- ఆరు ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు
- అధికారులతో సక్షాలో దిశానిర్దేశం చేసిన సిఎం జగన్
అమరావతి,జూన్ 25 : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి ఎపి సిఎం జగన్ యుద్ద ప్రతిపాదికన సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది ముఖ్యంగా ఆరు ప్రధాన ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు. అవుకు టన్నెల్-2, వెలిగొండ ప్రాజెక్టులో హెడ్ రెగ్యులేటర్ వర్కస్, టన్నెల్-1 పనులు, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార-నాగావళి అనుసంధానం, వంశధార ప్రాజెక్టులో ఫేజ్ -2లో స్టేజ్-2. ఇప్పటికే అవుకు టన్నెల్ -2 పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి అధికారులు కృషి చేస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది అక్టోబరులో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతుంది. మరో వైపు వెలిగొండ టన్నెల్-1లో ఇంకా తవ్వాల్సింది 700 టర్లు ఉంది. నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలుచేస్తోంది. వచ్చే అక్టోబరు నాటికి టన్నెల్-1 ద్వారా నీటిని విడుదల చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా సీఎం జగన్ గురువారం ప్రభుత్వం అధికారులతో సక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఈ ఆరు ప్రాజెక్ట్ ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయనే అంశాలు చర్చించారు. ఈ ఏడాదిలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నల్లమలసాగర్ పూర్తయ్యిందని, ఆర్ అండ్ ఆర్కూ అన్ని రకాల అనుమతులు వచ్చాయని, నల్లమలసాగర్ నుంచి ఈస్ట్ర మెయిన్ కెనాల్‌కు వెళ్లే 180 టర్ల టన్నెల్ పనులు కూడా మరో 3 నెలల్లో పూర్తవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తీగలేరు కెనాల్‌కు వెళ్లే 600 టర్ల టన్నెల్ పనులు కూడా పూర్తవు తున్నాయని మరో నాలుగు నెలల్లో టన్నెల్, కాల్వ పనులు పూర్తి చేస్తామన్న అధికారులు ముఖ్యమంత్రికి స్పష్టం చేశారు. దీంతోపాటు మిగిలి ప్రాజెక్ట్ లను కూడా అనుకున్నసమయానికి పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు గత ఏడాది వరదలను దృష్టిలో ఉంచుకుని పోలవరం ముంపు బాధితులను తరలించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.
41.5 టర్ల ఎత్తు వరకూ ప్రస్తుతం ముంపు ప్రమాదం ఉన్న వారికి సహాయ, పునరావాస కార్యక్రమాలు ముమ్మరం చేయాలన్నారు. చెల్లింపులు పోగా, పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఖర్చు చేసిన రూ.3791 కోట్లకు సంబంధించి కేంద్రం నుంచి రీయింబర్స్ పొందేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు ఆదేశించారు. ఈ ఏడాది నవంబర్ నాటికి రాష్ట్రంలో పెండింగ్ ఉన్న అన్ని ప్రాజెక్ట్ లను పూర్తి చేయాలని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. వర్షపు నీరు వచ్చే సమయంలో కూడా చేసుకోదగ్గ పనులు చేసుకోవాలన్న సీఎం, ఆ మేరకు అధికారులకు ఆదేశాలు.స్పిల్ వే పూర్తయిన తర్వాత గేట్లను నవంబరు నుంచి బిగించాల్సి ఉంటుంది కాబట్టి, ఆలోగా గేట్ల ఫాబ్రికేషన్ అయ్యేలా చూడాలన్నారు. పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఖర్చు చేసిన రూ.3791 కోట్లకు సంబంధించి కేంద్రం నుంచి రీయింబర్స్ పొందేలా చర్యలు తీసుకో వాలని సిఎం జగన్ అన్నారు. క్యాంపు కార్యా లయంలో జరిగిన సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, సీఎస్ నీలం సాహ్ని, జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ తదితరులు హాజరయ్యారు.