అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో కూడిన నిమ్స్ తదితర ఆస్పత్రుల్లో కరోనా వైరస్ కారణంగా వైద్య సిబ్బంది ఆందోళనలకు గురవుతోంది. దాదాపుగా అనేక ఆస్పత్రుల్లోని వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఉద్యోగులు వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ లక్షణాలు బయటపడగా మరికొంత మందికి ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా సోకినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా జంటనగరాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు ఇలా అంతా వైరస్ బారిన పడి ఆందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది నిమ్స్‌లోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. వీరిలో చాలా వరకు వైరస్ ప్రభావం తీవ్రత తగ్గుముఖం పట్టడంతో •ం క్వారంటైన్‌కు వెళ్లారు. ఈ పరిణామాల నేపథ్యంలో క్యాథ్లాబ్, కార్డియాలజీ, నెఫ్రాలజీ విభాగాలకు వచ్చిన రోగుల ద్వారానే వైరస్ సోకినట్లు నిమ్స్ వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. 75 శాతం మేరకు కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు ఆయా వర్గాలు పేర్కొంటు న్నాయి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరికి వైరస్ సోకే ప్రమాదం లేకపోలేదని, ఆ దిశగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మినిహా చేయగలిగినదే లేదని ఓ జూనియర్ డాక్టర్ పేర్కొన్నారు. ఏది ఏమైనా వైరస్ కారణంగా మరణాలు లేకపోవడం గమనార్హం. పాజిటివ్‌గా నమోదైన వైద్యులు, పారామెడికల్ సిబ్బందిలో చాలా వరకు ఆస్పత్రి ఐసోలేషన్ వార్డు నుంచి •ం క్వారంటైన్‌కు వెళుతున్నారు. కానీ వైద్యులు సైతం భయం భయంగానే వైద్య సేవలందిస్తున్నారని ఓ ఉద్యోగి పేర్కొన్నారు. మరోపక్క ఆపరేషన్ థియేటర్లలో కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదని ఓ సీనియర్ వైద్యుడు పేర్కొన్నారు. ఏదైనా ఆపరేషన్ జరిగిన సందర్భంగా అక్కడున్న వైద్యులంతా కలిసి ఒకే చోట భోజనం చేయడం పరిపాటి. ఆ సమయంలో మాస్కులు ఉండవు. దాని వల్ల కూడా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం లేకపోలేదంటున్నారు. దీంతో వెద్యులందరికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్టు పేర్కొన్నారు. వైద్యులతో పాటుగా పారామెడికల్ సిబ్బంది, ఉద్యోగులకు సైతం ప్రాధాన్యతా క్రమంలో పరీక్షలు నిర్వహించాలన్న యోచనలో యాజమాన్యం ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే శస్త్ర చికిత్సలను నిలిపివేయాలని యాజమాన్యం సూచించింది. నిమ్స్ ఆస్పత్రిలో ప్రస్తుతం 150 మంది వైద్యులు ఉండగా వీరిలో దాదాపు 25 మందికి పాజిటివ్‌గా నమోదైనట్టు తెలుస్తోంది. అలాగే పారామెడికల్ సిబ్బంది 200 మంది ఉండగా వీరిలో 20మందికి పైగా వైరస్ సోకినట్లు సమాచారం. కాంట్రాక్టు సిబ్బంది 400మందిలో 25 శాతం మేరకు •ం క్వారంటైన్లో ఉన్నట్టు తెలుస్తోంది.
వరంగల్ ఎంజిఎంలో ఆరుగురికి కరోనా:
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సోమవారం ఆరుగురికి కరోనా పాజిటీవ్ వచ్చినట్లు వైద్యాధికారులు నిర్దారించారు. ఆదివారం దవాఖానలో చేరిన 13 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 6గురికి పాజిటీవ్ రిపోర్టు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఇందులో ఈ నెల 6న బ్రాహ్మణవాడలో ఓ టీచర్‌కు కరోనా పాజిటీవ్ రాగా.. అతని భార్య, కూతురికి కరోనా నిర్దారణ అయినట్లు తెలిపారు. కాజీపేట విష్ణుపురికి చెందిన భార్యాభర్తలిద్దరికీ పాజిటీవ్ రాగా.. వారు వారం రోజులు హైదరాబాద్‌లో ఉండి ఆదివారం వరంగల్ ఎంజీఎంలో చేరారు. జనగామ జిల్లాకు చెందిన 37ఏళ్ల మహిళలకు పాజిటీవ్ రాగా, ఎమ్మెల్యే గన్‌మెన్‌కు రెండో సారి నిర్వహించిన పరీక్షలో పాజిటీవ్ వచ్చినట్లు తెలిపారు. ఈ ఘటనతో వైద్య సిబ్బందిలో ఆందోళన నెలకొంది.