Take a fresh look at your lifestyle.

ఎం‌పిపై వేటేసే ముందు పద్దతులు ప్రక్రియల మేరకే నిర్ణయం

రఘురామపై నిర్ణయంపై స్పీకర్‌ ఓం ‌బిర్లా సంచలన ప్రకట

న్యూఢిల్లీ,జూలై 12 : ఒక ఎంపిపై వేటు వేసే ముందు ఉభయ పక్షాల అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు, పద్దతులు పాటించాల్సి ఉంటుందని,  వైసీపీ ఎంపీ రాఘురామకృష్ణరాజు అనర్హత పటిషన్‌పై లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా స్పందించారు. ఆ విషయంపై రన్నింగ్‌ ‌కామెంటరీ చేయలేమని స్పీకర్‌ అన్నారు. అనర్హత పిటిషన్‌పై చర్యలకు ఒక పక్రియ అంటూ ఉంటుందని, ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు ఇరుపక్షాల వాదనలు వింటామన్నారు. సభను స్తంభింపజేస్తామని వైసీపీ ఎంపీలు చెప్పడంపై స్పందించిన స్పీకర్‌.. ‌సభలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందన్నారు. ఇదిలా ఉంటే, రఘురామ అనర్హత పిటిషన్‌పై త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లాను రాజ్యసభ ఎంపీ, వైసీపీ సీనియర్‌ ‌నేత విజయసాయి రెడ్డి కోరిన విషయం తెలిసిందే. గత శుక్రవారం స్పీకర్‌ను కలిసిన ఆయన.. పిటిషన్‌ ‌వేసి ఏడాది గడిచిందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. స్పీకర్‌ ‌చర్యలు తీసుకోకుంటే పార్లమెంట్‌లో ఆందోళన చేపడతామని వ్యాఖ్యానిం చారు. అవసరమైతే పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని అన్నారు. ఈ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశ మయ్యాయి.

నరసాపురం వైసిపి రెబల్‌ ఎం‌పి రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వైసిపి ఎంపిలు కోరుతుండడం పట్ల లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా స్పందించారు. వైసిపి దాఖలు చేసిన రఘురామ అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకునేం దుకు పక్రియ ఉంటుందని వెల్లడించారు. నిర్ణయం తీసుకునే ముందు ఇరుపక్షాలతో చర్చిస్తామని తెలిపారు. ఇరు పక్షాల వాదనలను పరిశీలించాకే తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. పిటిషన్‌ ‌పరిశీలన తర్వాత సభాహక్కుల కమిటీకి పంపిస్తామని వివరించారు. సభలో నిరసన తెలిపేందుకు ఎవరికైనా హక్కు ఉంటుందని, అయితే, సభలో ఏదైనా అంశం ప్రస్తావనకు కొన్ని నిబంధనలు పాటించాలని అన్నారు.

రఘురామ అనర్హత పిటిషన్‌పై ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయలేమని, పిటిషన్‌ ‌పరిశీలన పక్రియకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు. ఇదిలావుంటే తన అభిప్రాయాలు తమ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయా? అని వైసీపీ రెబల్‌ ఎం‌పీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. ఆలయాలపై దాడులు జరగకూడదు అనేది తమ పార్టీ నిర్ణయం కాదా? అని నిలదీశారు. తనపై అనర్హత వేటుకు కారణం ఏమిటని ప్రశ్నించారు. ఎంపీ కనకమేడల తనను పరామర్శ కోసం మాత్రమే కలిశారన్నారు. పరామర్శ కోసం వస్తే రాజీనామాకు లింకు పెడుతారా? అని ప్రశ్నించారు. తెలుగు భాషపై ఏపీ ప్రభుత్వ తీరు రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని రఘురామ పేర్కొన్నారు.

Leave a Reply