Take a fresh look at your lifestyle.

భారత్‌లో రైతుల నిరసన సమస్యను లేవనెత్తాలి

  • ఆ దేశ విదేశాంగ మంత్రి పాంపియోకు 7గురు అమెరికా ఎంపిల లేఖ
  • అసంపూర్ణ మరియు తప్పుడు సమాచారం ఆధారంగా వారి వ్యాఖ్యలన్న భారత్‌

‌భారత నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 30 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతుల కోసం భారత్‌లో రైతుల ఆందోళన అంశాన్ని లేవనెత్తాలని కోరుతూ 7 మంది ప్రభావవంతమైన అమెరికా ఎంపీల బృందం విదేశాంగ మంత్రి మైక్‌ ‌పాంపియోకు లేఖ రాసింది. ఈ బృందంలో ఇండియన్‌ అమెరికన్‌ ‌మహిళా ఎంపీ ప్రమీలా జయపాల్‌ ‌కూడా ఉన్నారు. కానీ భారతదేశం రైతుల నిరసనలపై విదేశీ నాయకులు మరియు రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలను ‘‘అనుచితమైనవి’’ మరియు ‘‘అసంపూర్ణ మరియు తప్పుడు సమాచారం ఆధారంగా’’ అని పేర్కొంది.

ఈ విషయం ప్రజాస్వామ్య దేశ అంతర్గత వ్యవహారాలకు సంబంధించినదని కూడా భారత్‌ ‌పేర్కొంది. ఈ విషయంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ ‌శ్రీవాస్తవ మాట్లాడుతూ..‘‘భారతదేశంలో రైతులకు సంబంధించిన కొన్ని అసంపూర్ణ సమాచారం ఆధారంగా మేము వ్యాఖ్యలు చూశాము. ఈ వ్యాఖ్యలు అనుచితమైనవి, అలాగే ఒక ప్రజాస్వామ్య దేశ అంతర్గత వ్యవహారాలతో ముడిపడి ఉన్నాయి.’’ రైతుల విషయంలో అమెరికా ఎంపీలు డిసెంబర్‌ 23‌న పాంపియోకు లేఖ రాశారు.

Leave a Reply