Take a fresh look at your lifestyle.

తెలంగాణలో భూ మాఫియా చెలరేగిపోతుంది

  • జర్నలిస్ట్ రఘును తక్షణమే విడుదల చేయాలి
  • తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్

ముషీరాబాద్, జూన్ 03 (ప్రజాతంత్ర విలేఖరి) : తొలి వెలుగు ఛానల్ యాంకర్ యువ జర్నలిస్ట్ రఘును భూ మాఫియా కిడ్నాప్ చేసి అరెస్ట్ లాగా చిత్రీకరించడం చూస్తుంటే నయీం భూ మాఫియాకు మించిన మాఫియాకు ఏడేళ్ల తర్వాత అఫిషియల్ లైసెన్స్ ఇచ్చినట్టు గా ఉందని, జర్నలిస్ట్ రఘును వెంటనే విడుదల చేసి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు.

దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి ప్రభుత్వ భూములు అమ్మడానికి కంకణం కట్టుకున్న కెసిఆర్ భూ మాఫియాకు అఫిషియల్ లైసెన్స్ ఇచ్చినట్టు ముఠాలు చెలరేగుతున్నాయని అన్నారు.

రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు భూమి నక్షల గురించి అడగటం లేదని పట్టెడన్నం కోసం, ఉపాధికోసం వెతుకుతున్నారని అన్నారు. బుధవారం జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఉద్యమానికి సంబంధం లేదని పువ్వాడలు, తలసానిలు జెండాలు ఎగరవేయడం అంటే ఉద్యమకారుల ఆత్మ స్థైర్యన్ని దెబ్బతీయడమేనని అన్నారు.

Leave a Reply