Take a fresh look at your lifestyle.

ఆక్సిజన్ సరఫరా లో రైల్వే బృహత్తర పాత్ర

ప్రజాతంత్ర ప్రతినిధి ,న్యూ దిల్లీ ,మే 12:  భారతీయ లైఫ్ లైన్ రైల్వే కొరోనా కల్లోలంలో దేశ ప్రజల సేవకు ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ రవాణా చేసి దేశ ప్రజల ఊపిరి బాధ్యతను తన భుజ స్కాందలపై ఎత్తుకుని కీలక పాత్ర పోషించటంలో భారతీయ రైల్వే అగ్రగామిగా నిలుస్తోంది. ఇప్పటికి 100 ట్రిప్పుల్లో ఆక్సిజన్ సరఫరా చేసింది భారతీయ రైల్వే. ఇప్పటికి దేశవ్యాప్తంగా 800 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ భారత్ రైల్వే రవాణా చేసింది.

దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలకు మెడికల్ ఆక్సిజన్  ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ద్వారా  సరఫరా అవుతుంది.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 396 ట్యాంకర్లలో 6260 మెట్రిక్ టన్నులకు పైగా ఆక్సిజన్ ను రైల్వే రవాణా చేసింది. ఇప్పటి వరకు 100 ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆక్సిజన్ ట్యాంకర్లను గమ్యస్థాలకు  చేరవేశాయి. మహారాష్ట్రకి 407,ఉత్తరప్రదేశ్ కి 1680,మధ్యప్రదేశ్ 360,హర్యానా 939,తెలంగాణాకి 123,రాజస్థాన్ 40, ఢిల్లీకి 2404,కర్ణాటక 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను ఇప్పటి వరకు రైల్వేశాఖ సరఫరా చేసింది.

Leave a Reply