రామన్నపేట, జూన్06 (ప్రజాతంత్ర విలేకరి) నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో తమకు కనీసం కొబ్బరికాయ కొట్టనీయకుండా అవమానపరుస్తున్నారని దుబ్బాక ఎంపిటిసి మాడూరి జ్యోతిరామచందర్ రావు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుని కలిసి ఫిర్యాదు అందించడం జరిగిందని తెలిపారు. శనివారం ఆమె హైద్రాబాద్ మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆనించడం జరిగిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దుబ్బాక గ్రామ ఎంపీటీసీ పరిదిలోని దుబ్బాక, కొత్తగూడెం, లక్ష్మాపురం గ్రామాల్లో పలు వార్డులలో అనేక సమస్యలు నెలకొన్నాయని నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఎంపిటిసిగా భారీ మెజార్టీతో గెలిచానని, కాంగ్రెస్ తదితర పార్టీలలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే విలువ ఇస్తున్నారని, నా పరిదిలోని గ్రామాలల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలల్లో కనీసం కొబ్బరికాయ కూడా కొట్టనివ్వకుండా అవమాన పరచడమే కాకుండా, రాజకీయంగా అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.