Take a fresh look at your lifestyle.

మంత్రి ఈటల ఎవరినీ బెదిరించలేదు

అచ్చంపేట సర్పంచ్‌ ‌లక్ష్మి ఆవేదన
మంత్రి ఈటల రాజేందర్‌ ‌భూ వివాదంపై మెదక్‌ ‌జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట సర్పంచ్‌ ‌లక్ష్మీ స్పందించారు. బలవంతంగా ఎవరి దగ్గర నుంచి ఈటల భూమి గుంజుకోలే దన్నారు. పిల్లల పెళ్లిళ్ల కోసం ఎకరా భూమిని రెండు లక్షల రూపాయల చొప్పున కొందరు అమ్ముకున్నారన్నారు. అలా చాలామంది భూములు అమ్ముకున్నారని అన్నారు. ఇప్పుడు భూముల దరలు పెరగడంతో కొందరు కావాలని మళ్లీ పైసుల కావాలని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. మళ్ళీ ఇప్పుడు పైసలు అడగడం కరెక్ట్ ‌కాదన్నారు. కొందరు వ్యక్తులు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిసినట్లు గ్రామంలో ప్రచారం జరుగుతోందని లక్ష్మి తెలిపారు. అయితే మంత్రి ఈటెల కానీ, ఆయన అనుచరులు కానీ ఇక్కడ భూముల కోసం ఎవరినీ బెదరించలేదన్నారు. కొందరు ఎప్పుడో తమ అవసరాల కోసం భూములు అమ్ముతామని, డబ్బులు కావాలని ఒత్తిడి తెచ్చారని అన్నారు.

Leave a Reply