Take a fresh look at your lifestyle.

ఆధునిక విప్లవవాది పెరియార్‌

“సామాజిక స్ఫూర్తి, ప్రేరణ కల్పించిన సమరశీల మార్గదర్శకులు పెరియార్‌. ఆయన సాంస్కృతిక విప్లవం ద్వారా తమిళనాట పీడిత వర్గాలను చైతన్య పరచిన నిరుపమాన వ్యక్తి. ఆయన సామాజిక సందేశం తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ జనులందరికి ఉద్దేశించింది. ఆయన మాటలు, రాతలూ కనీసం 50 పెద్ద సంపుటాలవుతాయి. కేవలం ‘‘అంటరానితనం – కులం’’ అంశం పైననే తమిళంలో 15 సంపుటాలు వెలువడ్డాయి. ‘స్త్రీ బానిస ఎందుకైంది’ అన్న చిరు పుస్తకం తెలుగులో వెలువడింది. ఫ్రెంచి భాషలోనూ వెలువడింది. దేశభక్తుల రూపంలో ఉన్న మనువాదుల చాణుక్య అగ్రకుల ఆధిపత్యం ఎంత ప్రమాదకరమో, బహుజనుల బానిసత్వం కూడా అంతే ప్రమాదకరమని చాటిచెప్పారు. అందరూ గొప్పగా చెప్పుకునే గాంధీకి ఎలాంటి చరిత్ర అధ్యయనం, సామాజిక అవగాహన లేదని, గాంధీ మద్దతిస్తున్న వర్ణ వ్యవస్థ తొలగించకుండా బహుజనులకు విముక్తి జరగదని ఆయన వాదన. వ్యవస్థ కు మూలమైన హిందూ మతం పోయి కులాలు అంతమైనప్పుడే పీడిత ప్రజలు మానసిక బానిస సంకెళ్లను తెంచుకోగలరని భోధించారు.”

(సెప్టెంబర్‌ 17 ‌పెరియార్‌ 141‌వ జయంతి సందర్భంగా….)

ఆధిపత్య వర్గాల నుండి పీడితుల సంపూర్ణ విమోచన కోసం 19-20 శతాబ్దాల మధ్య అపూర్వ కృషి చేసిన వారిలో మహాత్మ జ్యోతిరావు పూలే, బి.ఆర్‌.అం‌బేడ్కర్‌, ‌పెరియార్‌ ఇ.‌వి. రామసామి ప్రసిద్ధులు. ముగ్గురి లక్ష్యం, ముగ్గురి ఆలోచన ఒకటే. చారిత్రక అవగాహనలో భావసారుప్యత ఉంది. కానీ కార్యాచరణలో వైవిధ్యముంది. తెలుగువారికి పెరియార్‌ ‌గురించి తెలిపేందుకు 15 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా.. బా.నా.స వ్యవస్థాపక చైర్మన్‌ ‌డాక్టర్‌ ‌జయగోపాల్‌ ‌పెరియర్‌ ‌పై ఎన్నో పుస్తకాలు రాసారు, విశాఖపట్నం బీచ్‌ ‌రోడ్డులో పెరియర్‌ ‌విగ్రహం ఆవిష్కరించారు.

సామాజిక స్ఫూర్తి, ప్రేరణ కల్పించిన సమరశీల మార్గదర్శకులు పెరియార్‌. ఆయన సాంస్కృతిక విప్లవం ద్వారా తమిళనాట పీడిత వర్గాలను చైతన్య పరచిన నిరుపమాన వ్యక్తి. ఆయన సామాజిక సందేశం తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ జనులందరికి ఉద్దేశించింది. ఆయన మాటలు, రాతలూ కనీసం 50 పెద్ద సంపుటాలవుతాయి. కేవలం ‘‘అంటరానితనం – కులం’’ అంశం పైననే తమిళంలో 15 సంపుటాలు వెలువడ్డాయి. ‘స్త్రీ బానిస ఎందుకైంది’ అన్న చిరు పుస్తకం తెలుగులో వెలువడింది. ఫ్రెంచి భాషలోనూ వెలువడింది. దేశభక్తుల రూపంలో ఉన్న మనువాదుల చాణుక్య అగ్రకుల ఆధిపత్యం ఎంత ప్రమాదకరమో, బహుజనుల బానిసత్వం కూడా అంతే ప్రమాదకరమని చాటిచెప్పారు. అందరూ గొప్పగా చెప్పుకునే గాంధీకి ఎలాంటి చరిత్ర అధ్యయనం, సామాజిక అవగాహన లేదని, గాంధీ మద్దతిస్తున్న వర్ణ వ్యవస్థ తొలగించకుండా బహుజనులకు విముక్తి జరగదని ఆయన వాదన. వ్యవస్థ కు మూలమైన హిందూ మతం పోయి కులాలు అంతమైనప్పుడే పీడిత ప్రజలు మానసిక బానిస సంకెళ్లను తెంచుకోగలరని భోధించారు. దళిత హక్కుల కోసం పోరాడుతున్న అంబేడ్కర్‌ ‌కు వ్యతిరేకంగా గాంధీ నిరాహార దీక్షకు పూణుకోవడాన్ని వ్యతిరేకించారు..

‘‘వైక్కోమ్‌’’‌లో తొలి మానవ హక్కుల పోరాటం:
కేరళ, కొట్టాయం జిల్లా ‘‘వైక్కోమ్‌’’ అనే చిన్న పట్టణంలో పురాతన శివాలయం నాలుగు వీధులలో అంటరాని వారు నడవకూడదని, కనిపించకూడదన్న నిషేధాన్ని ఎత్తి వేయాలని సంఘ సేవకులు సత్యాగ్రహం ప్రారంభించారు. సత్యాగ్రహ నాయకులనె ప్రభుత్వం చెరసాలలో వేయగా మిగతా నాయకులు పెరియార్‌ ‌ను ఆహ్వానించగా ఆయన కేరళ వెళ్ళి సత్యాగ్రహం కొనసాగించారు. ఆ సత్యాగ్రహానికి దేశవ్యాపిత మద్దతు సహా విరాళాలు కూడా అందాయి. పెరియార్‌ ‌పట్టుదలను చూసి పాలకులు సత్యాగ్రహంలో జోక్యం చేసుకోవాలని గాంధీని కోరగా, 1925 మార్చి 9న చేరుకుని పెరియార్‌ ‌ను కలిసి సత్యాగ్రహాన్ని విడనాడాలని కోరారు. దానికి పెరియార్‌, ‌పశువులు ఈ వెంట నడుస్తాయి. అవన్నీ సత్యాగ్రహం చేసి హక్కుల్ని సాధించుకున్నాయా? సాటి మనుషులు వీధుల్లో నడవడానికి సత్యాగ్రహాలు చేస్తుంటే విరమించు కోమని మీరు అనడం బాగుందా, అని అడిగారు. అంతిమంగా వైక్కోమ్‌ ‌వీధులలో శూద్రులు నడిచే హక్కు సాధించి మానవ హక్కుల తొలి విజయాన్ని పెరియార్‌ ‌సాధించారు. దేశంలో అత్యధిక సంఖ్యాకులైన బహుజనుల పట్ల కాంగ్రెస్‌ ‌విధానంపై విసిగి పెరియార్‌ ‌పార్టీ నుండి బయటకు వచ్చారు. స్వాభిమాన ఉద్యమంలో దళితులను, స్త్రీలను పాత్రధారులు చేసి కుల వ్యతిరేక వివాహాలు జరిపించారు. స్వాభిమాన ఉద్యమం విజయం సాధించాలంటే స్త్రీలు చైతన్యం వంతులు కావాలన్న లక్ష్య సాధనలో పెరియార్‌ ‌కృషి చాలా గొప్పది. స్త్రీలు మానసిక బానిసత్వాని వీడిన నాడే సమానత్వాన్ని సాధిస్తారని కుటుంబ సభ్యులతో కలిసి ఆచరణాత్మక ఉద్యమం చేసిన పెరియార్‌ ‌వివరణాత్మకత చూస్తే అర్ధమవుతుంది. బానిస భావాలు లోతుగా పాతుకుపోయిన మత వ్యవస్థలో పెరిగిన స్త్రీలు తమ సంకెళ్లను తామే త్రెంచుకోవాలని పిలుపునిచ్చారు.

‘‘పెరియార్‌’’ అని పిలవండి
స్త్రీ సమానత్వం, చైతన్యం కోసం చేసిన పోరాటానికి 1938 నవంబర్‌ 12 ‌న మద్రాసులో 5000 మంది మహిళలు నల్ల చీరలు ధరించి రామసామిని పెద్ద ఊరేగింపుగా తీసుకెళ్లి సభ పెట్టి ‘‘పెరియార్‌ ‌వర్ధిల్లాలి’’ అని నినాదాలు చేసి ఆరోజు నుండి ఈ.వి. రామసామి ని పెరియార్‌ (‌మహాత్మ, గొప్పవారు) అని పిలవాలని తీర్మానించారు. స్వాతంత్య్రాన్ని ‘‘విషాద దినం’’ గా అభివర్ణించిన పెరియార్‌ ‌దేశ ప్రజలకు వెండి సంకేళ్లు పోయి బంగారు సంకేళ్ళు పడ్డాయని అన్నారు. రిజర్వేషన్లపై కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఉద్యమించి తొలి రాజ్యాంగ సవరణ చేయించి రిజర్వేషన్లను సాధించిన ఘనత పెరియార్‌ ‌దే. నవంబర్‌ 26 ‌ను కుల నిర్మూలన దినంగా ప్రకటించారు. కుల వ్యవస్థను, అంటరానితనాన్ని ప్రబోధిస్తున్న రామాయణం, మనుస్మృతి గ్రంధాలను తగలబెట్టాలని పెరియార్‌ ‌ప్రజలకు బోధించారు. పెరియార్‌ ‌కృషి ఫలితంగా 1967 లో తమిళనాడులో బహుజన రాజ్యం ఏర్పడింది. స్వాభిమాన పెళ్లి చట్టం అమలు జరిగింది. బహుజనుల విముక్తి కోసం పెరియార్‌ ఎం‌త బలమైన ఉద్యమం చేసాడో అర్ధమవుతుంది. పెరియార్‌ ‌నిరాడంబర, నిస్వార్థ సేవలను గుర్తించిన ఖచీజు•••, భారత ప్రభుత్వం ద్వారా ఒక ప్రశంసా పత్రాన్ని పెరియార్‌ ‌కు బహుకరించింది

పెరియార్‌ ఉద్యమ గొప్పదనాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించడం విశేషం..
21 వ శతాబ్దంలో నాస్తిక ఉద్యమాలు, అంబేడ్కర్‌, ‌పూలే భావాల విప్లవాల స్పూర్తితో జీవిస్తూ సామాజిక చైతన్యం, సామాజిక న్యాయం, సామాజిక సమత కోసం ఒక అడుగు ముందుకేసి తెగించి లక్ష్యాన్ని సాధించాల్సిన అవసరముంది. ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పూలే, అంబేడ్కర్‌, ‌పెరియార్‌ ‌లాంటి వారు ప్రాణాలకు తెగించి పోరాడకుంటే బహుజనులు ఎలా ఉండేవారో ఊహించలేం. 1879 సెప్టెంబర్‌ 17 ‌న మద్రాస్‌ ఈరోడ్‌ ‌లో జన్మించిన వెంకట రామసామి కి ఈరోడ్‌ ఇం‌టి పేరుగా మారింది. ఉద్యమశక్తులు పెరియార్‌ ‌గా నామకరణం చేశారు. 94 సంవత్సరాలు జీవించిన పెరియార్‌ 1973 ‌డిసెంబర్‌ 24 ‌న సమావేశ వేదిపై కుప్పకూలి తుది శ్వాస విడిచారు.

saini narendar
సాయిని నరేందర్‌
9701916091

Leave a Reply