించి జూన్‌ 21 ‌వ తేదీని అంతర్జాతీయ యోగా దినంగా ప్రపంచ దేశాలన్ని పాటిస్తూన్నాయంటే అది భారతదేశానికి,నరేంద్ర మోడి కి ప్రపంచ దేశాలన్ని ఇచ్చే గొప్ప గౌరవం మరియు గొప్ప విలువ అని అర్థం చేసుకోవాలి. రెండవసారి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 370 అధికరణను మరియు 35 ఏ అధికరణలను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్‌ ‌రాష్ట్రం ఆర్థికంగా,రాజకీయంగా,పర్యాటకంగా అభివృద్ధి చెందుతూ ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతంగా మారి ప్రశాంతమైన జమ్మూ కాశ్మీర్‌ ‌గా తయారయింది.

ఇంకా చెప్పాలంటే ,అనేక శతాబ్దాల నుండి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి రామమందిర నిర్మాణం వంటి అనేక చారిత్రాత్మక విజయాలు సాధిస్తూ అద్భుతమైన, సుపరిపాలనను అందిస్తున్నారు. ఒక్కసారి అంతర్జాతీయంగా పరిశీలిస్తే ప్రధాని నరేంద్ర మోడి భారతదేశ ప్రాముఖ్యతను ప్రపంచ వ్యాప్తంగా చాటారు.. ఇజ్రాయిల్‌,అమెరికా వంటి అనేక దేశాలు ఆ దేశ ఎన్నికలలో నరేంద్ర మోడి ని ఉపయోగించుకోవడం జరిగింది. అలాగే దేశంలో ఇప్పటి వరకు దాదాపు 40 కొత్త విమానాశ్రయాలు నిర్మించింది. దాదాపు 13 ఎయిమ్స్ ‌లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది,అంతేకాదు ఒక్క రూపాయ కూడా విదేశాల నుండి అప్పు చేయకుండా సమర్థవంతంగా దేశాన్ని నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ..! భారతదేశంలో అవినీతి రహిత,సుపరిపాలన కొనసాగాలంటే మూడవసారి కూడా నరేంద్రమోడి ని ప్రధానమంత్రిని చేయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐక్యరాజసమితిలో భారతదేశానికి గొప్ప ప్రాధాన్యత పెరగడం, ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా భారతదేశానికి మంచి ప్రాధాన్యతను ఇవ్వడం, అవినీతిరహిత, కుటుంబరహిత, ప్రజల పరిపాలనను ఏ విధంగా అందించాలో ప్రపంచ దేశాలన్నీ కూడా భారత ప్రధాని నరేంద్ర మోడి ని ఆదర్శంగా తీసుకోవడం జరిగింది. ప్రపంచ దేశాలన్ని మళ్లీ విశ్వ గురువుగా చూడాలంటే ముడవసారి భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడి ని గెలిపించాల్సిన అవసరం చాలా ఉంది.

నరేంద్రమోడి నాయకత్వనా భారతదేశాని అభివృద్ధిలో మరింత వేగం పెంచేందుకు కేంద్ర మంత్రి మండలిని మార్పు చేయడం జరిగింది. ఈ మార్పులో జూనియర్స్,‌యువతకు ప్రాధాన్యత ఇచ్చారు,యువతకు ప్రాధాన్యత ఇచ్చారంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని కాపాడిన సీనియర్లను విస్మరించినట్లు కాదు, ఆ సీనియర్స్ ‌కు భవిష్యత్‌ ‌లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు సమన్వయ కర్తలుగా వ్యవహారించేందుకు మరియు దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వీరికి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు ఇవ్వడం కోసమే తప్ప మరొక ఉద్దేశ్యం లేదు అని అర్థం . ఇదే పరిణామాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తే నరేంద్ర మోడి మొదటి 5 ఏండ్లలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన జె. పి నద్దా ,రెండవ సారి అదే నరేంద్ర మోడి నాయకత్వనా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు బిజెపి సహ అధ్యక్షులుగా ( జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ) గా మరియు ఇప్పుడు బిజెపి జాతీయ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.

2014 లో బిజెపి ప్రభుత్వ ఏర్పాటు కోసం అన్ని రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్‌ ,‌యూపీఏ వ్యతిరేక కూటమిలను ఎన్‌ ‌డిఎ కూటమికి, బిజెపికి దగ్గర చేస్తూ అనేక రాష్ట్రాలలో మిత్ర పక్షాలను పెంచుతూ కేంద్రంలో బిజెపి అధికారమే లక్ష్యంగా పని చేసిన వ్యక్తి కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్‌ ‌జవడేకర్‌. అం‌దుకే తిరిగి వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఉత్తర ప్రదేశ్‌,ఉత్తరాఖండ్‌,‌పంజాబ్‌,‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌గోవా,గుజరాత్‌ ‌రాష్ట్రాల బాధ్యతలను తిరిగి అప్పగిస్తే బిజెపి పార్టీకి తిరుగు ఉండదని భావించి పార్టీ లో కీలక బాధ్యతలు ఇస్తున్నారు. అనుభవం అనేది మంచి కాన్పిడెన్స్‌ను పెంచుతుంది అనేది భావన.

– దుగ్యాల ప్రదీప్‌ ‌కుమార్‌,
‌బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

Leave a Reply