Take a fresh look at your lifestyle.

‌క్రమశిక్షణతోనే కొరోన కట్టడి : మంత్రి

సూర్యాపేట జిల్లా ప్రజలు పాటించిన క్రమశిక్షణతోనే కరోనా మహమ్మారిని కట్టడి చేయగలిగామని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. జిల్లా ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండేందుకు జూనియర్‌ ‌కాలేజ్‌, అఫ్జల్‌ ‌రైస్‌ ‌మిల్లుల వద్ద ఏర్పాటుచేసిన మార్కెట్‌లను జిల్లా కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డి, మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌పెరుమాళ్ళ అన్నపూర్ణలతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతు సూర్యాపేట పట్టణం లో ఉన్న ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు కల్గకుండా ఆయా ప్రాంతాల్లో తాత్కాలిక మార్కెట్‌లను మొత్తం 12ఏర్పాటుచేశామని స్పష్టం చేశారు. అనంతరం సెక్యూర్డ్ ‌డ్రైవర్స్ అసోసియేషన్‌కు చెందిన 400మంది కార్‌ ‌డ్రైవర్లకు నిత్యావసర సరుకులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ ‌నిమ్మల శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ఆర్డిఓ మోహన్‌రావు, పుట్టా కిషోర్‌, ‌కౌన్సిలర్లు తాహెర్‌ ‌పాషా, స్రవంతి, ఆకుల లవకుశ, శ్రీనివాస్‌, ‌దిలీప్‌ ‌రెడ్డి, వెంకన్న పాల్గొన్నారు.

Leave a Reply