Take a fresh look at your lifestyle.

కొనసాగించాల్సింది‘అంబేద్కర్‌’‌సజీవ స్ఫూర్తి..

ప్రపంచ దేశాల రాజ్యాంగాలకే తలమా నిక మైన రాజ్యాంగాన్ని రూపొ ందించిన ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ పితదే అనడంలో, అమ లుపరిచే క్రమంలో ఈ  పాలకులకు ఏమైనా శషబిషలు ఉంటే ఉండవచ్చు. కాని ఈ దేశ ప్రజలకు ఏలాంటి సందేహం లేదు. నేడు మనం తినే ప్రతి మెతుకు మీద అతని పేరుంది. మనం చదువుకున్న అక్షరం వెనుక అతని శ్రమ ఉంది. నేను అని ఇప్పుడు నిలబడిన అస్థిత్వం వెనుక అతని నీడ ఉంది. మన రక్తంలో అతడి కష్టం ప్రవహిస్తుంది. ఈ దేశ చరిత్రను పీడితుల దృష్టి కోణం నుండి ఆధునిక ధృక్పథం కోణంలో చరిత్రను తిరుగరాసిన మహనీయుడు బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌. ‌గౌతమ బుద్ధుని అనంతరం ఈ దేశాన్ని ఆవహించి ఉన్న అజ్ఞానపు జీవితాలను,  ఊబిగా మార్చిన ఆధిపత్య పీడన అనే అంధకార భావజాలాన్ని చీల్చి చెండాడి  వేల ఏండ్లుగా అంచులకు నెట్టివేయబడ్డ దళితులు, బహుజన, మహిళలు తమ చరిత్ర మట్టి పాదాలతో నడిచి రావడానికి బాటలు వేసిన మార్గదర్శి అంబేద్కర్‌. ‌భారతదేశంలో బానిసత్వానికి వివక్షతలకు, అంటరానితనానికి బలిచేయబడిన అసంఖ్యాకులైన అస్పృశ్యులను అంధకారం నుండి వెలుతురు దిశగా, కష్టాల, బానిసత్వం నుండి స్వేచ్ఛా వాయువుల దిశగా నడిపిన సామాజిక మానవతామూర్తి బాబాసాహెబ్‌.
‌సనాతన వైరుధ్యాలకు రాజ్యాంగ విలువలను బలిస్తారా..!
మనుషులని మనుషులుగా చూడని వారిని ఎందుకు గౌరవించాలి..? మనలని భౌతిక ఎదుగుదలకు దూరంగా నెట్టి పరాధీనులుగా దుఃఖితులని చేసిన వారిని మనమెందుకు గౌరవించాలి…? 1949 నవంబర్‌ 25‌న రాజ్యాంగ పరిషత్‌లో అంబేద్కర్‌ ‌మాట్లాడుతూ… ఎంతకాలమని మనం ఈ వైరుధ్యాల మధ్య బతుకును కొనసాగించాలి..? ఎంతకాలమని మనం సమాజంలోనూ ఆర్థిక జీవితంలోను సమానత్వం లేకుండా కొనసాగాలి. రాజ్యాంగ చట్రంలో హక్కులు, అవకాశాలు చేజిక్కించు కోవాలి. భారతదేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక చారిత్రక నేపథ్యాలను దృష్టిలో ఉంచుకొని ఆదర్శ భారతదేశం కోసం రాజ్యాంగాన్ని రూపొందించిన మేధావి. అవసరమైన సందర్భంలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించవచ్చు అని అంబేద్కర్‌ ‌కల్పించిన అవకాశాన్ని దుర్వినియోగపరుస్తూ పాలకులు మందబలం ఆసరాగా చేసుకుని రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో బాజాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా కార్పొరేట్‌ ‌శక్తులకు అనుకూలంగా చేసిన అనేక నల్ల చట్టాలు ఇందుకు సాక్ష్యాలు. అంబేద్కర్‌ ‌రాసిన రాజ్యాంగాన్ని, వారు రుపొందించిన చట్టాలను, అంబేద్కర్‌ ఆలోచనలను ఈ ప్రజలకు తెలియ పరచకుండా కుట్రలు చేస్తున్నాయి.
భీం రావ్‌ అం‌బేద్కర్‌ ‌చొరవతో సమానత సాధనలో భాగంగా ప్రారంభించబడ్డ కొద్దిపాటి అవకాశాలైన రిజర్వేషన్లను ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ పేరుతో చాలా వరకు తగ్గించబడ్డాయి, తొలగించబడ్డాయి. ఎడారిలో ఒయాసిస్‌ ‌మాదిరిగా ఉన్న అవకాశాలను కూడా ఈ ప్రభుత్వాలు సహించలేక పూర్తిగా తొలగించే ప్రయత్నాన్ని వేగవంతం చేస్తున్నాయి. రాజ్యాంగంలోని లౌకిక, సామ్యవాద పదాలను మార్చే ప్రయత్నంలో రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను క్రియా రహితంగా మార్చివేసింది. మొత్తానికి మొత్తంగా రాజ్యాంగ చట్టాలను కార్పొరేట్‌ ‌శక్తులకు ఆశ్రితంగా కేంద్రం శ్రీకారం చుడుతున్నది. ఇది భారత ప్రజాస్వామ్యానికి, సామాజిక దేశ భక్తికి సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే ప్రక్రియ. బాజాపా అధికారంలోకి వచ్చిన నాటి నుండి అంబేద్కర్‌ ఆలోచనలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మెరుగు పరిచేది పోయి అంచెలంచెలుగా వారి స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. అంబేద్కర్‌ ‌రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సకల జనులపైన సబ్బండ వర్గాలపైన ఉంది. ఆ వైపుగా అంబేద్కర్‌ ఆలోచనలు ముందుకు తీసుకుపోవాలి..ఈ మధ్య రాజ్యాంగ రచయితలను, రాజ్యాంగాన్ని అవహేళన చేయడం కొందరికి సరదాగా మారింది. 1950 నుండి ఇప్పటి వరకు చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు వారిని నిరాశ పర్చినట్లున్నాయి. ఈ ఏడు దశాబ్దాల కాలంలో కాస్తో కూస్తో అవకాశాలు పొందుతున్న బడుగు బలహీన వర్గాలను ఆధిపత్య వర్గాలు సహించలేక పోయినాయి. అందువల్లనే వారు రాజ్యాంగాన్ని మార్చాలని, అది సరిగా పనిచేయడం లేదని విమర్శిస్తున్నారు. ఇవన్ని దారి తప్పిన ఆలోచనలే. ఎందుకంటే రాజ్యాంగాలు వాటికవిగా పనిచేయవు. అవి అచేతనమైనవి. వాటి చేత పౌరులు, ఎన్నికైన, నియమితులైన నేతలు పనిచేయించవలసి ఉంటుంది. ఒక సారి వెనుదిరిగి చూస్తే జాతి లక్ష్యాలను నిర్దేశించడంలో వాటికి కావాలిసిన పాలనా వ్యవస్థలను అందించడంలో రాజ్యాంగ రచయితలు సాధించిన విజయం ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజ్యాంగాన్ని రూపొందిస్తున్న కాలంలోని ఆదర్శవాదం, ఆనాడు దేశం ఎదుర్కొంటున్న రకరకాల సమస్యల కారణంగానే రాజ్యాంగ రచయితలు కొన్ని భవిష్యత్‌ ‌పరిణామాలను అంచనావేయలేకపోయి ఉండవచ్చు. నిజానికి ప్రతి సమస్యకు పరిష్కారం ఏ రాజ్యాంగంలోను లభించదు. తమకెదురయ్యే సమస్యలకు రాజ్యాంగ సూత్రాల పరిధిలో తమదైన పద్దతిలో పరిష్కార మార్గాలను కనుగొనాల్సిన బాధ్యత భావి నేతల మీదే ఉంటుంది. రాజ్యాంగం అనేది భావి తరాలకోసం రూపొందించబడుతుంది. కానీ దాని నిర్దిష్ట క్రమం ఎప్పుడు ఒడిదొడుకులు లేకుండా ఉండదు. అంబేద్కర్‌ అభిప్రాయం ప్రకారం భారత రాజ్యాంగం సాధారణ సూత్రాలకు మానవీయ భావోద్వేగాలకు సంబంధించిన నిబంధనలతో కూడిన దస్తావేజు.
త్యాగాలు, పరిష్కారాలతో కూడుకున్న రాజ్యాంగాన్ని మారుస్తారా..!
భారత ప్రజలు బ్రిటిష్‌ ‌వారిపై వీరోచిత పోరాటాం చేసి సకలజనులకు సంబంధించిన రాజ్యాంగాన్ని కష్ఠపడి రుపొందించుకుంటే ..అలాంటి సర్వోన్నతమైన రాజ్యాంగంను మారుస్తానడం పాలకుల మూర్ఖపు బుద్ధి కాదా..! రాజ్యాంగాన్ని మార్చాలి అనడం అంటే నిరంకుశ విధానాలకు మార్గం సుగమం చేసుకునే ఆలోచనలో భాగమే. ఫ్యూడల్‌ ఆలోచనలు ఉన్న పాలకులకు చరిత్రలో ఏనాడు ప్రజాస్వామిక విధానాలు గిట్టలేదు. అలాంటి వారికి అంబేద్కర్‌ ‌వ్రాసిన  రాజ్యాంగం ఏం అర్థమవుతది.? నిరంకుశ పాలనకు చట్టబద్ధత కల్పించాలనే ఆలోచనతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. పాలకులు అనుకుంటున్నటువంటి రాజ్యాంగం బహుశా నిరంకుశ రాజ్యాంగం అయి ఉండవచ్చు.
అంబేడ్కర్‌ ‌విగ్రహం సరే.! స్పూర్తి కొనసాగింపేది.?
శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూర్చుతానని ప్రమాణం చేసినరు కదా..!  మీరు మీ బాధ్యతలను నిర్వహించే క్రమంలో ఏనాడైనా మీరు చేసిన ప్రమాణాన్ని పునఃశ్చరణ చేసుకున్నారా.! ప్రజాప్రతినిధులుగా కొనసాగిన వారు, కొనసాగుతున్న వారు ఏనాడైనా కనీసం పట్టుమంటే పది పేజీలు అయినా రాజ్యాంగాన్ని చదివారా! వేయిల పుస్తకాలు చదివినమని చెప్పుకునేవారు కనీసం ఒక్కసారైనా రాజ్యంగాన్ని చదివారా.! రాజ్యాంగాన్ని చదవకుండా ఈ దేశ ప్రజల ఆకాంక్షలు,హక్కులు ఏమిటో ఏలా తెలుస్తాయి.? ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన 77 కులోన్మాద• హత్యలకు పరిష్కారం చూపరా.! కుల నిర్మూలన పోరాటాన్ని ఈ పాలకులు ఎందుకు ప్రధాన ఏజెండాగా పెట్టుకోరు.? అంబేద్కర్‌ ‌గారి పెద్ద పెద్ద విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు, ఇది కూడా తెలంగాణ సమాజం పోరాట ఫలితంగా సాధించుకున్నదే. పాలనా కేంద్రాలకు వారి పేరు పెడుతున్నారు ఇది సరే. కానీ ఆ పాలనా కేంద్రంలో అంబేద్కర్‌ ఆకాంక్షించిన దళిత బడుగు బలహీన మెజారిటీ వర్గాలకు జనాభా దామాషా ప్రకారం వారి వాటా వారికి కల్పించాలి కదా..! దళిత ముఖ్యమంత్రి చేస్తానన్న హమీ నిలబెట్టుకోవాలి కదా..! చట్ట సభలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న అంబేడ్కర్‌ ఆశయాన్నికి కొనసాగింపేది..? నేరెళ్ల దళిత బాధితులకు జరిగిన న్యాయం ఏమిటి.? దళితుల అభ్యున్నతికి దేశ స్థాయిలో తీసుకొచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ ‌ప్లాన్‌ ‌చట్టం ఏమైంది.? మూడెకరాల ముచ్చట ఎటు పోయింది.? కేవలం నామకరణాలతోనే విగ్రహ ప్రతిష్టాపనలతోనే సరిపుచ్చుతారా..! రాజ్యాంగాన్ని బలోపేతం చేయరా..! అంబేద్కర్‌ ‌స్ఫూర్తిని కొనసాగించరా.!
రాజ్యాంగ పరిరక్షణే అంతిమ ధ్యేయం..
రాజ్యంగం వ్యక్తులకు సంబంధించినది కాదు..వ్యవస్థకు సంబంధించినది. భారత రాజ్యాంగం సర్వజనులకు సంబంధించినటువంటి రాజ్యాంగం. ఈ వ్యవస్థ ను పదిలర్చుకునే క్రమంలో ‘‘చదువుకోండి, సంఘటితం కండి, పోరాడండి, అనే అంబేడ్కర్‌ ‌నినాద స్ఫూర్తితో’’ భారత రాజ్యాంగ పరిరక్షణే మన కర్తవ్యంగా ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఉన్నది. సకలజనుల రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. అంతిమంగా బాబాసాహేబ్‌ ఆలోచనలను సజీవంగా ఉంచుదాం..భవిష్యత్‌ ‌తరాలకు అందిద్దాం.
image.png
పందుల సైదులు, తెలంగాణ విద్యావంతుల వేదిక, 9441661192

Leave a Reply