Take a fresh look at your lifestyle.

మోడీ, షా నేతృత్వంలో బీజేపీ మళ్ళీ భారతీయ బనియా పార్టీగా మారింది

మోడీ, అమిత్‌ ‌షాల నేతృత్వంలో మళ్ళీ బీజేపీ స్వీయ రక్షణ విధానం వైపు మళ్ళింది బహుళ జాతి సంస్థలకు, సాంకేతిక రంగంపై భయాందోళనకూ నెలవుగా మారుతోంది. వాణిజ్య మంత్రి పీయూష్‌ ‌గోయెల్‌ ‌భారత్‌ ‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆమెజాన్‌ ‌వ్యస్థాపకుడజు జెఫ్‌ ‌బెజోస్‌ ‌భారత్‌ ‌కు లాభమేమీ చేయడం లేదంటూ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఆయన ఇప్పుడేమంటున్నారంటే పెట్టుబడులు ఎవరు పెట్టినా, ఎక్కడి నుంచి వచ్చినా ఆహ్వ నిస్తామని. అయితే, అవి భారత ప్రభుత్వ నియమనిబంధనలకు అనుగుణంగా ఉండాలని అంటున్నారు. దీనిపై వాదన చేయలేం. గుత్త సంస్థల నిఘా సంస్థ ఈ వారారంభంలో ఆమెజాన్‌ అనుచితమైన వాణిజ్య విధానాలను అనుసరిస్తోందని విమర్శించింది. ఆ సంస్థ విమర్శను స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌ ‌స్వాగతించింది. వాణిజ్య, చిల్లర వ్యాపార సంఘాల వారు కూడా హర్షించారు. దానిని క్రూరమైన ఉద్దేశ్యంతో చేసిన అన్వయింపు అని కానీ, కుట్ర అని కానీ అనలేం. ఇది స్వచ్ఛమైన రాజకీయాలకు అద్దం పడుతోంది. భారతీయ జనసంఘ్‌ ‌గతంలో వాణిజ్య.వ్యాపార వేత్తలకు అనుకూలమైన పార్టీగా ఉండేది.ఇప్పుడు మళ్ళీ అదే పంథాలోకి వస్తోంది. కాంగ్రెస్‌, ‌వామపక్షాల వారు రాజీవ్‌ ‌హయాం తర్వాత బీజేపీని హిందూత్వ పార్టీగా అభివర్ణించేవారు. ఇందిరాగాంధీ ఈ విషయాన్ని పట్టించుకునే వారుకారు. గతంలో జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఆర్‌ ఎస్‌ ఎస్‌ ‌పత్రిక ఆర్గనైజర్‌ ‌మాజీ ఎడిటర్‌ ‌శేషాద్రి చారి తో జరిపిన సంభాషణల నుంచి ఒక వ్యాఖ్య చేశాను, బీజేపీ బనియా పార్టీగా అభివర్ణించాను.అంటే వర్తకులకు అనుకూల మైన పార్టీ అని. బీజేపీ ఈ మధ్య ఆలస్యంగా సంకేతాలు ఇస్తోంది. ఇందిరాగాంధీ చెప్పింది నిజమేనని. అంటే వర్తకుల అనుకూల మానసిక స్థితికి వచ్చేసింది.

వేదాంతపరమైన ప్రేరణ అయిన స్వదేశీ భావన కూడా వచ్చేసింది. ఎవరికైనా వాణిజ్య, పెట్టుబడిరంగాల నుంచి లాభం ఉంటే అది మనదేనన్న భావన వస్తుంది. బీజేపీ గట్టి భావోద్వేగాలను ప్రజలకు చేరేట్టు చేసింది. జాతీయవాదం, స్వీయ రక్షణ విధానం, ఔత్సాహిక పారిశ్రామిక విధానం వంటివన్నింటినీ ప్రజలకు చేరువ చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 1990-91 లో ప్రారంభమయ్యాయి. ప్రచ్ఛన యుద్దం అంతమైన తర్వాత ఎఫ్‌ ‌డిఐల ప్రవాహం పెరిగిందిసరిగ్గా అప్పుడే దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. వీపీ సింగ్‌ ‌కేబినెట్‌ ‌లో మధు దండావతే ఆర్థిక మంత్రిగా ఉండేవారు. వాణిజ్య మండలి సమావేశంలో ప్రసంగిస్తూ దండావతే తమ ప్రభుత్వం ఎఫ్‌ ‌డిఐలకు వ్యతిరేకం కాదని అన్నారు. అయితే, వాటి కోసం వెంపర్లాడటం లేదన్నారు. ఆయన కరుడు కట్టిన సోషలిస్టు కనుక ఆమాట అన్నారు. ఆయన అయిష్టంగానైనా అలా చెప్పడం వల్ల విదేశీ పెట్టుబడిదారులు ఎవరూ ఆకర్షితులు కాలేదు. 1991లో పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల తర్వాత పరిస్థితి మారింది. భారత్‌ అప్పటికే నాలుగు దశాబ్దాలుగా సామ్యవాద, స్వీయరక్షణ వాద, స్వదేశీ ఉద్యమ ప్రచారాల ప్రభావితంలో ఉంది. ఎగుమతులే మంచివి,. దిగుమతులు మంచివికావన్న భావన సర్వత్రా వ్యాప్తి చెందింది. స్వతంత్ర పార్టీ ఇందిరాగాంధీ ప్రజాకర్షణ ప్రభంజనంలో కొట్టుకొని పోయింది. అప్పటికి జనసంఘ్‌ ‌కూడా సోషలిస్టు గీతాన్ని అందుకుంది. ఆదునిక స్వేచ్ఛా విపణి సమాజంలో అటల్‌ ‌బిహారీ వాజ్‌ ‌పేయి ఒక్కరు మాత్రమే సంస్కర్త అని ఆ పార్టీ విశ్వసించడమే కాకుండా ప్రచారం చేసింది. వాజ్‌ ‌పేయి హయాంలో కూడా ఆర్థిక సంస్కరణలు అమలు జరిగాయి. సైద్ధాంతికంగా బీజేపీ ,. కాంగ్రెస్‌ ఒకే రీతిలో ,ఒకే భావజాలంతో వ్యవహరిస్తూ వచ్చాయి.

గడిచిన ఐదున్నర సంవత్సరాలుగా స్వీయ రక్షణ విధానాన్ని చూస్తున్నాం. బహుళ జాతి సంస్థలకు వ్యతిరేకంగానూ, సాంకేతిక విప్లవంపై అనుమా•లను వ్యక్తం చేస్తూ పాలన సాగింది. ఇదొక రకమైన ప్రతీకార ధోరణిలో సాగింది. విదేశాల నుంచి దిగుమతి అయిన వస్తువుల కన్నా, దేశంలో తయారైన వస్తువులకు 20 శాతం ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం ఇస్తోంది. అంటే మళ్ళీ పాత వ్యవస్థ వైపు అడుగులు వేస్తోందన్న మాట. మేక్‌ ఇన్‌ ఇం‌డియా కార్యక్రమం పరమార్ధం ఏమిటంటే విదేశీ సంస్థ తన పరికరాలు, యంత్రాలు భారత్‌ ‌కి పంపి ఇక్కడ అమర్చడం ఉదాహరణకు మెట్రో కోచ్‌ ‌లు సంయుక్త రంగంలో అంటే భారత మైనారిటీ భాగస్వామితో ఇక్కడ కోచ్‌ ‌లను అమర్చే ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తారు. వీటి విలువ దిగుమతి చేసుకున్న కోచ్‌ ‌ల కన్నా ఎంతో ఎక్కువ. బడ్జెట్‌ ‌తర్వాత టారిఫ్‌ ‌లు పెరిగిపోవడాన్ని చూస్తున్నాం. రంగాల వారీగా స్వీయ రక్షణ విధానాన్ని విస్తరించారు. రిటైల్‌ ‌రంగంలో కూడా ఎఫ్‌ ‌డిఐలు పెరిగిపోయాయి. దిగుమతులు మళ్ళీ వచ్చాయి. అయితే, వీటిని దిగుమతులని అనడం లేదు. వోడా ఫోన్‌ ‌సీఈఓ అన్నదేమంటే తాను చేయాల్సింది ఎంతో ఉన్నా వెళ్ళిపోవల్సి వస్తోందని అన్నారు. వేల కోట్ల రూపాయిలు మాఫీ చేయించుకుని అనూహ్యమైన రీతిలో వెల్ళిపోయింది ఆ సంస్థ. ఆమెజాన్‌ అధినేత జెఫ్‌ ‌బెజోస్‌ 2014‌లో మన దేశాన ్న• సందర్శించారు. ఆయనను ప్రధాని మోడీ గౌరవించారు. ఇప్పుడు మాత్రం ఆయన ప్రాభవం ఏమాత్రం లేదు. దీనికి సమాదానం 1990 దశకంలో దండావతే చెప్పిందే. ఆర్‌ ఎస్‌ ఎస్‌ అధినేత మోహన్‌ ‌భగవత్‌ ‌గత ఏడాది దసరా ఉత్సవాల సందర్భంగా చేసిన ప్రసంగాన్ని పరిశీలిద్దాం ఆయన ఆర్థిక సిద్ధాంతాన్ని దేశం ముందు ఉంచారు. మేము ఎఫ్‌ ‌డిఐలకు వ్యతిరేకం కాదు. భారత వాణిజ్యాన్ని దెబ్బతీయని రంగాల్లో మాత్రమే ఎఫ్‌ ‌డిఐలను కోరుతున్నాం అని అన్నారు. మోడీ ఆరేళ్ళుగా అనుసరిస్తున్న విదానాన్నే ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కు ఎంత జవాబుదారీగా ఉందో మోడీ తన చర్యల ద్వారా నిరూపిస్తున్నారు. గోరక్షకులపై తగిన చర్యలు తీసుకోకపోవడం, ముమ్మారు తలాక్‌ ‌రద్దు, పాకిస్తాన్‌ ‌వ్యతిరేక విధానం, ఇది మొత్తం అంతా దశాబ్దాలుగా వాణిజ్య రంగంలో మన దేశం అనుసరిస్తున్న విధానాలను తిరగతోడటమే. మన్మోహన్‌ ‌సింగ్‌ ‌బలహీన ప్రధాని అని కమలనాథులు తరచూ ఎద్దేవా చేసినా, ఆయన హయాంలో ఆర్థిక విదానాలు బలంగా పటిష్టంగా ఉండేవి., వాజ్‌ ‌పేయి ప్రదానిగా ఉన్నప్పుడు పత్తివిత్తనాల సమస్య పై రైతులు ఆందోళన చేశారు. మన్మోహన్‌ ‌హయాంలో అమెరికాతో పౌర అణు ఒప్పందం కుదిరింది. మోడీది పటిష్టమైన ప్రభుత్వమని కమలనాథులు ప్రచారం చేసుకుంటున్నారు కానీ, ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచే కార్యక్రమం ఒక్కటి సాగలేదు స్వ దేశీ ఉద్యమమని పేరు కానీ, దేశీయ పరిశ్రమలకు ఉపయోగ పడే కార్యక్రమాలేవీ లేవు. స్వీయ రక్షణ విధానంవైపే ప్రభుత్వం పయనిస్తోంది.

- Advertisement -

– శేఖర్‌ ‌గుప్తా
‘ద ప్రింట్‌ ‌సౌజన్యంతో’

Tags: Modi and Shah, led BJP, Baniya Party of India

Leave a Reply