పథకాలను ప్రజలకు చేరవేయడంలో పత్రికలదే ముఖ్య పాత్ర: జగదీష్ ములుగు

ప్రభుత్వాలు ప్రజల అభివృద్ధి కోసం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజలకు చేరవేయడంలో పత్రికలే ముఖ్యపాత్రలు పోషిస్తాయని ములుగు జిల్లా జడ్పీ చైర్మెన్ కుసుమ జగదీష్ అన్నారు. బుధవారం ప్రజాతంత్ర దిన పత్రిక ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన 2020 నూతన సంవత్సర క్యాలెండర్ను జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకరావడంలో పత్రికలు ముఖ్య పాత్రను వహిస్తాయన్నారు.
పత్రికలు ఎప్పటికి ప్రభుత్వానికి, ప్రజలకు వారదులుగా ఉంటాయన్నారు. ప్రతి సమస్యను నిర్భయంగా రాస్తు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకరావడం కేవలం పత్రికల వల్లనే అవుతుందన్నారు. పత్రికల విలువలను దిగజార్చ కుండా నిజాన్ని నిర్బయంగా చాటే జర్నలిస్టులుండటం అబినందనీ యమన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జినుకల ప్రభాకర్, చింతల కుమారస్వామి, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Tags: zp chairman, kusuma jagadish, new year 2020 calendar, prajatantra calendar