Take a fresh look at your lifestyle.

లాక్డౌన్ మాత్రమే ముగిసింది… కొరోనా ఇంకా వెళ్ళలేదు

మాస్క్లు ధరించకుంటే ప్రమాదంలో పడ్డట్లే  పండుగల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి… 
జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం
కొరోనా మహమ్మారితో భారత దేశం ఇంకా పోరాడుతూనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. రానున్న పండుగల సమయం లో దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  ప్రస్తుతం లొక్డౌన్ మాత్రమే ముగిసింది కొరోనా ఇంకా దేశం విడిచి వెళ్లలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. దేశంలో కొరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ మంగళవారం జాతి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.  ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ లొక్డౌన్ ముందుగానే విధించడం వల్ల దేశంలో కొరోనా కేసులను భారీ సంఖ్యలో నియంత్రణ చేయగలిగామని చెప్పారు.  గతంతో పోలిస్తే కొరోనా మరణాల సంఖ్య బాగా తగ్గిందనీ అలాగే రికవరీ శాతం బాగా పెరిగిందన్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2 వేల కొరోనా పరీక్ష కేంద్రాలు పని చేస్తున్నాయని తెలిపారు.. ల్యాబ్ ల సంఖ్యను పెంచడం కూడా కొరోనా కేసులను తగ్గించడానికి ఉపయోగపడిందని పేర్కొన్నారు.  భారత్లో కొరోనా టెస్ట్ ల సంఖ్య త్వరలో 10 కోట్లకు చేరుతుందని వెల్లడించారు. దేశంలో ప్రతీ 10 లక్షల 5.5 వేల మందికి కొరోనా సోకిందన్నారు. రానున్న పండుగల సీజన్లో ప్రతీ ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు. లాక్అడౌన్ లేదని ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు.  అమెరికా,  యూరప్ దేశాలలో ప్రస్తుతం పరిస్థితి చాలా భయంకరంగా ఉందనీ ఆ దేశాల పరిస్థితిని చూసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్బంగా ప్రధాని మోడీ దేశ ప్రజలను హెచ్చరించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply