Take a fresh look at your lifestyle.

తండ్రికి తగ్గ తనయుడు- నవతరం నాయకుడు

జనహితమే తనహితంగా ముందుకెళుతున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మొదలైన ప్రయాణంలో ఆయన ఎన్నో మైలురాళ్లను అధిగమించారు. సీఎం కేసీఆర్‌ ‌లక్ష్యాలకు అనుగుణంగా పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌గా పనిచేస్తూ ఎన్నో అద్భుతాలను,విజయాలను సాధించాడు. పేదల అభివృద్ధి కోసం కేటీఆర్‌ ‌పనిచేస్తున్న తీరు అద్భుతం. సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచిన ఘనత కేటీఆర్‌ ‌దే.ఆయనలో దళిత, బీసి విధానముంది. రైతులు, పేదలు, గ్రామీణ, పట్టణ ఆర్థిక న్యాయవ్యవస్థ సంబంధించిన అంశాలపై ఆయన ఆలోచన దూరదృష్టి కనిపిస్తుంది. అందుకే ఆయన అనునిత్యం పేదలగురించి ఆలోచిస్తుంటారు. నేటి సమాజంలో సేవాభావంతో ముందుకుసాగుతున్న ప్రజాప్రతినిధులను మనం వేళ్లపై లెక్కించవచ్చు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితిలో కార్యకర్త స్థాయిలో చేరి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు.పార్టీలో వివిధ పదవులు స్వీకరిస్తూ తండ్రి కేసీఆర్‌ అడుగుజాడల్లో నడుస్తూ, పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందినాడు.2014 రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టినాడు. ఆయన మాటలు తూటాలు, ప్రభుత్వానికి టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఆయన విధేయుడు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పుత్రుడిగా రాజకీయ ఆరంగ్రేటం నుండి నేటివరకు వెన్నంటే ఉంటూ, ప్రతిపక్షాల చేత కూడా మన్ననలు పొందుతూ, సవాళ్లకు, ప్రతి సవాళ్లను దేనికైనా రెడీ అంటూ ఫైర్‌ ‌బ్రాండ్‌ ‌లీడర్‌ ‌గా పేరుపొందిన యువనేత సిరిసిల్ల శాసనసభ్యుడు టిఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రివర్యులు
కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా…. జనహితమే తనహితంగా ముందుకెళుతున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మొదలైన ప్రయాణంలో ఆయన ఎన్నో మైలురాళ్లను అధిగమించారు. సీఎం కేసీఆర్‌ ‌లక్ష్యాలకు అనుగుణంగా పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌గా పనిచేస్తూ ఎన్నో అద్భుతాలను,విజయాలను సాధించాడు. పేదల అభివృద్ధి కోసం కేటీఆర్‌ ‌పనిచేస్తున్న తీరు అద్భుతం. సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచిన ఘనత కేటీఆర్‌ ‌దే. ఆయనలో దళిత, బీసి విధానముంది.

రైతులు, పేదలు, గ్రామీణ, పట్టణ ఆర్థిక న్యాయవ్యవస్థ సంబంధించిన అంశాలపై ఆయన ఆలోచన దూరదృష్టి కనిపిస్తుంది. అందుకే ఆయన అనునిత్యం పేదలగురించి ఆలోచిస్తుంటారు. నేటి సమాజంలో సేవాభావంతో ముందుకుసాగుతున్న ప్రజాప్రతినిధులను మనం వేళ్లపై లెక్కించవచ్చు. కేటీఆర్‌ అం‌దరివాడు ఎల్లప్పుడూ ఆయన ముఖంలో చిరునవ్వుతో పలకరిస్తాడు. శాసనసభ్యుడిగా పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌గా, రాష్ట్ర మంత్రిగా మరియు నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించే పనిలో నిమగ్నమవుతాడు. ప్రజలందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఆపద్బాంధవుడిగా ఆదుకుంటాడు. ప్రభుత్వ కార్యక్రమమైన, ప్రైవేటు కార్యక్రమమైన సందర్భానుసారం సమయస్ఫూర్తితో మాట్లాడే ఆయన మాటలు కత్తుల పదునైనవి,సందర్శకులైన, నాయకులైన, ప్రజా ప్రతినిధులైన, అధికారుతోనైన ఆప్యాయంగా పలకరించే ఆయన మాటతీరు సామాన్యులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఆయన సింపుల్‌ ‌గా నిరాడంబరంగా ఎల్లప్పుడూ సాదాసీదా మనిషిలాగా కనిపిస్తుంటాడు. మాటల్లో సౌమ్యం,మనసు మనోహరం. కష్టంముందన్న సమాచార మందితే తక్షణమే స్పందించి మానవత్వం. అసాధ్యాలను సుసాధ్యం చేసే ధీరత్వం. ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా తన యాస భాషను మార్చుకుంటూ అటు అమెరికా నుంచి పల్లెల్లో ముసలవ్వ దాకా అర్థమయ్యేరీతిలో కేటిఆర్‌ ‌ప్రసంగాలు ప్రజల్ని ఆకట్టుకుంటాయి. ఐటీ మంత్రిగా ఎన్నో అంతర్జాతీయ ఐటీ సంస్థలను తెలంగాణకు తీసుకురావడంలో కేటిఆర్‌ ‌కృషికి తనకు వరించిన అవార్డులే నిదర్శనం. ఐటీ రంగానికే అందం తెచ్చిన మంత్రిగా పేరుపొందాడు.

ఎదైనా సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కంపెనీల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు హైదరాబాదుకు వచ్చినప్పుడు, వాళ్లు కేటీఆర్‌ ‌మేధస్సుకు, ఆలోచన విధానానికి తన మాట తీరుకు ఫిదా అయ్యి మా దగ్గర కూడా మీలాంటి నాయకుడు ఉండివుంటె బాగుండు అని అభినందించినా వారెందరో. ఎన్నికలేవైన సరే తన స్టైల్‌, ‌తన వాగ్ధాటితో హేమాహేమీలైన రాజకీయ నాయకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. కేటీఆర్‌ అం‌టే యువతరానికి మార్గదర్శి ఎప్పుడు ఎలాంటి సమస్య ఎదురైనా విద్యావంతులైన యువతి, యువకులకు వెంటనే గుర్తొచ్చే పేరు కేటీఆర్‌, ‌తన సమస్యను ప్రస్తావిస్తూ ఒక్క ట్వీట్‌ ‌చేస్తేచాలు, క్షణాల్లో స్పందించి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తాడు, ఎంతో మంది ప్రాణాలను కాపాడి, వేలమంది జీవితాలకు వెలుగులు నింపింది ఖు=•=• ట్విట్టర్‌.
అదేవిధంగా చేనేత కుటుంబాల్లో వెలుగులు నింపిన చంద్రుడు కేటీఆర్‌. ‌చేనేత రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఎన్నో అద్భుతాలను సృష్టించి చేనేత బతుకులకు భరోసా కల్పించాడు. వారసత్వమన్న ముద్రా పడకుండా తనసత్త చాటుకుంటు దూసుకెళ్తున్నాడు. తన చిన్నతనంలో స్కూల్‌ ‌కి వెళ్లేటప్పుడు స్కూల్‌ ‌ముందు ఐస్క్రీం అమ్మె తాతని సైతం మర్చిపోలేదు,అంతేకాకుండా ఐస్క్రీం తాతను కలిసి బాగోగులు తెలుసుకొని ఇకనుండి అన్నీ తానైతనని హామీ ఇచ్చిన మనసున్న మారాజు మా రామన్న.తన జన్మదిన సందర్భంగా అభిమానులకు ప్రతి సంవత్సరం ఒక విషయాన్ని విజ్ఞప్తి చేస్తారు. ప్లేక్సీహోడింగ్‌ ‌లు, పువ్వుల బొకేలతో అనవసర ఖర్చులు వద్దని గుర్తుచేస్తారు.

+ఱ•• • •ఎఱశ్రీవ కార్యక్రమంలో భాగంగా ఈ కొరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్న నిరుపేదలకు నిత్యవసర వస్తువులు, అనాధ, వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు, పేదవారికి సహాయం చేయాలని, ఆపదలో ఉన్న వారికి అండగా నిలుద్దమనీ తెలిపిన గొప్ప నాయకుడు కేటీఆర్‌.
‌గత సంవత్సరం అంబులెన్స్ ‌లను వివిధ ప్రాంతాలకు అందించారు. దీనినే స్ఫూర్తిగా తీసుకొని తన అభిమానులు, పార్టీ నాయకులు తమ ప్రాంతాలకు కేటీఆర్‌ ‌జన్మదిన సందర్భంగా అంబులెన్స్ ‌లను సమకూర్చారు. దీని ద్వారా ఎంతో మంది పేద ప్రజలు ఈ సేవలను వినియోగించుకుంటూ కేటీఆర్‌ ‌ని నిత్యం కోలుచుకుంటున్నా సందర్భం. ఈసారి జన్మదిన సందర్భంగా వికలాంగులకు స్కూటీ వాహనాలను అందించేందుకు నిర్ణయించారు. దీనినే అభిమానులు ఆచరిస్తూ పార్టీ నాయకులు,ప్రజాప్రతినిధులు కొన్నివేల వాహనాలను తమ సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. ఎంతో మంది వికలాంగులు కేటీఆర్‌ ‌జన్మదినాన్ని పండుగ రోజున జరుపుకుంటున్న సందర్భం. అదే విధంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ ‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ముక్కోటి వృక్షార్చాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామై మూడు మొక్కలు నాటి కేటీఆర్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని కోరారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు మొక్కలు నాటే కార్యక్రమానికి సిద్ధమయ్యారు. భవిష్యత్తులో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో, కేసీఆర్‌-‌శోభా ‘అమ్మ’ఆశీస్సులతో ఉన్నతమైన పదవిని పొందాలని కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు.

నేడు కేటిఆర్‌ ‌జన్మదినం సందర్భంగా

– గుండమల్ల సతీష్‌ ‌కుమార్‌
‌టీఆర్‌ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి
94931 55522.

Leave a Reply