Take a fresh look at your lifestyle.

న్యాయవ్యవస్థ మరింత బలోపేతం

  • అందుకు నా వంతు కృషి
  • తెలంగాణలో జడ్జిల సంఖ్యను పెంచాం
  • కేసీఆర్‌ 4 ‌వేల 320కి పైగా ఉద్యోగాల కల్పన
  • చేతికి ఎముక లేనితనానికి ట్రేడ్‌ ‌మార్క్ ‌కెసిఆర్‌
  • ‌తెలంగాణ న్యాయాధికారుల సదస్సులో చీఫ్‌ ‌జస్టిస్‌ ‌రమణ

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 15 : ‌భారత న్యాయవ్యవస్థను మరింత బలపరచాలని భావిస్తున్నట్లు సుప్రీమ్‌ ‌కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ న్యాయధికారుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శుక్రవారం, శనివారం రెండు రోజులపాటు జరుగుతున్న సదస్సులో సిజెఐ మాట్లాడుతూ…తెలంగాణ హైకోర్టులో రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న జడ్జిల పెంపు అంశాన్ని పరిష్కరించామని చెప్పారు. జిల్లా కోర్టుల్లోనూ జడ్జిల సంఖ్య పెంచుతున్నామన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని భావిస్తుంటారని….తెలంగాణలో కేసీఆర్‌ ‌మాత్రం 4 వేల 320కి పైగా ఉద్యోగాలను సృష్టించారని అభినందించారు. చేతికి ఎముక లేని తనానికి ట్రేడ్‌ ‌మార్క్ ‌కేసీఆర్‌ అని జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి కేసీఆర్‌ ‌కృషిచేస్తున్నారని తెలిపారు.

కేసుల త్వరితగతిన పరిష్కారానికి జడ్జిల సంఖ్య పెంపు అవసరం అని, రాష్ట్ర హైకోర్టులో ఇటీవల జడ్జిల సంఖ్య పెంచి రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించామని తెలిపారు. న్యాయవ్యవస్థను ఇంకా బలపరచాలని తాము భావిస్తున్నామని, జిల్లా కోర్టుల్లోనూ జడ్జిల సంఖ్య పెంచుతున్నామని అన్నారు. ఇటీవల హైదరాబాద్‌కు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ ‌వి•డియేషన్‌ ‌సెంటర్‌ ‌వొచ్చిందని, వివాదాల సత్వర పరిష్కారానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. తమ రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేంద్రం ఏర్పాటు చేయాలని ఇతర రాష్ట్రాల వారు కోరుతున్నారని జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత న్యాయాధికారుల సమావేశం జరగడం ఇదే తొలిసారని వెల్లడించారు. న్యాయవ్యవస్థను బలపరిచేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్‌ ‌గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో జరిగిన న్యాయాధికారుల సదస్సుకు సీజేఐ ఎన్వీ రమణ, హైకోర్టు సీజే జస్టిస్‌ ‌సతీష్‌ ‌చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ ‌ప్రశాంత్‌ ‌కుమార్‌ ‌మిశ్ర, సీఎం కేసీఆర్‌, ‌మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి హాజరయ్యారు.

Leave a Reply