- డిఫెన్స్ అకాడమీ సుబ్బారావు అరెస్ట్‌పై కొనసాగుతున్న సస్పెన్స్
- అదుపులోకి తీసుకోక పోవడంపై అనుమానాలు
- విధ్వంసంపై ప్రశస్తున్నట్లు పల్నాడు ఎస్పీ వెల్లడి
గుంటూరు/హైదరాబాద్, జూన్ 20 : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కుంటున్న సాయి డిఫెన్స్ అకాడవి• డైరెక్టర్ సుబ్బారావు అరెస్ట్‌పై సస్పెన్స్ నెలకొంది. సుబ్బారావును ఇంకా అదుపులోకి తీసుకోలేదని.. విధ్వంసం ఘటనపై ప్రశ్నిస్తున్నామని పల్నాడు ఎస్పీ రవిశంకర్ తెలిపారు. హైదరాబాద్ పోలీసుల నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. డీజీపీ ఆదేశాల మేరకు సుబ్బారావు అరెస్ట్ విషయంలో తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఇక యూపీ పోలీసులు సుబ్బరావును అదుపులోకి తీసుకున్నారనే వార్తల్లో వాస్తవం లేదన్నారు. కాగా ఈ అల్లర్లకు గుంటూరు నుంచే కుట్ర జరిగిందని జీఆర్పీ పోలీసులు తెలిపారు.అయితే ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేయలేదు. కాగా ఏపీ పోలీసుల అదుపులో ఉన్న సుబ్బారావును..
తెలంగాణ పోలీసులు ఎందుకు ప్రశ్నించలేదని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడులకు పాల్పడిన వారు సాయి అకాడవి•కి చెందినవారిగా గుర్తించారు. వాట్సాప్ చాటింగ్, గ్రూప్స్, కాల్ రికార్డింగ్స్‌లో.. సుబ్బారావు పాత్రపై ఆధారాలున్నా ఎందుకు వదిలేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళన చేసిన కొంతమంది యువకులపై పోలీసులు కేసులు పెట్టి జైలుకి పంపించారు. ఆవుల సుబ్బారావు విషయంలో తెలుగు రాష్టాల్ర పోలీసుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ పోలీసులు ఇప్పటివరకు సంప్రదించలేదని ఏపీ పోలీసులు చెబుతున్నారు. అయితే సుబ్బారావు పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని తెలంగాణ పోలీసులు అంటున్నారు. సుబ్బారావు విషయంలో రెండు రాష్ట్రాల పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విధ్వంసం వెనుక ఏపీలోని ప్రకాశం జిల్లా కంభం వాస్తవ్యుడు, తెలుగు రాష్ట్రాల్లోసాయి డిఫెన్స్ అకాడవి పేరుతో శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తున్న ఆవుల సుబ్బారావు అని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు.
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ తీసి..తన ప్రసంగాలతో అకాడవి•లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులను రెచ్చగొట్టి..ఆందోళన కార్యక్రమానికి పథకం పన్ని.. అందుకు వేదికగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఎంపిక చేసి..వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్‌చేసి..అభ్యర్థులను తరలింపులో అన్నీతానై వ్యవహరించారని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. మరోవైపు ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న 9 మందిలో ఆరుగురిని సోమవారం గాంధీ హాస్పిటల్ డాక్టర్లు డిశ్చార్జి చేశారు. మెడికో లీగల్ కేసు కావడంతో పోలీసుల నో అబ్జెక్షన్ తర్వాతే కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక డిశ్చార్జి అయిన వారి వివరాలను జీఆర్పీ పోలీసులు సేకరించారు.
కాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై దాడి ఘటనలో దర్యాప్తు కొనసాగుతుందని రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. ఆందోళనల టైమ్‌లో 45 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని, 44 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 46 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని వెల్లడించారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ఈ ఘటనలో మొత్తం 30 కోచ్‌లు ధ్వంసమయ్యాయి. దాదాపు రూ.20 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఈ దాడిలో మొత్తం 1,500 నుంచి 2 వేల మంది పాల్గొన్నారని వివరించారు. దాడిలో పాల్గొన్న వారందరూ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారేనని, వేరే రాష్ట్రాల వారెవరూ లేరన్నారు.