Take a fresh look at your lifestyle.

ఎస్పీ బాలసుబ్రమణ్యం అస్తమయం…

కొరోనా సోకడంతో గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలకు గురైన డా.ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 1.04గంటలకు తుదిశ్వాస విడిచారు. తన గానంతో కోట్లాది మంది సంగీత ప్రియుల్ని వీనుల విందు చేసిన గాన గంధర్వుడి మరణం యావత్‌ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఆగస్టు 5న ఎస్పీబీ తనకు కొరోనా సోకినట్టు ప్రకటించారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు.

అప్పటినుంచి అక్కడే చికిత్స పొందుతున్న బాలు ఆరోగ్యం గతంలో ఓసారి విషమించడంతో ఎక్మో, వెంటిలేటర్‌ సాయంతో చికిత్స కొనసాగిస్తూ వచ్చారు. అయినా ఫలితం లేకపోయింది. తాజాగా మరోసారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఎస్పీబీ కన్నుమూశారు. బాలు మృతి పట్ల యావత్‌ సినీ, సంగీత ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతాపం తెలిపారు. ఒక మహోన్నత గాయకుడిని దేశం కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని ముఖ్య మంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేసారు.

Leave a Reply