Take a fresh look at your lifestyle.

కోనేరు నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభం

కాగజ్‌నగర్‌, ‌జూన్‌ 12, ‌ప్రజాతంత్ర విలేఖరి :కాగజ్‌నగర్‌ ‌పట్టణంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కోనేరు చారిటబుల్‌ ‌ట్రస్ట్ ఆధ్వర్యంలో కాగజ్‌నగర్‌ ‌పట్టణంలోని బస్టాండ్‌ ఎదురుగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ ‌కుమార్‌, ఆదిలాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కమీషనర్‌ ‌జోగు ప్రేమేందర్‌ ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యా రు. ఈ సందర్భంగా  సిర్పూర్‌ ‌నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప మాట్లాడుతూ నా ఊపిరి ఉన్నంత వరకు కాగజ్‌నగర్‌ ‌పట్టణంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తానని, ప్రజలకు సేవ చేసుకోవటమే నా ధ్యేయమని, మూడు సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ఈ ప్రజలకు ఎంతో ఋణపడి ఉంటానని అన్నారు. నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల ప్రజలు తమ పనుల మీద కాగజ్‌నగర్‌ ‌వస్తుంటారని వారందరి ఆకలి తీర్చటానికే  ఈ కార్యక్రమం ప్రారంభిం చామని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే ఆసుపత్రుల కు వైద్యం కోసం వచ్చే రోగులకు వారి వెంట వచ్చే వారు ఎవరైనా ఉంటే తమకు ముందు తెలిపినట్లయితే వారికి నేరుగా ఆసుపత్రికే భోజనం పంపిస్తా మని ఎమ్మెల్యే తెలిపారు.

తనకున్న కొన్ని ఆస్తులను కూడా కోనేరు చారిటబుల్‌ ‌ట్రస్ట్‌కు ఇవ్వనున్నట్లు తెలిపారు. నిత్యాన్నదాన కార్యక్రమా నికి పలువురు దాతలు సహాయ సహకారాలు అందజేస్తున్నారని, కోనేరు చారిటబుల్‌ ‌ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమంలో దాతలు చేస్తున్న సహాయ సహకారాలు ప్రతి నెల తాహసీల్దార్‌ ‌కార్యాలయంలో తెలియజేస్తామని అన్నారు. సిర్పూర్‌ ‌నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిర్వహిస్తున్న సేవా కార్య క్రమాలు ఆదర్శనీయమని ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ ‌కుమార్‌లు పేర్కోన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నారని, మళ్ళీ ఇంతటి మహోత్తమరమైన కార్యక్రమం నిర్వహించడం గర్హనీయమని అన్నారు.

Leave a Reply