Take a fresh look at your lifestyle.

‘‘‌ది లైఫ్‌ ‌లైన్స్’’

‌వాళ్లు నాగరికతా నాగేటిచాళ్ళను
వదనాల్లో అలంకరించుకున్న వాళ్ళు

కర్రనో, లోహపుముక్కనో నాగలిగా మార్చి
శ్రమించే కండరాలతో ఆకాశ నక్షత్రాలను
విత్తనాలుగా అవనిపై చల్లుతున్న వాళ్ళు
వాళ్ళ చెమట ధారలతో పులకరించిన
మట్టి సత్తువను చేతిముద్దగా అందిస్తున్న వాళ్ళు

వాళ్ళ చేతుల్లో ఖడ్గాలు లేవు
వాళ్ళ పిడికిళ్లలో బాంబులు లేవు
చేతులనే ఖడ్గాలుగా, పిడికిళ్లను బాంబులుగా
వెన్నెముకను విరగగొడుతున్న పాలకులను
ప్రశ్నించడానికి కెరటాల్లా నడుస్తున్న వాళ్ళు
మిలియన్ల గొంతుకలతో రైతు ఘోషను
దిగంతాలకు వినిపిస్తున్నవాళ్ళు

శ్రమతో, సంపద సృష్టితో
సంబంధం లేని వాడ, పరిచారకత్వం
శ్రముల స్వభావ జమని సూత్రీకరించిన
అగ్ర ఆధిపత్య ముఠా వాడా!
ప్రకృతి వనరులను కార్పొరేట్లకు
కట్టబెట్టిన కసాయమూక వాడా!
శ్రమతో జనులకు ఆహారాన్ని
వాగ్ధానం చేస్తున్న
రైతుల ఆత్మగౌరవాన్ని అంగడిలో          నిలబెడుతున్న వాడా!
ఆక్రమణ అగ్రి చట్టాలతో అన్నదాతలను
అణచివేస్తున్న వాడా!

వాళ్ళ ప్రేమకు నేల పంటలు
ఫలాలను ఇచ్చింది
వాళ్ళ బలానికి అడవులు, కొండలు
నదినదాలు, పొదలు
తలలు వంచుకున్నాయి.
ఇప్పుడు వాళ్ళు వాళ్ళ హృదయ క్షేత్రంలో
దివిటీలను వెలిగించి రాస్తాపై
రాకాసులను దునుమాడబోతున్నారు.

Leave a Reply