Take a fresh look at your lifestyle.

భారత వివాహ వ్యవస్థ పరమ పవిత్రం..అతి పటిష్టం

‘‘‌జీవితంలో స్త్రీ పురుషుల మధ్య శాశ్వతంగా జీవన మైత్రిని ఏర్పరుస్తూ, శారీరకంగా మానసికంగా ఏకం చేసే మరుపురాని మధుర ఘట్టమే పరిణయం వేడుక. మానవ సమాజంలో వివాహం ఒక పరమ పవిత్ర విశ్వజనీన, సాంస్కృతిక, చట్టబద్దమైన ఒప్పంద శుభకార్యం. వివాహానికి పర్యాయ పదాలుగా పెళ్ళి, పరిణయం, సప్తపది, కళ్యాణం, పాణిగ్రహణం, కన్యాదానం లాంటివి నిలుస్తాయి. ఒక పురుషుడిని మరియు మహిళను ఏకం చేసే చట్టబద్దమైన, సామాజిక అంగీకారంతో కూడిన విడదీయరాని అనుసంధాన బంధమే వివాహ వేడుక. పెళ్ళి అనబడే సంప్రదాయ పవిత్ర వేడుక ప్రకారం ఏకమైన స్త్రీ పురుషులు కుటుంబంగా రూపాంతరం చెంది కొన్ని ప్రత్యేక దాంపత్య ధర్మాలు, లైంగిక సంబంధాలు, హక్కులు మరియు బాధ్యతలు నిర్వహించే అర్హత కలుగుతుంది. వివాహంతో ఒకటైన జంట మధ్య పరస్పర ప్రేమ జనించి విడదీయరాని అనురాగ బంధంగా నిలబడుతుంది.’’

భారతదేశం సత్సంప్రదాయాలకు, సనాతన సంస్కృతికి చిరునామా. మన వైవాహిక వ్యవస్థకు 4250 సంవత్సరాల చరిత్ర ఉంది. సీతారాములు, శివపార్వతులు, వశిష్ట-అరుంధతి ఉత్తమ దంపతులకు ప్రతీకలు. జీవితంలో స్త్రీ పురుషుల మధ్య శాశ్వతంగా జీవన మైత్రిని ఏర్పరుస్తూ, శారీరకంగా మానసికంగా ఏకం చేసే మరుపురాని మధుర ఘట్టమే పరిణయం వేడుక. మానవ సమాజంలో వివాహం ఒక పరమ పవిత్ర విశ్వజనీన, సాంస్కృతిక, చట్టబద్దమైన ఒప్పంద శుభకార్యం. వివాహానికి పర్యాయ పదాలుగా పెళ్ళి, పరిణయం, సప్తపది, కళ్యాణం, పాణిగ్రహణం, కన్యాదానం లాంటివి నిలుస్తాయి. ఒక పురుషుడిని మరియు మహిళను ఏకం చేసే చట్టబద్దమైన, సామాజిక అంగీకారంతో కూడిన విడదీయరాని అనుసంధాన బంధమే వివాహ వేడుక. పెళ్ళి అనబడే సంప్రదాయ పవిత్ర వేడుక ప్రకారం ఏకమైన స్త్రీ పురుషులు కుటుంబంగా రూపాంతరం చెంది కొన్ని ప్రత్యేక దాంపత్య ధర్మాలు, లైంగిక సంబంధాలు, హక్కులు మరియు బాధ్యతలు నిర్వహించే అర్హత కలుగుతుంది. వివాహంతో ఒకటైన జంట మధ్య పరస్పర ప్రేమ జనించి విడదీయరాని అనురాగ బంధంగా నిలబడుతుంది.

Indian marriage system

కల్యాణంతో కలిసి పోయిన దంపతుల మధ్య స్వల్ప విభేదాలు పొడచూపినా ధర్మం అనే శక్తి వారిని అవిచ్ఛిన్నంగా ఒకటిగా ఏకం చేస్తూ ఉంటుంది. వివాహ శుభకార్యాలు కుల, మత, తెగలను బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని సంస్కృతుల్లో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధ అర్హత కోసం చేసుకోబడే ఒప్పందంగా అర్థం చేసుకోవాలి. వివాహాలలో ఏకవివాహాలు (ఒక పురుషుడికి ఒక స్త్రీకి మధ్య పెళ్ళి), బహుభార్యత్వం (ఒక పురుషుడికి ఒకటి కన్న ఎక్కువ భార్యలు), బహుభర్తృత్వం(ఒక స్త్రీకి ఒకరి కన్న ఎక్కువ భర్తలు), స్వలింగ వివాహాలు లాంటి రకాలు ఉన్నాయి. దంపతుల మధ్య తీవ్ర విభేదాల కారణంగా కొన్ని వివాహబంధాలు విడాకుల వరకు పోవడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా వివాహబంధం బలహీనమైన దేశాల్లో విడాకులు అత్యధికంగా రికార్డు అవుతున్నాయి. విడాకులు అధికంగా జరుగుతున్న దేశాలలో లాక్సెన్‌బర్గ్ (87 ‌శాతం), స్పేయిన్‌(65 ‌శాతం), ఫ్రాన్స్ (55 ‌శాతం), రష్యా (51 శాతం), యూయస్‌(46 ‌శాతం), జర్మనీ (44 శాతం), యూకె(42 శాతం), న్యూజిలాండ్‌ (42 ‌శాతం), ఆస్ట్రేలియా(38 శాతం) మరియు కెనడా (38 శాతం) ఉన్నాయి. వివాహ వ్యవస్థకు అత్యధిక పవిత్ర ప్రాధాన్యత కలిగిన ఇండియాలో అతి తక్కువ విడాకులు నమోదు చేసే దేశంగా భారత్‌ ‌ప్రథమ స్థానంలో ఉండడం సంతోషదాయకం. అత్నల్ప విడాకులు కలిగిన దేశాల్లో ఇండియా (1 శాతం), చిలీ (3 శాతం), కొలంబియా (9 శాతం), మెక్సికో (15 శాతం), కెన్యా(15 శాతం), దక్షిణ ఆఫ్రికా (17 శాతం), ఈజిప్ట్ (17 ‌శాతం), బ్రెజిల్‌ (21 ‌శాతం), టర్కీ (22 శాతం) మరియు ఇరాన్‌ (22 ‌శాతం)లలో తక్కువ నమోదు అవుతున్నాయి.

హిందూ సంప్రదాయంలో పెళ్ళికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. వివాహితులు మాత్రమే కొన్ని హిందూ సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించే అర్హతను కలిగి ఉంటారు. హిందూ సంప్రదాయ కల్యాణాల్లో ముఖ్యమైన ఘట్టాలుగా పెళ్ళిచూపులు, నిశ్చితార్థం, వరపూజ, ఎదురుకోలు, గౌరీపూజ, మంగళస్నానాలు, కాళ్లుకడగడం, కన్యాదానం, సుముహుర్తం, మంగళసూత్రధారణ, తలంబ్రాలు, సప్తపది, నాగవల్లి, అరుంధతీ నక్షత్రదర్శనం, అప్పగింతలు లాంటి పలు ముఖ్య ఘట్టాలు ఉంటాయి. హిందూవివాహ చట్టం ప్రకారం 21 ఏండ్లు దాటిన పురుషుడు మరియు 18 ఏండ్లు దాటిన మహిళ మధ్య వివాహం చట్టబద్దంగా చేయవచ్చు. ఈ నిర్థేశిత వయస్సుకు లోబడిన వారు వివాహానికి చట్టరీత్యా అనర్హులుగా పేర్కొనబడింది. పెళ్ళితో ఒకటైన జంటకు సంబంధించిన రెండు కుటుంబాలను ఏకం చేసే శాశ్విత బంధంగా వివాహం గుర్తించబడింది. ఆచార క్రతువులతో జరిగిన హిందూ వివాహం చట్టబద్దమైంది. పెళ్ళి జరిగిన తరువాత ప్రభుత్వ సబ్‌రిజిస్టర్‌ ‌కార్యాలయంలో అధికారికంగా నమోదు చేసుకోవచ్చు. పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళను నిశ్చయ లేదా సంప్రదాయ వివాహాలుగా(అరేంజ్డ్ ‌మ్యారేజ్‌) ‌మరియు యువతీయువకులు ప్రేమించుకొని చేసుకునే వివాహాలను ప్రేమ పెళ్ళిళ్ళు (లవ్‌ ‌మ్యారేజ్‌)‌గా పిలుస్తారు. హిందూ వివాహంలో ఏకమైన భార్యాభర్తలు రెండు శరీరాలుగా ఉన్నప్పటికీ ఒకే ప్రాణంగా మనుగడ సాగించడం జరుగుతుంది. హిందూ వివాహాల్లో బ్రహ్మీ, గాంధర్వ, క్షాత్ర మరియు రాక్షస వివాహ పద్దతులు ఉన్నాయి. పెళ్ళిలో వధూవరులు వేసే ఏడు అడుగుల్లో (సప్తపది) 1వ అడుగు ఇద్దరినీ ఒక్కటి చేయడానికి, 2వ అడుగు శక్తికి, 3వ అడుగు వ్రత సిద్ధికి, 4వ అడుగు ఆనంద సిద్ధికి, 5వ అడుగు పశుసంపదకు, 6వ అడుగు సుఖజీవనానికి మరియు 7వ అడుగు గృహస్థాశ్రమ నిర్వహణకు విష్ణువు అనుగ్రహించారని కోరుకోవడం జరుగుతుంది.

ముస్లిమ్‌ ‌మతాచార వివాహాన్ని నిఖా ద్వారా స్త్రీ పురుషుల మధ్య మత సమ్మతి పొందే న్యాయమైన వైవాహిక ఒప్పందం మాత్రమే. ఈ పెళ్ళిలో ఎలాంటి పవిత్ర క్రతువులు లేదా కార్యాలు ఉండవు. ఈ ఒప్పంద సమయంలో వరుడు వధువుకు మెహర్‌ ‌చెల్లింపుకు అంగీకరించాలి. ముస్లిమ్‌ ‌మతంలో ఒక పురుషుడు నలుగురు స్త్రీల వరకు పెళ్ళి (బహుభార్యాత్వం) చేసుకోవచ్చు, కాని స్త్రీ మాత్రం ఒకే పురుషుడిని వివాహం చేసుకోవాలి. 2019లో ట్రిపుల్‌ ‌తలాక్‌ (‌విడాకుల పద్దతి) రాజ్యాంగ విరుద్ధమని సుప్రీమ్‌ ‌కోర్టు నిషేధించిన విషయం మనకు తెలుసు. బైబిల్‌ ‌ప్రకారం క్రైస్తవ వివాహం అన్నింటి కన్న ఘనమైనదని చెప్పబడింది. క్రైస్తవ వివాహాలను చర్చిలో ఫాదర్‌ ‌మతగురువుగా సాక్షుల సమక్షంలో జరిగే పౌర ఒప్పందంగా గుర్తించాలి. క్రైస్తవ మతంలో ఏక వివాహ నియమం మాత్రమే ఉంది.

మారుతున్న జీవనశైలి, ఆధునిక పోకడలు, ప్రపంచీకరణ, అంతర్జాల ప్రభావం, పాశ్చాత్య పోకడల కారణంగా వివాహ వ్యవస్థకు నెమ్మదిగా బీటలు పడుతూ, నూరేళ్ళ పంట నూరు రోజులకే బలహీనపడుతుంది. పసుపు పారాణి ఆరక ముందే తాళి బరువు అవుతుంది. ఏడు అడుగులు ఏడు రోజుల్లోనే మరిచి పోతున్నారు. వేసిన మూడు ముళ్ళు భార్యాభర్తల మధ్య ముళ్లలా గుచ్చుకుంటున్నాయి. నేడు భారత దేశంలో 14 లక్షల మంది స్త్రీ పురుషులు విడాకులు తీసుకోవడం విచారకరం. దేశంలో అత్యధిక విడాకులు గుజరాత్‌, అస్సాం, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ ‌రాష్ట్రాలలో నమోదు అవుతున్నాయి. సాఫ్ట్‌వేర్‌ ‌రంగంలో అత్యధికంగా 56 శాతం విడాకులు నమోదు అయ్యాయి. విడాకులు పెరగడానికి కారణాలుగా ఆర్థిక స్వేచ్ఛ, అపరిమిత స్వతంత్రం, ఫామిలి కోర్టులు పెరగడం, రెచ్చగొట్టే లాయర్లు, సహనశీలత తగ్గడం, ఆర్థిక వ్యవహారాలు, సామాజిక మాధ్యమాలు, విచ్ఛిన్నమైన ఉమ్మడి కుటుంబాలు, పురుషాధిక్యం, అక్రమ లైంగిక సంబంధాలు, తాత్కాలిక విభేదాలు, చిన్న కుటుంబాల్లో చిచ్చులు పెరగడం లాంటివి ముఖ్యకారణాలుగా గుర్తించబడినవి. పురుషాధిక్యత కారణంగా 42 శాతం, సహనం కోల్పోవడంతో 21 శాతం విడాకులు జరుగుతున్నాయి.

burra madhusudhan rao

Leave a Reply