Take a fresh look at your lifestyle.

ఇం‌ట్లో ఉన్నా మాస్కు పెట్టుకోవాలి

  • ఇతరులను ఇంటికి రానీయకపోవడమే మంచిది
  • తీవ్రంగా కొరోనా సెకండ్‌వేవ్‌
  • ‌రుతస్రావం సమయంలోనూ టీకా తీసుకోవొచ్చు
  • నీతి ఆయోగ్‌ ఆరోగ్య విభాగం వెల్లడి

బయటికి వెళ్లినప్పుడే కాదు, ఇంట్లో ఉన్నా కూడా మాస్క్ ‌ధరించాలని కేంద్రం సూచించింది. కోవిడ్‌ ‌సెకండ్‌ ‌వేవ్‌ ‌తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో నీతి అయోగ్‌ ఆరోగ్య విభాగం ఈ సూచన చేసింది. సోమవారం ఢిల్లీలో కోవిడ్‌ ‌తీవ్రతపై ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్‌ ‌వీకే పాల్‌ ‌మాట్లాడుతూ కోవిడ్‌ ‌తీవ్రంగా ఉన్న కారణంగా అత్యవసరమైతే కానీ బయటికి వెళ్లొద్దన్నారు. కుటుంబ సభ్యులతో ఉన్నా సరే మాస్క్ ‌తప్పనిసరిగా ధరించాలని, అలాగే ఈ సమయంలో ఇతరులను ఇంటికి పిలవకపోవడమే మంచిందని పేర్కొన్నారు. మొదటి దశతో పోల్చుకుంటే రెండవ దశలో కోవిడ్‌ ‌ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం దేశంలో రోజుకు సగటున 3 లక్షలకు పైగానే పాజిటివ్‌ ‌కేసులు నమోదు అవుతున్నాయి. ఢిల్లీ, ముంబై వంటి నగరాల పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఓ వైపు దేశంలో విస్తృతంగా టీకా కార్యక్రమం కొనసాగుతోంది. మరోవైపు కొరోనా కూడా అదే స్థాయిలో విజృంభిస్తున్నది. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్‌, ‌తమిళనాడు రాష్ట్రాల్లో  కోవిడ్‌ ‌ప్రభావం ఎక్కువగా ఉంది. మహిళలు రుతుస్రావం సమయంలో కూడా టీకా తీసుకోవొచ్చని, దీని కోసం టీకా తీసుకోవడాన్ని వాయిదా వేయాల్సిన అవసరం లేదని నీతి అయోగ్‌ ఆరోగ్య విభాగం సభ్యుడు డాక్టర్‌ ‌వీకే పాల్‌ ‌తెలిపారు. కోవిడ్‌ ‌కేసులు పెరుగుతున్న రిత్యా టీకాలను తగ్గించడానికి తాము అనుమతించమని, ఈ సమయంలో టీకాలను మరింత పెంచాలని, అలాగే రుతుస్రావం సమయంలో టీకాలు వేసుకోవడంపై అనేక ప్రశ్నలు వస్తున్నాయని, నిరభ్యంతరంగా వేసుకోవచ్చన్నారు. రుతుస్రావం పేరుతో టీకా వేసుకోవడాన్ని వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

Leave a Reply